నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రగతికి, అవకాశాలకు నైపుణ్యాలే రహదారులు!


జమ్ముకాశ్మీర్ విద్యార్థులకు కేంద్రమంత్రి
రాజీవ్ చంద్రశేఖర్ ఉద్బోధ..

మారుమూలన ఉన్న భారత యువతకు కూడా
నైపుణ్యాలు అందుబాటులో ఉండాలన్నది
ప్రధాని నరేంద్ర మోదీ భావన: చంద్రశేఖర్

రాంబన్ జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికపై
కేంద్రమంత్రి సమీక్ష,
ఉద్యోగ మేళాకు ప్రారంభోత్సవం.

Posted On: 07 NOV 2022 6:31PM by PIB Hyderabad

    ఉపాధి లేదా/మరియు వ్యవస్థాపక అవకాశాలకు చేరువ కావడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ యువత వివిధ నైపుణ్యాలతో తమను తాము సన్నద్ధం చేసుకోవాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. అభివృద్ధికి, అవకాశాలకు నైపుణ్యాలు రహదారుల వంటివని. విద్యతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన నైపుణ్యాన్ని కలిగి ఉండటం విద్యార్థులకు, యువతకు చాలా అవసరమని ఆయన అన్నారు. తద్వారా ఉద్యోగాల మార్కెట్‌ లేదా ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ రంగాలలో వారికి పోటీతత్వం సులభతరం అవుతుందని ఆయన అన్నారు. జమ్ముకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం, రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులను, సిబ్బందిని ఉద్దేశించి మంత్రి ఈరోజు ప్రసంగించారు.

 

2022-11-07 19:36:32.8400002022-11-07 19:36:32.898000

  భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న భారతీయ యువకులందరూ నవ భారతదేశంలో అనేక అవకాశాలను పొందేందుకు నైపుణ్యాలను అందుబాటులోకి తెచ్చుకోవడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావించినట్టు రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశంలోని విద్యార్థులకు, ఔత్సాహికులకు ప్రభుత్వం 5,000 రకాల నైపుణ్య కార్యక్రమాలను స్వల్పకాలిక,  దీర్ఘకాలిక ప్రాతిపదికపై అందిస్తోందని అన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో నైపుణ్యాల తీరు మాననున్నందున విద్యార్థుల పాఠ్యాంశాలను మార్చారని, కొత్త కోర్సులను, భవిష్యత్తుకు అనుగుణమైన కోర్సులను తాజాగా జోడించారని ఆయన అన్నారు.

  సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌ల స్ఫూర్తికి, అభివృద్ధికి అనుగుణంగా ప్రధానమంత్రి దృక్పథం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే మహమ్మారి సంక్షోభం అనంతర పరిస్థితుల్లో నవ భారతదేశం ప్రధానమంత్రి నాయకత్వంలో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి చంద్రశేఖర్ అన్నారు. 2026 నాటికి ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు డిజిటల్ ఎకానమీ/ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎకానమీ సాధించాలన్న లక్ష్యంతో దేశం పురోగమిస్తోందన్నారు.

  నైపుణ్యాలకు సంబంధించి, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను కూడా కేంద్రమంత్రి సందర్శించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల నుంచి రాష్ట్రంలోని సాంప్రదాయ కళల/హస్తకళల వస్తువుల వరకు ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన అనేక ఉత్పాదనలు ఆయన్ను ఆకట్టుకున్నాయి.

   తర్వాత రాంబన్‌లో ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు. ఉద్యోగమేళాకు హాజరైన పలువురు ఉద్యోగార్ధులతో, నియామక సంస్థలతో ఆయన సంభాషించారు. అలాగే అర్హులకు శిక్షణ పూర్తయినట్లుగా ఇచ్చే లేఖలను, ఆఫర్ లెటర్లను, సర్టిఫికెట్లను ఆయన పంపిణీ చేశారు. అందుబాటులో ఉన్న అవకాశాలపై ఉద్యోగాలే నిర్ణయాత్మక అంశాలవుతాయని ఆయన అన్నారు. ఆరు నెలల్లో మళ్లీ ఇక్కడ నిర్వహించే తదుపరి జాబ్ మేళా దీనికంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంటుందని, మరిన్ని ఎక్కువ కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. అలాగే, స్థానికంగా అందుబాటులో ఉన్న నిపుణులను, ప్రతిభావంతులను తప్పనిసరిగా ఉద్యోగాల్లో తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ యూనిట్లను తాము అభ్యర్థిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.

 

 2022-11-07 19:25:32.5970002022-11-07 19:25:32.656000

   అనంతరం, రాంబన్ జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలపై కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు, ప్రణాళికా విశేషాల గురించి రాంబన్ జిల్లా అభివృద్ధి కమీషనర్ ముస్సరత్ ఇస్లాం మంత్రికి ఈ సమీక్షలో వివరించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలతో నైపుణ్యాల సానుకూల వ్యవస్థను మెరుగుపరిచే అంశంపై రాజీవ్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు.

 

2022-11-07 19:25:56.256000

    రాంబన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక సామర్థ్యాల లబ్ధిదారులకు యాంత్రిక సైకిళ్లు, స్కూటీల తాళం చెవులను మంత్రి పంపిణీ చేశారు. ముమ్కిన్/తేజస్వని పథకాల లబ్ధిదారులకు వాహనాల తాళం చెవులను కూడా ఆయన ఈ కార్యక్రమంలోనే అందజేశారు.

   అంతకుముందు, ఈ ఉదయం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జమ్మూ చేరుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సుదర్శన్, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ ప్రాంతీయ డైరెక్టరేట్ (ఆర్.డి.ఎస్.డి.ఇ.) రీజినల్ డైరెక్టర్ ఎస్. శాంతి మలనానాతో సహా పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు జమ్ములో ఆయనకు స్వాగతం పలికారు.  

 

******************  


(Release ID: 1874589) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi , Marathi