ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తట్టు కేసుల వ్యాప్తిని అంచనా వేయడానికి, నిర్వహించడానికి ముంబయికి ఉన్నత స్థాయి బృందాన్ని పంపుతున్న కేంద్ర ప్రభుత్వం

Posted On: 09 NOV 2022 7:10PM by PIB Hyderabad

ముంబయిలో తట్టు (మీజిల్స్) కేసుల పెరుగుదలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని అక్కడకు పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రజారోగ్య చర్యలు చేపట్టడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించే చర్యలు తీసుకోవడానికి ఈ బృందం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు సహాయం చేస్తుంది.

దిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ (ఎల్‌హెచ్‌ఎంసీ), పుణెలో ఉన్న ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన నిపుణులు ముంబయి వెళ్లే ముగ్గురు సభ్యుల కేంద్ర బృందంలో ఉన్నారు. ఎన్‌సీడీసీ 'సమగ్ర వ్యాధి నిఘా కార్యక్రమం' (ఐడీఎస్‌పీ) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అనుభవ్ శ్రీవాస్తవ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.

ముంబయిలో తట్టు కేసుల వ్యాప్తిని పరిశోధించడానికి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలోనూ పర్యటిస్తుంది. కేసుల పెరుగుదలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన ప్రజారోగ్య చర్యలు, నిర్వహణ మార్గదర్శకాల విషయంలో మహారాష్ట్ర ఆరోగ్య విభాగాలకు సాయం చేస్తుంది.

 

****



(Release ID: 1874851) Visitor Counter : 172


Read this release in: English , Urdu , Hindi , Marathi , Odia