విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ వాహనాల (ఈ.వి) ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు, ప్రమాణాలను విడుదల చేసిన - విద్యుత్ మంత్రిత్వ శాఖ


* రోజు వారీ రేట్లు, సోలార్ గంటలలో తగ్గింపుతో పాటు సర్వీస్ ఛార్జీల ప్రీపెయిడ్ సేకరణను కలిగి ఉండే - పబ్లిక్ ఛార్జింగ్ స్టేష స్టేషన్లు

* కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సి.ఈ.ఏ) ఆధ్వర్యంలోని ఒక కమిటీ విధించాల్సిన సర్వీస్ ఛార్జీల గరిష్ట పరిమితిని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.


* ఈ కమిటీ సర్వీస్ ఛార్జీల కోసం "రోజు రేటు సమయం" అలాగే సౌర గంటలలో ఛార్జింగ్ కోసం ఇవ్వాల్సిన రాయితీని కూడా సిఫార్సు చేస్తుంది.

Posted On: 07 NOV 2022 6:12PM by PIB Hyderabad

విద్యుత్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ 14.01.2022 తేదీన జారీ చేసిన సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు, ప్రమాణాలను మంత్రిత్వ శాఖ కొన్ని మార్పులు చేసింది. 

ఈ మార్గదర్శకాలలో ఈ క్రింది చేర్పులు చేయాలని నిర్ణయించడం జరిగింది:

(ఏ)   "3. పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (పి.సి.ఐ) అవసరాలు",  శీర్షిక కింద 3.1 (xi) పేరా ఈ కింది విధంగా జోడించబడింది:

3.1 (xi). పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో రోజు రేట్లు, సౌర గంటలలో తగ్గింపుతో పాటు సర్వీస్ ఛార్జీల ప్రీపెయిడ్ సేకరణకు అవకాశం ఉంటుంది. 

(బి)  "8. పి.సి.ఎస్. వద్ద సర్వీస్ ఛార్జీలు" శీర్షిక కింద, 8.3 పేరా ఈ కింది విధంగా జోడించబడింది:

8.3  కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సి.ఈ.ఏ) ఆధ్వర్యంలోని ఒక కమిటీ పైన పేర్కొన్న 8.2 పేరా కింద విధించబడే సేవా ఛార్జీల గరిష్ట పరిమితిని రాష్ట్ర ప్రభుత్వానికి క్రమానుగతంగా సిఫార్సు చేస్తుంది.  సర్వీస్ ఛార్జీల కోసం "రోజు రేటు సమయం" అలాగే సౌర గంటలలో ఛార్జింగ్ కోసం ఇవ్వాల్సిన తగ్గింపును కూడా సిఫార్సు  చేస్తుంది.

 

 

*****

 (Release ID: 1874585) Visitor Counter : 182