నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కామాఖ్య నగర్ కౌశల్ మహొత్సవ్లో ఒక్కరోజులో ఒడిషా యువతకు 1200 ఉద్యోగ ఆఫర్లు
కామాఖ్యనగర్ త్వరలోనే ఒడిషాలో నైపుణ్యాభివృద్ధి హబ్ గా మారుతుంది– ధర్మేంద్ర ప్రధాన్
20 కి పైగా రంగాలకు చెందిన సుమారు 100 కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి..
ఉద్యోగాల కోసం తమపేర్లు నమోదు చేసుకున్న వేలాది మంది అభ్యర్థులు. 1200 మందికి ఎంపిక పత్రాలు
ఒడిషా యువతకు రాష్ట్రంలో ను, రాష్ట్రం వెలుపల పలు ఉద్యోగాలను కల్పించిన కౌశల్ మహోత్సవ్
Posted On:
06 NOV 2022 8:32PM by PIB Hyderabad
మన యువతకు గల నైపుణ్యాలకు తగిన అవకాశాలను అనుసంధానం చేయడంపై దృష్టిపెట్టి ప్రపంచంలోనే నైపుణ్యాభివృద్ధి రాజధానిగా ఇండియాను తీర్చిదిద్దేందుకు దృష్టిపెట్టాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యుయర్షిప్ (ఎంఎస్డిఇ) మంత్రిత్వశాఖ
ఈరోజు ఒడిషాలోని ధెంకనాల్లో కామాఖ్యనగర్ స్టేడియం, సారంగధర స్టేడియంలలో కౌశల్ మహోత్సవ్ నిర్వహించింది. దీనిని నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ డిసి) ద్వారా ఏర్పాటు చేశారు. ఎంఎస్డిఇకి వ్యూహాత్మక అమలు, నాలెడ్జ్ పార్టనర్గా ఉంది. ఈ కౌశల్ మహోత్సవ్కు ఉద్యోగార్ధులనుంచి విశేష స్పందన లభించింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 20 రంగాలకు చెందిన 70కి పైగా డ్రీమ్ కంపెనీలు అప్రెంటీస్షిప్, ఉపాధి అవకాశాలను ఒడిషా యువతకు అందుబాటులోకి తెచ్చాయి.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి , ఎంటర్ప్రెన్యుయర్షిప్ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ధెంకనాల్ పార్లమెంటు సభ్యుడు శ్రీ మహేష్ సాహూ, ఉక్కు,గనులు, పనుల శాఖ మంత్రి ప్రఫుల్ల కుమార్మాలిక్, నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్డసి) సిఇఒ ఈకార్యక్రమంలో ప్రసంగించారు.
స్థానికులకు ప్రేరణకల్పిస్తూ , కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కామాఖ్యనగర్, ధెంకనాల్ యువత మంచి శక్తిసామర్ధ్యాలు కలిగిన వారని, వారికి తగిన అవకాశాలు కల్పించాలని అన్నారు. వివిధ మౌలిక సదుపాయాలు, ఆర్ధికాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో మనం బహుళ నైపుణ్యాలు కలిగిన హబ్లను నిర్మించి తద్వారా స్థానిక
ఆర్ధిక పురోగతికి, యువతకు లబ్ధి చేకూర్చవచ్చని ఆయన అన్నారు.
వేలాది మంది యువకులు ఉపాధి అవకాశాల కోసం కౌశల్ మహోత్సవ్ లో ఈరోజు తమ పేర్లను నమోదు చేసుకోవడం చూశాం. సుమారు 1200 మందికి వివిధ కార్పొరేట్ సంస్థలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. మారుతి సుజుకి, హెచ్‌సిఎల్, జెఎస్‌డబ్ల్యు, అమెజాన్, ఎల్ అండ్ టి, అర్బన్ క్లాప్ వంటి ఎన్నో సంస్థలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మహోత్సవానికి వచ్చాయి. రాష్ట్రంలో ఇలాంటివి వరుసగా జరుగుతాయి. ఇది ఒడిషాకు చెందిన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.ఈ మహొత్సవ్ లో ఉపాధి పొందిన యువతకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీరంతా అద్భుతమైన పనితీరు కనబరచగలనని ఆకాంక్షిస్తున్నాను ’’ అని ఆయన అన్నారు.నూతన విద్యావిధానం కింద నైపుణ్యాభివృద్ధికిగల ప్రాధాన్యతను ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి మార్గనిర్దేశంలో దీనిని అభివృద్ధి చేసినట్టు ఆయన తెలిపారు.
నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ డి సి) సిఇఒ శ్రీ వేద్‌మణి తివారి మాట్లాడుతూ, యువతలోని ఉత్సాహానికి హర్షం వ్యక్తం చేశారు. ఒడిషా యువత తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఎం.ఎస్.డి.ఇ మార్గనిర్దేశకత్వంలో, కార్పొరేట్ సంస్థల భాగస్వాముల సహకారంతో మరిన్ని అవకాశాలు కల్పించగలమన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన స్కిల్ కౌన్సిళ్ళు (ఎస్ ఎస్‌సిలు), కంపెనీలు తాము ఆఫర్ చేస్తున్న అవకాశాలను తెలియజేశాయి. అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి అవగాహన కల్పించాయి. పలువురు అభ్యర్థులు కౌశల్ మహోత్సవ్‌లో ఉచిత సైకో మెట్రిక్ పరీక్షకు హాజరయ్యారు. కౌశల్ మహోత్సవ్ లో గ్రూప్ కౌన్సిలింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం అవకాశాలు లభించని వారికి @nsdcdigital.nsdcindia.org వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే వారికి అనువైన ఉద్యోగాలకు చూడాలని, ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కౌశల్య మహోత్సవ్ లో పాల్గొన్న అభ్యర్థులు డెమో డ్రోన్, ఎఆర్, విఆర్ టెక్నాలజీని పరిశీలించారు. ఈ రంగంలో గల ఉపాధి అవకాశాల గురించి వారు తెలుసుకున్నారు. స్కిల్ ఇండియా మిషన్‌ను బలోపేతం చేస్తూ స్కిల్ డవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ మంత్రిత్వశాఖ డైరక్టరేట్ ఆప్ జనరల్ ట్రైనింగ్, ఎన్ ఎస్ డి సి పలు నైపుణ్యాబివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు(ఐటిఐ)లు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పిఎంకెవివై), ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు(పిఎంకెకె), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ పథకం (ఎన్ ఎపి ఎస్) వంటి వాటి ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకించి పాఠశాలలు, కాలేజీ చదువులు మధ్యలో మానేసినవారిపై దృష్టిపెట్టి వారికి ఉపాధి అవకాశాలు లభించే నైపుణ్యాలను అందించేందుకు కృషిచేయడం జరుగుతోంది.
***
(Release ID: 1874303)
Visitor Counter : 114