ఉక్కు మంత్రిత్వ శాఖ

ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం 2.0 ఘన విజయం


పెద్ద సంఖ్యలో ఫైళ్ల పరిష్కారం

Posted On: 03 NOV 2022 1:43PM by PIB Hyderabad

2022 అక్టోబర్ 2 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు జరిగిన 'స్పెషల్ క్యాంపెయిన్ 2.0 ఫర్ డిస్పోజల్ ఆఫ్ పెండింగు మ్యాటర్స్' (ఎస్ సి డి పి ఎం 2.0) లో ఉక్కు మంత్రిత్వ శాఖతో పాటు సెయిల్, ఆర్ఐఎన్ఎల్, ఎన్ఎండీసీ, ఎంఓ ఐఎల్, మెకాన్, కే సీఎల్, ఎంఎస్ టిసి మొదలైన ఏడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఇ ) లు చురుగ్గా పాల్గొన్నాయి. స్వచ్ఛత , రికార్డ్ మేనేజ్ మెంట్ ను ఉద్యోగుల మధ్య సాధారణ కార్యకలాపాలుగా సంస్థాగతీకరించడంపెండింగ్ ను తగ్గించడం, అదేవిధంగా మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రభుత్వ ముఖ్యమైన అంశాలను సకాలంలో పరిష్కరించడానికి అంతర్గత పర్యవేక్షణ మానిటరింగ్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ప్రచార కార్యక్రమం ఉద్దేశం.

 

2022 సెప్టెంబర్ 14 నుంచి 30 వరకు జరిగిన ప్రచారం ప్రారంభ దశ ను ప్రచారం గురించి అధికారులకు అవగాహన కల్పించడానికి, క్షేత్రస్థాయి కార్యకర్తలను సమీకరించడానికి, పోకడలను గుర్తించడానికి, ప్రచార నిర్వహణ ప్రదేశాలను ఖరారు చేయడానికి, వ్యర్థ, ఇతర అనవసరమైన వస్తువులను గుర్తించడానికి ఉపయోగించబడింది.

 

ప్రచారం యొక్క ప్రధాన త్రస్ట్ ప్రాంతాలు: స్క్రాప్, ఫర్నిచర్, కాగితాలు , -వ్యర్థాల రీసైక్లింగ్ , పరిశుభ్రత కార్యకలాపాల నిర్వహణ , రికార్డ్ మేనేజ్మెంట్ కార్యకలాపాలు, పెండింగ్ లో ఉన్న విఐపిఐఎంసి , పిఎంఓ / రాష్ట్ర ప్రభుత్వ రిఫరెన్సులను లిక్విడేట్ చేయడం, ప్రజా ఫిర్యాదులు, పిజి అప్పీళ్ల పరిష్కారం మొదలైన అంశాలపై ప్రచారం దృష్టి పెట్టింది.

 

ఉక్కు శాఖ మంత్రి (హెచ్.ఎస్.ఎం), ఉక్కు శాఖ సహాయ మంత్రి , ఉక్కు మంత్రిత్వ. శాఖ కార్యదర్శి పర్యవేక్షణ లో ప్రత్యేక స్వచ్చత ప్రచారం చురుగ్గా, ముమ్మరంగా సాగింది. ప్రచారం ప్రణాళిక, అమలు ను క్రమం తప్పకుండా హెచ్ ఎస్ ఎం, ఎం   ఎస్ (స్టీల్), కార్యదర్శి (స్టీల్), ఇతర సీనియర్ అధికారులు వివిధ అంతస్తులు విభాగాలు/గదుల విస్తృత తనిఖీల ద్వారా నిరంతరం సమీక్షించారు. న్యూఢిల్లీలోని సెయిల్ ప్రధాన కార్యాలయంతో సహా ఉద్యోగ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉక్కు మంత్రి, కేంద్ర మంత్రి (ఉక్కు) పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఢిల్లీలో ఉన్న సిపిఎస్ఇల కార్యాలయాలను సందర్శించి, వారి ప్రణాళిక, ప్రచార కార్యక్రమాల అమలును సమీక్షించారు.

