వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
విదేశీ వాణిజ్య విధానం కింద ఎగుమతి ప్రోత్సాహక పథకాల కోసం అంతర్జాతీయ వాణిజ్య సెటిల్‌మెంట్లు భారతీయ రూపాయలలో ఉండేందుకు కేంద్రం అనుమతి
అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు భారతీయ రూపాయలలో ఉండేలా సరళతరం చేసే సౌలభ్యం కల్పించడానికి నిర్ణయం
Posted On:
09 NOV 2022 5:20PM by PIB Hyderabad
అంతర్జాతీయ వాణిజ్య ఏర్పాటును (సెటిల్‌మెంట్)ను భారతీయ రూపాయలు (ఐఎన్ఆర్)లో అంటే ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులు, ఎగుమతి/ దిగుమతుల ఏర్పాటు భారతీయ రూపాయలలో ఉండేలా విదేశీ వాణిజ్య విధానానికి, కార్యనిర్వహణకు సంబంధించిన లఘు పుస్తకానికీ తగిన సవరణలను చేసింది. రిందుకు అనుగుణంగా, విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్ ఇంతకు ముందు, అంటే 16.09.2022 జారీ చేసిన 33/ 2015-20 నెంబర్ నోటిఫికేషన్ ద్వారా ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులు, ఎగుమతి, దిగుమతులు ఐఎన్ఆర్‌లో ఆర్‌బిఐ జులై 11, 2022న జారీ చేసిన ఎ.పి (డిఐఆర్ శ్రేణి) సర్య్కులర్ నెం 10కు అనుగుణంగా ఉండేలా పారా 2.52(డి)ని పరిచయం చేసింది.
పైన పేర్కొన్న నోటిఫికషన్‌కు కొనసాగింపుగా, ఆర్‌బిఐ 11 జులై 2022న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎగుమతులను సాధించడం కోసం ఎగుమతి ప్రయోజనాలను/ ప్రోత్సాహకాలను/ విదేశీ వాణిజ్య విధానం కింద బాధ్యతలను నిర్వర్తించడం కోసం విదేశీ వాణిజ్య విధానంలో పారా 2.53 కింద మార్పులను ప్రవేశపెట్టారు.
భారతీయ రూపాయలలో ఎగుమతులను సాధించడం కోసం తాజా పరిచిన ప్రొవిజన్లను ఎగుమతుల కోసం దిగుమతులు (పారా 2.46 ఎఫ్‌టిపి), ప్రతిష్ఠకలిగినవారిగా గుర్తింపు కోసం ఎగుమలు నిర్వహణ (పారా 3.20 ఎఫ్‌టిపి), అడ్వాన్స్ ఆథరైజేషన్ (ఎఎ -ముందస్తుగా అధికారమివ్వడం) & డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ (డిఎఫ్ఐఎ) పథకాల కింద ఎగుమతి ఆదాయాన్ని గ్రహించడం (పారా 4.21 ఎఫ్‌టిపి),ఎగుమతి ప్రోత్సాహక ఉత్పాదక వస్తువుల (ఇపిసిజి) పథకం కింద ఎగుమతి ఆదాయాన్ని గ్రహించడం (పారా 5.11 ఎఫ్‌టిపి) కోసం నోటిఫై చేశారు.
ఇందుకు అనుగుణంగానే ప్రయోజనాలు/ చొరవలు/ విదేశీ వాణిజ్య విధానం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడాన్ని 11 జులై 2022న ఆర్‌బిఐ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా భారతీయ రూపాయలలో ఉండేలా విస్తరించారు. భారతీయ రూపాయను అంతర్జాతీయీకరించేందుకు పెరుగుతున్న ఆసక్తి కారణంగా, పైన పేర్కొన్న విధాన సవరణలను అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు భారతీయ రూపాయలలో ఉండే సౌలభ్యాన్ని కల్పించేందుకు సరళతరం చేశారు.
***
(Release ID: 1874848)
Visitor Counter : 219