సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) ని సమర్థవంతంగా ఉప యోగించుకోవడం వల్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న అభివృద్ధి చెందిన, అవినీతి రహిత భారత దేశ నిర్మాణం సాధ్యం అవుతుంది: లోక్ సభ స్పీక ర్ శ్రీ ఓం బిర్లా


పారదర్శకత, పౌరుల భాగస్వామ్యం మోదీ పాలనా నమూనాకు కొలమానం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో "సిటిజెన్ - సెంట్రిక్ గవర్నెన్స్ త్రూ ఆర్ టి ఐ" అనే అంశంపై జరిగిన కేంద్ర సమాచార కమిషన్ 15వ వార్షిక సదస్సులో ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

2020-21లో 38116 కేసుల నుంచి 2021-22 నాటికి 23405 కేసులకు పెండెన్సీని తగ్గించడంలో సీఐసీ విజయం సాధించింది: డాక్టర్ జితేంద్ర సింగ్

సాధికారత కలిగిన పౌరులు ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన మూలస్తంభం. సమాచారం ద్వారా ప్రజలను శక్తివంతం చేయడానికి సిఐసి నిరంతరం కృషి చేస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2022 12:36PM by PIB Hyderabad

ప్రజలకు సాధికారత కల్పించడం,

పారదర్శకత తీసుకురావడం, వ్యవస్థను అవినీతి నుంచి విముక్తం చేయడం,

ప్రజాస్వామ్యాన్ని నిజమైన అర్థంలో దేశ

ప్రజల చేతుల్లోకి తీసుకోవడం అనేది అనేదే సమాచార హక్కు చట్టం ప్రధాన ఉద్దేశమని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్సిటిజెన్ - సెంట్రిక్ గవర్నెన్స్ త్రూ ఆర్ టి " అనే అంశంపై జరిగిన కేంద్ర సమాచార కమిషన్ 15 వార్షిక సదస్సులోశ్రీ ఓం బిర్లా ప్రసంగిస్తూ, సమాచార హక్కు చట్టం (ఆర్ టి ని సమర్థవంతంగా ఉప యోగించుకోవడం వల్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న అభివృద్ధి చెందిన, అవినీతి రహిత భారత దేశ నిర్మాణం సాధ్యం అవుతుందని అన్నారు.

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ee సదస్సు లో మాట్లాడుతూ, పారదర్శకత, పౌర శ్రేయస్సు పై దృష్టి మోదీ పాలనా నమూనాకు కొలమానం అని అన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పారదర్శకత, జవాబుదారీతనం, పౌర దృష్టి ఆయన పాలన తీరు కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని జితేంద్ర సింగ్ అన్నారు. గత ఎనిమిదేళ్ళలో సమాచార కమిషన్ స్వేచ్ఛను, వనరులను బలోపేతం చేయడానికి దోహదపడేలా ప్రతి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

సాధికారత కలిగిన పౌరులు ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన స్తంభం అని, కేంద్ర సమాచార కమిషన్ సమాచారం ద్వారా ప్రజలను శక్తివంతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

ఆర్ టి చట్టం ఒక స్వతంత్ర చట్టం కాదని, ఇది భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పరిపాలనలో పారదర్శకతను నిర్ధారించడం , సాధారణ పౌరుడి సామర్థ్యాలను పెంపొందించడం వంటి విస్తృత కథనంలో భాగం అని

డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అన్నింటికీ మించి, ఇది పౌరులు, , ప్రభుత్వం పరస్పరం ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి ఉండేందుకు వారధి అని మంత్రి పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వ హయాంలో  పగలు, రాత్రి, దేశ, విదేశాలలో ప్రాంతం నుంచి అయినా ఆర్టీఐ దరఖాస్తులను -ఫైలింగ్ కోసం 24 గంటల పోర్టల్ సర్వీసును ప్రవేశపెట్టామని, జితేంద్ర సింగ్ తెలిపారు. మొబైల్ ఆధారిత అప్లికేషన్లు, -ఫైలింగ్, -హియరింగ్, -నోటిఫికేషన్ మొదలైన వాటిని అభివృద్ధి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నామని, చట్టప్రకారం పరిష్కారాలను పొందడంలో సమాచారాన్వేషకుల పనిని సులభతరం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నామని ఆయన తెలిపారు. సిఐసి అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ పౌరులకు సులభంగా అప్పీళ్లను దాఖలు చేయడానికి వీలు కల్పించింది, అంతేకాకుండా కేసుల ఆడియో వీడియో హియరింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది.

