రక్షణ మంత్రిత్వ శాఖ
ఛీఫ్ ఆఫ్ నావల్‌స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ జపాన్ పర్యటన
प्रविष्टि तिथि:
05 NOV 2022 10:42AM by PIB Hyderabad
ఛీఫ్ ఆఫ్ నావల్‌స్టాఫ్ (సిఎన్‌ఎస్) అడ్మిరల్ ఆర్.హరికుమార్ 2022 నవంబర్ 5 నుంచి నవంబర్ 09 వరకు జపాన్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. అక్కడ ఆయన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) ను సందర్శిస్తారు. జనాప్ లోని యోకోసుకా వద్ద నవంబర్ ఆరున జపాన్ మారిటైమ్ సెల్ఫ్‌డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డిఎఫ్) దీనిని నిర్వహిస్తోంది. ఈ సంస్థ 70 వ వార్షికోత్సవం సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నారు.
జపాన్ పర్యటన సందర్భంగా పశ్చిమ పసిఫిక్‌నావల్ సింపోసియం (డబ్ల్యుపిఎన్‌ఎస్) పరిశీలకుడిగా ఆయన 18వ డబ్ల్యుపిఎన్‌ఎస్ కు హాజరవుతారు.ప్రస్తుతం దీనికి అధ్యక్షత వహిస్తున్న జపాన్ యోకోహోమాలో దీనిని ఏర్పాటు చేస్తోంది.
ఐఎఫ్‌ఆర్, డబ్ల్యుపిఎన్‌ఎస్‌లలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడంతోపాటు ఆయన ఎక్సర్‌సైజ్ మలబార్ 2022 ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది యొకోసుక లో జరుగుతుంది. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలు ఇందులో పాల్గొంటాయి. 1992లో రూపుదిద్దుకున్న ఈ సంస్థ మలబార్ ఎక్సర్‌సైజ్ 30 వ వార్షికోత్సవం ప్రస్తుతంజరుగుతోంది.
అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఈ సందర్బంగా ఐఎఫ్‌ఆర్, డబ్ల్యుపిఎన్‌ఎస్, మలబార్ సమావేశాల సందర్బంగా హాజరవుతున్న 30 దేశాల కు చెందిన నౌకాదళాధిపతులు, వివిధ దేశాల ప్రతినిధివర్గాల నాయకులతో మాట్లాడతారు. భారత నావికాదళ నౌకలు శివాలిక్, కమొరోటాలు జపాన్ లోని యోకోసుకాకు నవంబర్ 2న చేరుకున్నాయి. ఇవి ఐఎప్‌ఆర్, ఎక్సర్‌సైజ్ మలబార్ 2022 లో పాల్గొంటాయి. దేశీయంగా రూపొందించిన ఈ భారతీయ నౌకలు ఈ బహుళదేశ కార్యక్రమాలలో పాల్గొనడం, మన దేశ షిప్‌యార్డులకు నౌకానిర్మాణ రంగంలో గల సమర్దతను, పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రతినిధుల ముందు ప్రదర్శించడానికి వీలు కలుగుతుంది. సిఎన్‌ఎస్ జపాన్ పర్యటన జపాన్‌తో ఉన్నతస్థాయి ద్వైపాక్షిక రక్షణ కార్యకలాపాలకు.బహుళపక్ష కార్యకలాపాలలో ఇండియా పాల్గొంటుండడాన్ని, ఇండియా క్రియాశీల మద్దతును ఇది సూచిస్తుంది.
***
(रिलीज़ आईडी: 1874383)
आगंतुक पटल : 183