గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతను జీవితంలో అంతర్భాగంగా వ్యవస్థీకరించేందుకు ప్రత్యేక ప్రచారం 2.0ను చేపట్టిన గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ

Posted On: 03 NOV 2022 11:45AM by PIB Hyderabad

సన్నాహక దశగా 14 నుంచి 30 సెప్టెంబర్ 2022 వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించడం ద్వారా భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం 2.0ను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రచార కాలానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఈ ఏడాది లక్ష్యాలు గృహ నిర్మాణ - పట్టణ వ్యవహారాల క్షేత్ర స్థాయి కార్యాలయాలపై దృష్టి పెట్టాయి. గుర్తింపు సమయంలో పెండెన్సీని నిర్మూలించడం, మెరుగైన రికార్డు నిర్వహణ కోసం పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, సామర్ధ్యాలను మెరుగుపరచడం, పారదర్శకతను పెంచడం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టారు. 
ప్రచార అమలు దశ (2 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 2022)లో 72 ఎంపి రిఫరెన్సుల్లో 53ను, 14 పార్లమెంటు హామీలలో నాలుగింటిని, 335 ప్రజా ఫిర్యాదులలో 214ను, 94 ప్రజా ఫిర్యాదు అప్పీళ్ళలో 87ను పరిష్కరించగా, 13526 భౌతిక ఫైళ్ళను ఇప్పటి వరకూ నిర్మూలించారు. మొత్తం 66 బయటి పారిశుద్ధ్య ప్రచారాలను నిర్వహించారు. వివిధ కార్యాలయాల్లోని వాడుకలో లేని వస్తువులను పారవేయడం ద్వారా మొత్తం రూ. 44860/- ఆదాయ సమకూరడమే కాక చెత్తను/ రికార్డులను నిర్మూలించిన అనంతరం 2236 చదరపు అడుగుల విస్తీర్ణం ఖాళీ అయింది. ప్రచార సమయంలో ప్రజా వినిమయ సీమ, సేవలను అందించడంలో బాధ్యత వహించే కార్యాలయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. 
మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పై క్రమం తప్పకుండా తన కార్యకలాపాలను వెల్లడిస్తోంది. ప్రచార సమయంలో, మంత్రిత్వ శాఖ చేస్తున్న పనిని గుర్తించేందుకు 80 ట్వీట్ లు, 80 ఫేస్ బుక్ పోస్టులు, 80 ఇన్ స్టాగ్రామ్ సందేశాలు ప్రచురితం చేయగా, 5 యూట్యూబ్ వీడియోలను అప్ లోడ్ చేయడం జరిగింది. 
గృహనిర్మాణం - పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక ప్రచారం అమలులో సాధాంచిన పురోగతిని సమీక్షించేందుకు, మొత్తం పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేసేందుకు న్యూఢిల్లీలోని మంత్రిత్వ శాఖ ఆవరణలో నిర్మాణ్ భవన్ లో  సంయుక్త కార్యదర్శి ప్రతి రోజూ ఒకసారి చుట్టి వచ్చారు. ఆదేశాల అనంతరం సిపిడబ్ల్యుడి చిన్న చిన్న మరమత్తులను చేపట్టింది. 
ప్రత్యేక ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో గల వివిధ కార్యాలయాలను స్వయం సహాయక బృందాలతో (ఎస్ హెచ్ జిలు) అనుసంధానం చేసుకోవడాన్ని మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. ఈ ఏర్పాటు కింద, తమ కియోస్క్ లను పెట్టుకునేందుకు ఎస్ హెచ్ జి లు రీసైక్లింగ్ కోసం వివిధ కార్యాలయ వ్యర్ధాలను సేకరించేందుకు ఆయా కార్యాలయాలలో జాగాను ఇస్తున్నారు. స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ (3ఆర్ లు - తగ్గించు, పునర్వినియోగం, పునరుపయోగం)ను ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది. మొత్తం 187 కియోస్క్ లను ఏర్పాటు చేశారు. 
రోజువారీ పురోగతిని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది, పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ హోస్ట్ చేసే ఎస్ సిపిడిఎం పోర్టల్ పై అప్ లోడ్ చేయడం జరుగుతోంది. 

 

***
 


(Release ID: 1873583)
Read this release in: English , Urdu , Hindi , Assamese