భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అధ్యక్షతలో కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వశాఖ స్వయంప్రతిపత్తి సంస్థల ఉమ్మడి సమావేశం


• నవంబర్ 26న ఓషన్‌శాట్ ఉపగ్రహ ప్రయోగం..

• మానవ ఛోదిత ‘మత్స్య 6000’పై, 2024 తొలి త్రైమాసికానికి అన్ని పరీక్షలూ పూర్తి.

Posted On: 08 NOV 2022 4:44PM by PIB Hyderabad

     కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల మొట్టమొదటి ఉమ్మడి సొసైటీ సమావేశాన్ని కేంద్ర సైన్స్-టెక్నాలజీ, భూగోళ శాస్త్రాల సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఏర్పాటు చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలైన భారత ఉష్ణమండల వాతావరణ అధ్యయన సంస్థ (ఐ.ఐ.టి.ఎం.) భారత సాగరసేవల జాతీయ కేంద్రం (ఇన్‌కాయిస్), జాతీయ భూగోళ శాస్త్రాల అధ్యయ కేంద్రం (ఎన్.సి.ఇ.ఎస్.ఎస్.), జాతీయ ధ్రువ, సాగర పరిశోధనా కేంద్రం (ఎన్.సి.పి.ఒ.ఆర్.) జాతీయ సాగర సాంకేతిక పరిజ్ఞాన అధ్యయన సంస్థ (ఎన్.ఐ.ఒ.టి.) ఉమ్మడి సమావేశానికి కేంద్రమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సంస్థలన్నీ భేషజాలను వదలి సమగ్రతాభావంతో పనిచేయాలని, "పరిపూర్ణ ప్రభుత్వ" భావనతో కృషిచేయాలని పిలుపునిచ్చారు. వివిధ సంస్థల కార్యకలాపాల సమగ్రతకోసం మొత్తం ఐదు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలను కేంద్ర భూగోళ శాస్త్రాల పరిధిలో ఏకైక సొసైటీగా విలీనం చేశారు.  

https://ci4.googleusercontent.com/proxy/HWeBRwYEgJuVAUIXneJqmTzc2jTc1pFUrWTU_k-2EU98-sBuIB5_kEhZg077xPRshOh4rlI0joAe9cCb0IEqM2DQfAR78YFPnv14hDy0NvnzMJKIP1Z9Oiy62A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EQVN.jpg

  ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా అనుకరణను నివారించడం, ఏకపక్షంగా పని చేయడం మానుకుని గరిష్ట ఉత్పత్తిని సాధించడానికి మరింత ఎక్కువ సమగ్రతను లక్ష్యంగా పెట్టుకోవడం అవసరమని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి సైన్స్ పట్ల సహజంగానే అభిరుచి ఉందని, అంతే కాకుండా గత ఏడెమిదేళ్లలో సైన్స్-టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడాంనికి, తగిన ప్రోత్సాహం అందించడానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నారని కేంద్రమంత్రి అన్నారు.

  ఈ రోజు జరిగిన సమావేశంలో సొసైటీ అధ్యక్షుడి హోదాలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో పాటు సొసైటీ ఇతర సభ్యులుగా ఉన్న పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్,.. అంతరిక్ష శాఖ కార్యదర్శి ఎస్. సోమనాథ్,.. సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్, కేంద్ర పారిశ్రామిక, విజ్ఞాన శాస్త్ర పరిశోధనా విభాగం కార్యదర్శి డాక్టర్ కలైసెల్వి, బెంగుళూరుకు చెందిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్, కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పి.ఎస్. గోయెల్,..రక్షణ శాఖ/ కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్  హర్ష్ కె. గుప్తా,..భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి, బెంగుళూరుకు చెందిన ఎన్.ఐ.ఎఎస్.  డైరెక్టర్, డాక్టర్ శైలేష్ నాయక్,. ఎన్.ఐ.ఒ.టి. డైరెక్టర్ డాక్టర్ జి.ఎ. రామదాస్,..ఇన్‌కాయిస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ టి. శ్రీనివాస కుమార్, ఐ.ఐ.టి.ఎం. డైరెక్టర్ డాక్టర్ ఆర్. కృష్ణన్,. ఎన్.సి.ఇ.ఎస్.ఎస్. డైరెక్టర్ ప్రొఫెసర్ జ్యోతిరంజన్ ఎస్. రే,.. ఎన్.సి.పి.ఒ.ఆర్. డైరెక్టర్, డాక్టర్ థంబన్ మేలోత్ ఈ సమావేశం జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

    సమావేశంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "సాగర తీర ప్రాంతాల నిఘా" అనే భావనను, కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కొత్త స్థాయికి తీసుకువెళ్లిందని, విలువైన సమాచారాన్ని భద్రతాసంస్థలతో పంచుకోవడానికి ఇపుడు స్పేస్ అప్లికేషన్‌లను కూడా ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. ఓషన్‌శాట్‌ ఉపగ్రహాన్ని 2022, నవంబర్ 26న ప్రయోగించబోతున్నామని, నాసా-ఇస్రో రాడార్ యవస్థను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రస్తుతం పురోగమన దశలో ఉందని మంత్రి తెలియజేశారు. రేడియో నావిగేషన్ వ్యవస్థలతో పాటు, స్థాన సమాచారం ముఖ్య వనరులలో ఒకటిగా గ్లోబల్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (జి.ఎన్.ఎస్.ఎస్.)ను మరింత ఎక్కువగా వినియోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్జారు. ఇవి నౌక ఉన్న చోటు, నౌక నడిచే మార్గం, వేగంపై సమాచారాన్ని సమీపంలోని నౌకలకు, భూ-ఆధారిత నౌకల ట్రాఫిక్ సేవలతో  మార్పిడి చేస్తాయని ఆయన చెప్పారు.