ఫలితంగా 2020-21లో 38116 కేసులు ఉండగా, 2021-22లో 23,405 కేసులకు పెండింగును తగ్గించడంలో కేంద్ర సమాచార కమిషన్ విజయం సాధించిందని మంత్రి తెలిపారు.

సమాచార విస్పోటనం శకంలో విచక్షణారహితంగా ఆర్టీఐ దరఖాస్తులను దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ, దరఖాస్తు ఫైల్ చేయడానికి ముందు అవసరమైన సమాచారం ఆప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉందో లేదో తనిఖీ చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం అన్ని ప్రధాన నిర్ణయాలు, , 

సమాచారం ప్రజా డొమైన్ లో ఉన్నాయని, విశ్వసనీయతతో పారదర్శకతను సాధించామని ఆయన వివరించారు.

మునుపెన్నడూ లేనంతగా మహమ్మారి వల్ల సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆర్టిఐ రెండవ అప్పీళ్లు , ఫిర్యాదులను పరిష్కరించడానికి సిఐసి , ఎస్ఐసిలు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశాయని, కొన్ని కమిషన్లు కొన్ని సమయాల్లో మహమ్మారికి ముందు ఉన్న గణాంకాలను కూడా అధిగమించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. 2019 మహమ్మారికి ముందు సంవత్సరంతో పోలిస్తే జూన్ 2020లో సిఐసిలో కేసుల పరిష్కారం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేసుల విచారణ, పరిష్కారం కోసం వర్చువల్ మోడ్ (ఆడియో-వీడియో)లోకి మార్చే వినూత్న విధానం వల్ల ఇది సాధ్యమైందని మంత్రి తెలిపారు.

మే, 2020 లో మహమ్మారి సవాలు సమయాల్లో, కేంద్ర సమాచార కమిషన్ కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ , కాశ్మీర్ కేంద్ర ప్రాంతాల నుండి ఆర్టిఐ దరఖాస్తులను వర్చువల్ మార్గాల ద్వారాస్వీకరించడం,విచారించడం, , పరిష్కరించడం ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కు చెందిన దరఖాస్తుదారులు ఇంటి నుంచే ఆర్టీఐ దరఖాస్తులను దాఖలు చేసేందుకు, సీఐసీకి అప్పీళ్ల కోసం కూడా అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు గణనీయమైన మార్పు ఏమిటంటే, జమ్మూ & కాశ్మీర్ లోని నివాసేతరులు , రాష్ట్రేతర వ్యక్తులు కూడా ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల సమస్యలు లేదా ఏజెన్సీలకు సంబంధించిన ఆర్ టిఐని దాఖలు చేయడానికి అర్హత కలిగి ఉంటారని ఆయన అన్నారు.

సమాచార హక్కు (ఆర్ టిఐ) చట్టం అప్పీళ్ల పరిష్కారంలో సంబంధిత పెరుగుదలతో పెండింగ్ లో స్థిరమైన క్షీణతను సాధించినందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర సమాచార కమిషన్ ను ప్రశంసించారు.

ప్రధాన సమాచార కమిషనర్ శ్రీ వై.కె.సిన్హా తన ప్రసంగంలో, ఆర్ టిఐ ద్వారా ప్రభుత్వ పారదర్శకత జవాబుదారీతనం స్థాయి పెరిగిందని అన్నారు. ఇది వ్యవస్థలోని అవినీతి విధానాలను నియంత్రించడానికి కూడా దారితీసిందని ఆయన అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన సమాచార కమిషనర్లు, కేంద్ర సమాచార కమిషన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

*******


(రిలీజ్ ఐడి: 1874719) సందర్శకుల సూచీ సంఖ్య : : 174
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil