హోం మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురుపురబ్ వేడుకలకు ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అదే స్పూర్తితో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ ఏ) యాత్రికులకు సాఫీగా, సౌకర్య వంతమైన ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు గురుపురబ్ సందర్భంగా భారతీయ సిక్కు యాత్రికుల నంకానా సాహిబ్ సందర్శనకు కేంద్ర హోంశాఖ వెసులుబాటు
2022 నవంబర్ 6న అట్టారీ రోడ్డు మీదుగా ఎస్ జి పీ సి , డి ఎస్ జి ఎం సి తదితర సంస్థల ఆధ్వర్యంలో మొత్తం 2,420 మంది భారతీయ సిక్కు యాత్రికులు 2022 గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ బయలుదేరారు.
యాత్రికులకు సచ్చా సౌదాలోని నంకానా సాహెబ్ సందర్శన కోసం 10 రోజుల (06-15 నవంబర్ 2022) పాకిస్తాన్ పిల్ గ్రిమ్ వీసా జారీ
గురుపురబ్ సందర్భంగా ఐసిపి డేరాబాబా నానక్, అమృత్ సర్ ద్వారా పాకిస్తాన్ లోని శ్రీ కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేసిన మరో 433 మంది భారత దేశ సిక్కు యాత్రికుల బృందం
Posted On:
08 NOV 2022 7:40PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోద
గురుపురబ్ వేడుకలకు ఎల్లప్పుడూ
ప్రత్యేక ప్రాధాన్యత ను ఇచ్చారు. అదే స్పూర్తితో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యాత్రికులకు సాఫీగా, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు గురుపురబ్ సందర్భంగా భారతీయ సిక్కు యాత్రికుల నాన్కానా సాహిబ్ సందర్శనకు హోం మంత్రిత్వ శాఖ వెసులుబాటు కల్పించింది.
2022 నవంబర్ 6న అట్టారీ రోడ్డు మీదుగా ఎస్ జి పీ సి , డి ఎస్ జి ఎం సి తదితర సంస్థల ఆధ్వర్యంలో 2,420 మంది భారతీయ సిక్కు యాత్రికులు 2022 గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ కు బయలుదేరారు.
నాన్కానా సాహిబ్, సచ్చా సౌదా మొదలైన వాటి సందర్శన కోసం భారతీయ సిక్కు యాత్రికులకు 10 రోజుల పాకిస్తాన్ పిల్ గ్రిమ్ వీసా (06-15 నవంబర్ 2022 నుండి) జారీ చేయబడింది . ప్రధానంగా ఎస్ జి పి సి, డి ఎస్ జి ఎం సి, హర్యానా యాత్రిక్ జాతా, సుఖ్మణి సాహబ్ సేవా సొసైటీ, హర్యానా మొదలైన వివిధ సిక్కు మత సంస్థల ఆధ్వర్యం లో ప్రయాణించారు. యాత్రికులు 2022 నవంబర్ 15 నాటికి తిరిగి రావాల్సి ఉంది.
దిగువ పేర్కొన్న వివిధ సిక్కు సంఘాలకు చెందిన ప్రముఖ నాయకులు గురుపురబ్ యాత్రికుల బృందం లో ఉన్నారు.
1. ఎస్ జి పి సి - మాస్టర్ ప్రీత్ సింగ్ బసైర్, మాజీ ఎస్ జిపిసి సభ్యుడు అజ్నాలా
2. డి ఎస్ జి ఎం సి -దల్జీత్ సింగ్, డి ఎస్ జి ఎం సి సభ్యుడు
3. హర్యానా యాత్రి సిక్కు జాతా - శరణ్ జీత్ సింగ్ గ్రోవర్
4. సిక్కు యాత్రి జమ్మూ - షంషేర్ సింగ్
5. సుఖ్మణి సాహెబ్ సేవా సొసైటీ, హర్యానా - గుర్దీప్ సింగ్
6. భాయ్ మర్దానా గ్రూప్ (ఫిరోజ్ పూర్)- సర్దార్ సుచా సింగ్.
అదేవిధంగా, భారతదేశం నుండి మొత్తం 433 మంది యాత్రికులు ఈ రోజు అమృత్ సర్ లోని ఐసిపి డేరా బాబా నానక్ ద్వారా పాకిస్తాన్ లోని శ్రీ కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి గురుపురాబ్ సందర్భంగా ప్రార్థనలు చేశారు.
యాత్రికుల్లో 429 మంది భారతీయులు, నలుగురు ఒసిఐ కార్డుదారులు ఉన్నారు.
యాత్రికులందరూ ప్రార్థనలు చేసిన తరువాత తిరిగి వచ్చారు.
*****
(Release ID: 1874608)
Visitor Counter : 183