సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆకాశవాణి కి చెందిన అన్ని వాణిజ్య కార్యకలాపాల కోసం - బ్రాడ్ కాస్ట్ ఎయిర్-టైమ్ షెడ్యూలర్ (బి.ఏ.టి.ఎస్) అమలు
प्रविष्टि तिथि:
07 NOV 2022 7:12PM by PIB Hyderabad
ప్రసారభారతి కి చెందిన అన్ని వాణిజ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించి, ఆటోమేట్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో, ఆకాశవాణికి చెందిన అన్ని వాణిజ్య కార్యకలాపాల కోసం, ఒక పూర్తి ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ & బిల్లింగ్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ - "బ్రాడ్ కాస్ట్ ఎయిర్-టైమ్ షెడ్యూలర్ (బి.ఏ.టి.ఎస్)" ను, ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ మయాంక్ అగర్వాల్; ప్రసారభారతి సభ్యుడు (ఫైనాన్స్) శ్రీ డి.పి.ఎస్. నేగి 2022 నవంబర్, 7వ తేదీన, ప్రసార భారతి సచివాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రసార భారతి సీ.ఈ.ఓ. శ్రీ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ, “మెరుగైన సేవల కోసం ఆకాశవాణి ఒక సమగ్ర విధానాన్ని అవలంబిస్తోంది. మొత్తం కార్యకలాపాలలో బి.ఏ.టి.ఎస్. పారదర్శకతను తీసుకురాగలదు. మొత్తం వాణిజ్య కార్యకలాపాలను చాలా సమర్థవంతంగా చేయగలదు. ఇది వివిధ దశల్లో బుకింగ్, బిల్లింగ్, చెల్లింపు రసీదులు మొదలైన వాటి పర్యవేక్షణను అనుమతిస్తుంది. అదే విధంగా, అనేక నిర్వహణ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అవసరమైన వివిధ నివేదికలను ఈ విధానం అందించగలదు. ఈ యాప్ మొబైల్ ఫోనులో కూడా అందుబాటులో ఉంది. ఈ సాఫ్ట్ వేర్ మెనూ ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఆకాశవాణికి చెందిన అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది మరింత సులభతరం, ఉపయోగకరంగా ఉంటుంది.", అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రసార భారతి సభ్యుడు (ఫైనాన్స్) మాట్లాడుతూ, "రసీదుల నిర్వహణ మరింత సమర్థంగా, పారదర్శకంగా చేయడం ఈ బి.ఏ.టి.ఎస్. విధానాన్ని పూర్తిగా అమలు చేయడం వల్ల కలిగే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం. ఇది రాబడి లీకేజీలను నివారించడం తో పాటు, అందించిన సేవలకు నూరు శాతం రాబడి హామీని నిర్ధారిస్తుంది. బి.ఏ.టి.ఎస్. విధానాన్ని ప్రారంభించడం ఆకాశవాణి చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా భావించవచ్చు." అని వివరించారు.
మీడియా న్యూక్లియస్ సంస్థ అందజేసిన బి.ఏ.టి.ఎస్. విధానం ఈ క్రింది ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంది:
ఏ) ఒక కేంద్రీకృత డేటా బేస్ ద్వారా అనేక కేంద్రాల్లో ప్రకటనల ఆర్డర్ల షెడ్యూల్ మరియు బిల్లింగ్ ను నిర్వహించడానికి.
బి) కాంట్రాక్టుల విడుదల ఆర్డర్ నమోదు నుండి ఒకటి లేదా అనేక ఇన్వాయిస్ ల బిల్లింగు వరకు సజావుగా నిర్వహించబడతాయి.
సి) కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది, వ్యయాన్ని తగ్గిస్తుంది.
డి) ట్రాఫిక్ బృందానికి ప్రకటనల ప్రణాళిక, షెడ్యూల్, బిల్లింగ్ కోసం సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందించడం ద్వారా సంస్థ యొక్క సామర్థ్యాన్ని, "మీడియా సేల్స్ ట్రాఫిక్" పెంచుతుంది.
ఈ) ఖాతాల ప్రాధాన్యతా క్రమం; వివిధ ప్యాకేజీలు, ఉత్పత్తులు; ధరల ప్రణాళికలు; కంటెంట్ హక్కుల నిర్వహణ; స్వయంచాలక ప్రకటనల బుకింగ్ తో పాటు, బల్క్ డీల్స్ పై రాయితీలు; ఛార్జీలు; బిల్లింగ్ సైకిల్ ఇన్వాయిస్ లను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఖచ్చితమైన బిల్లింగ్ ను నిర్ధారిస్తుంది.
ఎఫ్) ఎస్.బి.ఐ. కి చెందిన సమగ్ర చెల్లింపు వ్యవస్థ ద్వారా రాబడి, చెల్లింపుల నిర్వహణ
*****
(रिलीज़ आईडी: 1874590)
आगंतुक पटल : 208