https://ci6.googleusercontent.com/proxy/CUVePZx9z05D3RzFuigLi1SD2TkFeX87cwstncWfImdpqNgKDZF_uhz5ukbuLPOiOyPNCEFoLJ3eBb1JbNA6546emWvcuussj_fForVgVVZOEvIMzJFEAESsHA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YMN0.jpg

     మానవ ఛోదిత జలంతర్గామి వాహనమైన- మత్స్య- 6000 రూపకల్పన, అభివృద్ధిపై కేంద్రమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఎన్. ఒ.ఐ.టి.-భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశోధనా నౌక ఒ.ఆర్.వి. సాగర్ నిధిని ఉపయోగించి మానవ ఛోదిత జలంతర్గామి వాహనం సాయంతో తక్కువ లోతు సముద్ర జలాల్లో నీటి పరీక్షల నిర్వహణా ప్రక్రియను 2024 మొదటి త్రైమాసికంలో పూర్తిచేయనున్నట్టు పూర్తి చేసినట్లు చెప్పారు. ఉప విడి భాగాల ఏకీకరణ, పరీక్షల నిర్వహణను 2023 మూడవ త్రైమాసికం నాటికి  పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. డి.ఎన్.వి. ఆమోదించిన ఇంటర్‌ఫేస్ విధానాలను, ప్రమాణాలను అనుసరించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు ఆయన తెలిపారు.

    సాగరవనరుల పరిజ్ఞాన వైజ్ఞానిక సమాజం ప్రయోజనం కోసం, కేంద్ర భూగోల శాస్త్రాల మంత్రిత్వ శాఖ చేపట్టిన డీప్ ఓషన్  పథకమైన సముద్రయాన్ కార్యక్రమం కింద లోతైన జలాల్లోపయనించే మానవ ఛోదిత మత్స్య 6000 జలంతర్గామ వాహనాన్ని రూపొందించినట్టు కేంద్రమంత్రి చెప్పారు.  స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఎన్.ఐ.ఒ.టి. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో  రూపొందించిందని అన్నారు. బ్యాటరీతో నడిచే మత్స్య 6000 అనే జలంతర్గామి వాహనం, 6,000 మీటర్ల నీటి లోతు వరకు ముగ్గురు వ్యక్తులను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, సాధారణ పరిస్థితుల్లో 12 గంటలపాటు, అత్యవసర మద్దతుతో 96 గంటల పాటు శాస్త్రీయ అన్వేషణ ప్రక్రియను ఇది నిర్వహించగలదని అన్నారు.

  మానవ ఛోదితమైన ఈ జలంతర్గామి వాహనానికి లోతైన సముద్ర ప్రాంతాలకు శాస్త్రవేత్తలను తీసుకెళ్లగలిగే సానుకూలతలు ఉన్నాయని,  తీవ్రమైన అసాధారణ పరిస్థితుల్లో జీవుల ఉనికిపై పరిశోధన, జీవసంబంధమైన నమూనాల సేకరణ, ఆవాసాల విశ్లేషణ, సముద్ర ఖనిజ అన్వేషణ వంటి అంశాలపై పరిశోధనకు ఇది ఉపకరిస్తుందని అన్నారు.  

  కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎం. రవిచంద్ర మాట్లాడుతూ

 లోతైన నీటిలో పరిశోధనకు సంబంధించిన కస్టమ్ డిజైన్, రియలైజేషన్,  ఇతర ఉప వ్యవస్థల పరీక్షల నిర్వహణలో సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుంటూనే, జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో దీర్ఖకాలిక అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. విక్రం సారాభాయ్ అంతరిక్షకేంద్రం (వి.ఎస్.ఎస్.సి.-ఇస్రోతో కలసి 6,000 మీటర్ల లోతున ఆపరేషన్ సామర్థ్యం కోసం టైటానియం అల్లాయ్ సిబ్బంది కార్యకలాపాలు ప్రస్తుతం  పురోగతిలో ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించి ఆమోదం కోసం డిజైన్ పత్రాన్ని డి.ఎన్.వి.కి  ఇప్పటికే సమర్చించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మిశ్రధాతు నిగం (మిధాని)లో ఇన్‌గాట్ మెటీరియల్ ప్రాసెసింగ్ పరీక్ష కొనసాగుతోందని, ఎల్.అండ్ టి. సంస్థలో ఫోర్జింగ్ ప్రక్రియకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్.పి.ఎస్.సి.)-ఇస్రోలో ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ సౌకర్యాన్ని బలోపేతం చేసే ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

  

<><><>


(Release ID: 1874610) Visitor Counter : 208


Read this release in: English , Urdu , Hindi , Tamil