ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సార్వభౌమ గ్రీన్ బాండ్ల వ్యవస్థకు ఆమోదం తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 09 NOV 2022 7:07PM by PIB Hyderabad
భారత సార్వభౌమ గ్రీన్ బాండ్ల వ్యవస్థకు  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి  మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు.    పారిస్ ఒప్పందం ప్రకారం జాతీయ స్థాయిలో ఆమోదించి  నిర్ణయించబడిన సహకారం (NDCs) లక్ష్యాల సాధనకు  భారతదేశం చేస్తున్న కృషి మరింత వేగంగా కార్యరూపం దాల్చడానికి వీలవుతుంది అర్హత కలిగిన గ్రీన్ ప్రాజెక్ట్‌లలో ప్రపంచ మరియు దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి  సహాయపడుతుంది.  సార్వభౌమ గ్రీన్ బాండ్ల   జారీ ద్వారా వచ్చే నిధులను కర్బన ఉద్గారాలను  తగ్గించడానికి దోహద పడే ప్రభుత్వ రంగ సంస్థలు అమలు చేసే  ప్రాజెక్ట్‌లలో పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. 
గ్లాస్గో లో  2021 నవంబర్ నెలలో జరిగిన కాప్ 26 సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'పంచామృతం' విధానం అనుసరించి లక్ష్యాలు సాధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో భారత సార్వభౌమ గ్రీన్ బాండ్ల వ్యవస్థకు రూపకల్పన జరిగింది. గ్రీన్ ప్రాజెక్టుల కోసం సార్వభౌమ గ్రీన్ బాండ్ల ద్వారా నిధులు సేకరిస్తామని 2022-23 కేంద్ర బడ్జెట్ లో చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేందుకు వ్యవస్థ దోహదపడుతుంది. 
పర్యావరణ పరిరక్షణకు దోహదపడే పర్యావరణహిత ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమీకరించడానికి సార్వభౌమ గ్రీన్ బాండ్లు ఆర్థిక సాధనాలుగా ఉపయోగపడతాయి. పర్యావరణ పరమైన అంశాలను కలిగి ఉండే సార్వభౌమ గ్రీన్ బాండ్ల సాధారణ బాండ్లతో పోల్చి చూస్తే తక్కువ మూలధనం అవసరాలను కలిగి ఉంటాయి.  సార్వభౌమ గ్రీన్ బాండ్ల జారీలో విశ్వసనీయత, మార్గదర్శకాలు కీలక అంశాలుగా ఉంటాయి. 
 నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి భారతదేశపు మొట్టమొదటి  సార్వభౌమ   గ్రీన్ బాండ్ల వ్యవస్థ రూపొందించబడింది.  నిబంధనల ప్రకారం   సార్వభౌమ   గ్రీన్ బాండ్ల జారీ పై కీలక నిర్ణయాలు ధృవీకరించడానికి గ్రీన్ ఫైనాన్స్ వర్కింగ్ కమిటీ (GFWC) ఏర్పాటు చేయబడింది.
నార్వే ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ   ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర సెకండ్ పార్టీ ఒపీనియన్ (SPO)గా గుర్తింపు పొందిన  ప్రసిద్ధి చెందిన CICERO ను   భారతదేశ గ్రీన్ బాండ్ల వ్యవస్థను అధ్యయనం చేయడానికి నియమించడం జరిగింది. భారతదేశం రూపొందించిన  సార్వభౌమ గ్రీన్ బాండ్ల వ్యవస్థ  ICMA  గ్రీన్ బాండ్ నిబంధనలు  మరియు అంతర్జాతీయ ఉత్తమ విధానాలు కలిగి ఉందా అన్న అంశంపై  CICERO అధ్యయనం చేసింది. దేశ  సార్వభౌమ   గ్రీన్ బాండ్ల వ్యవస్థకు CICERO "ఉత్తమ పరిపాలన" స్కోర్‌తో 'మీడియం గ్రీన్'గా రేటింగ్ ఇచ్చింది. 
కింది లింక్ ద్వారా నివేదికను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 


(Release ID: 1874847) Visitor Counter : 175


Read this release in: English , Urdu , Marathi , Hindi