పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇన్‌బౌండ్ పర్యాటకం పునరుద్ధరణను వేగవంతం చేయడానికి లండన్‌ లోని ప్రపంచ పర్యాటక మార్కెట్ 2022 (డబ్ల్యూ.టి.ఎం) లో పాల్గొంటున్న - భారతదేశం

Posted On: 08 NOV 2022 1:51PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు

*     డబ్ల్యూ.టి.ఎం-2022 లో "ఇండియన్ పెవిలియన్‌" ను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు  యు.కెలోని భారత హైకమిషనర్ ప్రారంభించారు

*     డబ్ల్యూ.టి.ఎం-2022 లో "ఇండియన్ పెవిలియన్‌" లో  20 మందికి పైగా పాల్గొన్నారు. 

*      సంవత్సరం ప్రదర్శన ఇతివృత్తం - "భవిష్యత్ ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతుంది

*     బహుళ ఉత్పత్తి దేశంగాడబ్ల్యూ.టి.ఎంవద్ద స్థిరత్వం తో ఏడాది పొడవునా గమ్యస్థానంగా  భారతదేశాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది 

2022 నవంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు లండన్ లో జరుగుతున్న, అతిపెద్ద అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలో ఒకటైన ప్రపంచ పర్యాటక మార్కెట్ - 2022 (డబ్ల్యూ.టి.ఎం) లో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ పాల్గొంటోంది.  "భవిష్యత్ ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతుందిఅనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రదర్శన జరుగుతోంది.   ఇన్‌బౌండ్ పర్యాటకాన్ని పునరుద్ధరించి, మహమ్మారికి ముందు స్థాయికి పెంచాలనే ఉద్దేశ్యంతో డబ్ల్యూ.టి.ఎం. లో భారతదేశం పాల్గొంటోంది.

పర్యాటక మంత్రిత్వ శాఖ 650 చ.మీ. స్థలాన్ని తీసుకుంది. ఈ ప్రదర్శనలో "ఇండియన్ పెవిలియన్" చుట్టూ 20 మందికి పైగా భాగస్వాములు పాల్గొంటున్నారు.  కేరళ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖ మంత్రుల సమక్షంలో, డబ్ల్యూ.టి.ఎం-2022 లో "ఇండియన్ పెవిలియన్‌" ను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్  మరియు  యు.కె. లోని భారత హైకమిషనర్ శ్రీ విక్రమ్ దొరైస్వామి లాంఛనంగా ప్రారంభించారు.    రిబ్బను కత్తిరించడం, జ్యోతి ప్రజ్వలన, గణపతి ప్రార్థన తర్వాత కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్వాగత వచనాలు అనంతరం యు.కె. లోని భారత హైకమిషనర్ స్వాగత వచనాలతో "ఇండియా పెవిలియన్" ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

ప్రారంభోత్సవం అనంతరం భారత ప్రతినిధులు వివిధ రాష్ట్రాలు, భాగస్వాములు పాల్గొన్న "ఇండియన్ పెవిలియన్" తో పాటు ఇతర ప్రదర్శన స్టాల్స్ ను తిలకించారు.  "ఇన్‌క్రెడిబుల్ ఇండియా" ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, యోగా  సెషన్‌లు, హీనా, బాలీవుడ్ నృత్య ప్రదర్శనలను కూడా నిర్వహించింది.  ఈ సందర్భంగా డబ్ల్యూ.టి.ఎం. ప్రాంగణంలోని ఫ్యూచర్ స్టేజ్‌ లో “బాధ్యతాయుతమైన పర్యాటకం కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్” అనే అంశంపై నిర్వహించిన సదస్సులోనూ; అదేవిధంగా, సస్టైనబిలిటీ స్టేజ్ లో “తదుపరి సంక్షోభానికి సిద్ధమవుతూ - దీర్ఘకాల స్థిరత్వాన్ని చేరుకోవడం” అనే అంశంపై జరిగిన మరొక సదస్సులోనూ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. 

అనంతరం రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, ఏ.బి.టి.ఏ. అధికారులతో నిర్వహించిన చర్చల్లో, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ మరియు అదనపు కార్యదర్శి శ్రీ రాకేష్ కుమార్ వర్మ పాల్గొన్నారు.  పర్యాటక వాణిజ్యం, మీడియా ప్రతినిధులతో శ్రీ రాకేష్ వర్మ సమావేశాలు నిర్వహించి, మహమ్మారి తర్వాత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల గురించి వారికి వివరించారు.

డబ్ల్యూ.టి.ఎంమొదటి రోజు కాపర్ చిమ్నీవెస్ట్‌ ఫీల్డ్ మాల్‌ లో జరిగిన "ఇండియా ఈవినింగ్కార్యక్రమంలోని ముఖ్యాంశాలు:

*     "ఇండియా ఈవినింగ్‌" కి ఆహ్వానితుల్లో భారతదేశం మరియు యు.కె. కి చెందిన పర్యాటక వాణిజ్య ప్రతినిధులు, ప్రవాస భారతీయులు ఉన్నారు.

 

*    2022 నవంబర్, 7వ తేదీన జరిగిన "ఇండియా ఈవినింగ్" కార్యక్రమంలో, డబ్ల్యూ.టి.ఎం-2022 లో భాగస్వాములైన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖ మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

*     భారతదేశాన్ని బహుళ ఉత్పత్తి దేశంగా మరియు ఏడాది పొడవునా స్థిరత్వంతో కూడిన గమ్యస్థానంగా ప్రచారం చేయడానికి వీలుగా పరస్పరం సహకరించుకోడానికి, చర్చలు జరపడానికి, "ఇండియా ఈవినింగ్" కార్యక్రమం ఒక వేదికను అందించింది.

లండన్ లోని ప్రపంచ పర్యాటక మార్కెట్ లోని "ఇన్‌క్రెడిబుల్ ఇండియా పెవిలియన్‌" ను భారత హైకమిషనర్ శ్రీ విక్రమ్ దొరైస్వామి; కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్; పలు రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులు; టూరిజం భాగస్వాముల సమక్షంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు.

pic.twitter.com/qrxf37KxjS

—  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ   (@tourismgoi) November 7, 2022

భారత పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ "ఇండియా ఈవినింగ్‌" లో స్వాగతోపన్యాసం చేస్తూ వైద్య విలువ ప్రయాణం,  వెల్నెస్, లగ్జరీ రైళ్లు వంటి వివిధ రకాల పర్యాటక ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ వ్యాపార సమాజానికి ప్రదర్శించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలు, లక్ష్యాలను నొక్కి చెప్పారు. 

దీంతో ఆసియాలో అత్యంత ఇష్టపడే గమ్యస్థానంగా, భారతదేశం తన ప్రయాణాన్ని పునః ప్రారంభిస్తుంది. 

#WorldTravelMarketLondon #WTM2022 #WTMLDN #DekhoApnaDesh pic.twitter.com/2ZDzMfyWS4 

— కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ (@tourismgoi) November 7, 2022

సంబంధిత కథనాలు:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1873930

*****


(Release ID: 1874609) Visitor Counter : 219


Read this release in: English , Urdu , Hindi , Tamil