బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గతంలో ఎన్నడూ లేని విధంగా 141 గనుల అతిపెద్ద బొగ్గు గని వేలాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి


పన్నెండు రాష్ట్రాలకు నేరుగా లబ్ధి చేకూర్చే వేలం

మైనింగ్ రంగ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి: ఆర్థిక మంత్రి

ఈ సంవత్సరం 900 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కి అవకాశం - శ్రీ ప్రహ్లాద్ జోషి; కేంద్రీకృత దృష్టి కోసం కోల్ గ్యాసిఫికేషన్

Posted On: 03 NOV 2022 6:23PM by PIB Hyderabad

భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు బొగ్గు ఉత్పత్తిగ్యాసిఫికేషన్ ప్రాజెక్టులలో ఎక్కువ పెట్టుబడులు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంధన ధరలు ముఖ్యంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆరవ రౌండ్ బొగ్గు గని వేలాన్ని రోజు ఇక్కడ ప్రారంభించిన ఆర్థిక మంత్రి, భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విధాన స్థిరత్వం, పారదర్శకమైన ప్రక్రియ కారణంగా విద్యుత్ రంగానికి బొగ్గు దిగుమతులు 41% మేర తగ్గాయని మంత్రి వివరించారు. రోజు 141 బొగ్గు గనుల వేలం ద్వారా పన్నెండు రాష్ట్రాలు నేరుగా ప్రయోజనం పొందుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు.బొగ్గు రంగాన్ని అన్ లాక్ చేసేందుకు ఇటీవల చేపట్టిన

 

కార్యక్రమాలకు గానూ బొగ్గు మంత్రిత్వ శాఖ ను అభినందించిన శ్రీమతి సీతారామన్, మైనింగ్ రంగ

సంస్కరణలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థకు సరైన ఉత్తేజాన్ని కల్పిస్తున్నాయని అన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్, వాణిజ్య మైనింగ్ లో ప్రోత్సాహకాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు.

 

బొగ్గు, గనులు , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రసంగిస్తూ, బొగ్గు వినియోగాన్ని పెంపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషిస్తోందని అన్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖ . బొగ్గు గ్యాసిఫికేషన్కు రు. 6000 కోట్ల ప్రోత్సాహకం అన్వేషణ ప్రక్రియ కోసం రు. 250 కోట్ల రూపాయలు అందించిందని శ్రీ జోషి  తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వేలంలో, రోజు పదకొండు రాష్ట్రాలకు సంబంధించిన 141 గనులను వేలం వేశారు. ఇంతకు ముందు వేలం వేసిన గనులు ఉత్పత్తిని ప్రారంభించాయని, వచ్చే ఏడాది నాటికి కొత్త గనుల నుండి 10 నుండి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని శ్రీ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన సమీక్ష ప్రకారం, బొగ్గు మంత్రిత్వ శాఖ ఏడాది 900 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అంచనా వేస్తోందని శ్రీ జోషి తెలిపారు.

కార్యక్రమంలో బొగ్గు, గనులు , రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దన్వే, బొగ్గు శాఖ కార్యదర్శి

 శ్రీ అమృత్ లాల్ మీనా, అదనపు

కార్యదర్శి శ్రీ ఎం. నాగరాజు

ప్రసంగించారు.

 

ఆరవ 6 విడత వాణిజ్య వేలంలో 133 బొగ్గు గనులను వేలం వేయగా, వాటిలో 71 కొత్త బొగ్గు గనులు కాగా, 62 బొగ్గు గనులు మునుపటి విడతల వాణిజ్య వేలం నుంచి రోలింగ్ అవుతున్నాయి. అదనంగా, ఐడవ రౌండ్ వాణిజ్య వేలం రెండవ ప్రయత్నంలో ఎనిమిది బొగ్గు గనులు చేర్చబడ్డాయి, దీని కోసం మొదటి ప్రయత్నంలో సింగిల్ బిడ్లు వచ్చాయి. వేలంపాటను ప్రారంభించడం ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ థర్మల్ బొగ్గు రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

 

సంరక్షిత ప్రాంతాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, కీలకమైన ఆవాసాలు, 40% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన గనులు, భారీగా నిర్మించిన ప్రాంతం మొదలైనవి వేలం నుంచి మినహాయించబడ్డాయి. బొగ్గు బ్లాకుల్లో బిడ్డర్ల ఆసక్తి , భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వాటాదారుల సంప్రదింపుల సమయంలో అందుకున్న సూచనలు, అభ్యంతరాలు ఆధారంగా దట్టమైన జనావాసాలు, అధిక గ్రీన్ కవర్ లేదా క్లిష్టమైన మౌలిక సదుపాయాలు మొదలైనవి ఉన్న కొన్ని బొగ్గు గనుల బ్లాక్ సరిహద్దులు సవరించబడ్డాయి. బొగ్గు/ లిగ్నైట్ కలిగిన జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో గనులను వేలం వేస్తున్నారు.

 

వేలం ప్రక్రియ లో పాటిస్తున్న కీలక అంశాలలో - ముందస్తు మొత్తం , బిడ్ సెక్యూరిటీ మొత్తాన్ని తగ్గించడం, పాక్షికంగా అన్వేషించబడిన బొగ్గు గనుల విషయంలో బొగ్గు గనిలోని కొంత భాగాన్ని వదులుకోవడానికి అనుమతి, జాతీయ బొగ్గు సూచిక , జాతీయ లిగ్నైట్ ఇండెక్స్ ను ప్రవేశపెట్టడం, ప్రవేశ అడ్డంకులు లేకుండా పాల్గొనే వీలు , బొగ్గు వినియోగంలో పూర్తి సౌలభ్యం, ఆప్టిమైజ్డ్ చెల్లింపు నిర్మాణాలు, ప్రారంభ ఉత్పత్తికి ప్రోత్సాహకాలుబొగ్గు గ్యాసిఫికేషన్, శుభ్రమైన బొగ్గు సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం. ప్రధానమైనవి.

 

టెండర్ డాక్యుమెంట్ల అమ్మకాలు నవంబర్ 03, 2022 నుంచి ప్రారంభమవుతాయి. గనులు, వేలం నిబంధనలు, టైమ్ లైన్ లు మొదలైన వాటి వివరాలను ఎం ఎస్ టి సి వేలం ప్లాట్ ఫారంపై యాక్సెస్ చేసుకోవచ్చు.

పర్సంటేజ్ రెవిన్యూ షేర్ ఆధారంగా పారదర్శకమైన రెండు దశల ప్రక్రియ ద్వారా వేలం ఆన్ లైన్ లో జరుగుతుంది. వాణిజ్య బొగ్గు గని వేలం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖకు ఏకైక లావాదేవీ సలహాదారుగా ఉన్న ఎస్ బి క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ పద్ధతిని రూపొందించిందివేలం ప్రక్రియను నిర్వహించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖకు సహాయం చేస్తోంది.

 

******


(Release ID: 1873608) Visitor Counter : 323