పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
క్యాప్ 27 సమావేశంలో పాల్గొనడానికి షర్మ్ ఎల్-షేక్ చేరుకున్న కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
• పోలీసు చర్యగా క్యాప్ 27 చర్యలు ఉండాలి.. శ్రీ యాదవ్
• పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి అమలు చేయాల్సిన సుస్థిర చర్యలపై చర్చించనున్న క్యాప్ 27
• చర్చకు రానున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన LiFE ప్రతిపాదన
प्रविष्टि तिथि:
05 NOV 2022 10:51PM by PIB Hyderabad
2022 నవంబర్ 6 నుంచి 18 వరకు జరగనున్న యుఎన్ఎఫ్ సీసీసీ(క్యాప్ 27) (UNFCCC (COP 27) పార్టీల 27వ సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నాయకత్వంలో భారత ప్రతినిధి బృందం పాల్గొనున్నది. సమావేశంలో పాల్గొడానికి శ్రీ భూపేందర్ యాదవ్ నాయకత్వంలో భారత ప్రతినిధి బృందం ఈరోజు ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్-షేక్ చేరుకుంది.
"వాతావరణ మార్పులపై పోరాడేందుకు స్థిరమైన మార్గాలపై చర్చించేందుకు ప్రపంచం ఒక చోట చేరింది. పర్యావరణ నిధులు, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, మార్పులకు అనుగుణంగా చర్యలు మేలు చేయడం, మార్పుల వల్ల జరిగే నష్టం లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమావేశం కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. క్యాప్ 27 తీసుకునే నిర్ణయాలు పోలీసులు అమలు చేసే చర్యల తరహాలో అమలు జరగాలి ” అని కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ యాదవ్ అన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన పర్యావరణహిత జీవన విధానం కోసం ప్రతిపాదించిన LiFE ని సమావేశంలో భారత బృందం వివరిస్తుంది. వనరుల వినియోగం, సరళి అంశాలను దృష్టిలో ఉంచుకుని సుస్థిర అభివృద్ధి సాధన కోసం ఎస్ డి జి-12 ప్రతిపాదించిన విధానాలకు అనుగుణంగా LiFE ఉందని ప్రపంచ దేశాల దృష్టికి భారత ప్రతినిధి బృందం తీసుకువెళ్తుంది.
LiFE మిషన్ వివరాలు:
2021 నవంబర్ 1న గ్లాస్గో లో జరిగిన క్యాప్ 26 సమావేశంలో భారత ప్రధానమంత్రి LiFE విధానాన్ని ప్రస్తావించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2022 జూన్ 5న ప్రపంచ దేశాల దృష్టికి భారతదేశం LiFE విధానాన్ని తీసుకు వెళ్ళింది. పర్యావరణ అంశాలను ఎదుర్కోవడానికి సంఘటితంగా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మేధావులు, విద్యావేత్తలు, పరిశోధకులు, అంకుర సంస్థలకు భారతదేశం పిలుపు ఇచ్చింది. భారతదేశం ఇచ్చిన పిలుపుకు ప్రపంచ నాయకులు సానుకూలంగా స్పందించారు.
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకుని పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచనలు, ఆదర్శాలను పటిష్టంగా అమలు చేసి సమస్య పరిష్కారం కోసం శాస్త్రీయ విధానాన్ని అమలు చేయాలని భారతదేశం నిర్ణయించింది.
2022 నుంచి 2027 వరకు పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేసే 100 కోట్ల మంది భారతీయులు, ఇతర దేశాలకు చెందిన వారిని సమీకరించాలని LIFE మిషన్ ప్రతిపాదించింది. దీనిలో భాగంగా దేశంలో 80% గ్రామాలు, పట్టణ ప్రాంతాలను పర్యావరణహిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర వివరాలు:
https://www.niti.gov.in/sites/default/files/2022-10/Brochure-10-pages-op-2-print-file-20102022.pdf లో LIFE మిషన్ పూర్తి వివరాలు చూడవచ్చు.
LiFE మిషన్ ప్రారంభించిన సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1869550 లోఅందుబాటులో ఉంది.
మరింత సమాచారం కోసం
envforestpib[at]gmail[dot]com సంప్రదించవచ్చు.
****
(रिलीज़ आईडी: 1874111)
आगंतुक पटल : 313