సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్త ప్రచారం
Posted On:
10 NOV 2022 1:45PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ప్రోత్సహించడం కోసం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, ఫించన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పింఛను & పింఛనుదారుల సంక్షేమ విభాగం దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. నవంబర్ 2021లో కేంద్ర సహాయమంత్రి (పిపి) డాక్టర్ జితేంద్ర సింగ్ లైఫ్ మైలురాయి అయిన సర్టిఫికెట్‌ను మొబైల్ ఫోన్ ద్వారా ముఖ ధ్రువీకరణను సమర్పించే సాంకేతిక పద్ధతిని ప్రారంభించారు. ప్రస్తుతం విభాగం డిజిటల్ మోడ్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను ప్రోత్సహించేందుకు, ముఖ ధ్రువీకరణ సాంకేతికత పద్ధతికి మరింత ప్రాచుర్యం తేవడం కోసం ప్రత్యేక దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తోంది.
రిజిస్టర్ అయిన పెన్షనర్ల అసోసియేషన్లు, పింఛనును చెల్లించే బ్యాంకులు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లను లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు, పింఛనుదారుల జీవితాన్ని సులభతరం చేసేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ / ముఖ ధ్రువీకరణ పద్ధతిని ప్రోత్సహించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ సిరీస్‌లో, పింఛన్లు& పింఛనుదారుల సంక్షేమ విభాగానికి చెందిన కుమారి దెబోరా ఉమేష్ (సెక్షన్ ఆఫీసర్),శ్రీ ఆండ్రూ జొమావియా కర్తక్ (సెక్షన్ ఆఫీసర్) కుమారి తాన్యా రాజ్‌పుట్ (కన్సల్టెంట్)ల నాయకత్వంలోని బృందం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో కేంద్ర ప్రభుత్వ పింఛనుదారుల కోసం ఢిల్లీలోని ఆర్‌కెపురం, సెక్టార్ -1లో ఎజిఎం నాయకత్వంలో1 1 నవంబర్ 2022న ఆర్‌కె పురం బ్రాంచిలో జరుగనున్న ప్రచార శిబిరాన్ని సందర్శిస్తారు. అనంతరం, సెక్టార్ -2 నాయిడాలో 12 నవంబర్ 2022న సందర్శిస్తారు.
డిజిటల్ పద్ధతిద్వారా తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలనుకునే పింఛనుదారులందరూ ఈ కేంద్రానికి రావచ్చు.
***
(Release ID: 1875044)
Visitor Counter : 141