 

ప్రచార సమయంలో, ఉక్కు సిపిఎస్ఇలు మెటాలిక్ , నాన్-మెటాలిక్ స్క్రాప్, కాగితం, -వ్యర్థాలు మొదలైన వాటిని పారవేయడం ద్వారా 37722 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేశాయి. సుమారు రూ .394 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అలాగే, మంత్రిత్వ శాఖలో 568 చదరపు అడుగుల స్థలం నుంచి పనికి రానివి తొలగించారు. వ్యర్థాల అమ్మకం ద్వారా రూ .0.80 లక్షల ఆదాయాన్ని ఆర్జించారు.

 

సిపిఎస్ఇలతో కలిసి, 58082 భౌతిక ఫైళ్లు 10258 -ఫైల్స్ సమీక్షించి 55800 భౌతిక ఫైళ్లు , 7980 -ఫైల్స్ సమీక్ష లక్ష్యాన్ని అధిగమించారు. కనీసం 43841 భౌతిక ఫైళ్లను తొలగించారు, 4947 ఎలక్ట్రానిక్ ఫైళ్లు మూసివేశారు. ప్రచార సమయంలో, 237 స్వచ్ఛతా ప్రచారాల లక్ష్యానికి మించి 278 స్వచ్ఛతా ప్రచారాలను మంత్రిత్వ శాఖ , దాని సిపిఎస్ఇలు నిర్వహించాయి. దీనికి అదనంగా, 114 పిజి అప్పీళ్లు లేదా గ్రీవియెన్స్ లు, 12 ఎంపీ రిఫరెన్స్ లు, 8 పిఎమ్ వో రిఫరెన్స్ లు , 2 ఐఎమ్ సి రిఫరెన్స్ లు పరిష్కరించబడ్డాయి. ప్రత్యేక ప్రచారం సందర్భంగా స్టీల్ సిపిఎస్ ఇల ద్వారా ఏడు నిబంధనలు, లేదా ప్రక్రియలు సరళీకృతం చేయబడ్డాయి.

 

స్పెషల్ క్యాంపెయిన్ 2.0 కు విస్తృత మీడియా కవరేజీ

 

 

ప్రచారం 25 కంటే ఎక్కువ ట్వీట్లు , 250 రీట్వీట్లతో మంచి మొత్తంలో సోషల్ మీడియా కవరేజీని పొందింది. ఉక్కు మంత్రిత్వ శాఖ , దాని సిపిఎస్ఇలు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా  "పరిశుభ్రత దైవభక్తి తరువాత" అనే గాంధీజీ దార్శనికతను గుర్తు చేయడానికి వివిధ సోషల్ మీడియా వేదికలపై చురుకుగా పాల్గొన్నాయి.

ప్రచారం సంబంధిత చిత్రాలు

 

పరిశుభ్రత ప్రచారానికి ముందు - తరువాత చిత్రాలు- మినిస్ట్రీ ,

సిపిఎస్ ఇలు:

ప్రచారం ప్రారంభంలో వివిధ

ప్రామాణికాల కోసం నిర్దేశించిన లక్ష్యాలను మంత్రిత్వ శాఖ సాధించడమే కాకుండా, ముఖ్యంగా స్వచ్ఛతా ప్రచారాల సంఖ్య , పాత ఫైళ్లను రికార్డ్ చేయడం , తొలగించడం లో లక్ష్యాలను అధిగమించింది, ఉక్కు మంత్రి, సహాయ మంత్రి (ఉక్కు), మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు , మంత్రిత్వ శాఖ పరిధిలోని సిపిఎస్ఇలతో సహా అధికారులు , ఉద్యోగుల చురుకైన సహకారంసమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ప్రచారం లక్ష్యాలు సాకారం అయ్యాయి.

సిపిఎస్ఇల కార్యాలయాలు, ప్లాంట్లు, గనులు, టౌన్ షిప్పులు పాన్-ఇండియన్ ఉనికి కారణంగా మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం దేశంలోని సుదూర మారుమూల ప్రాంతాలకు సైతం చేరింది.

 

ప్రచారంలో వారి చురుకైన భాగస్వామ్యం ఫలితంగా , కార్యాలయ ఆవరణలోనూ, చుట్టుపక్కలా పర్యావరణ-స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం , నిర్వహించడం కోసం విభిన్న కార్యకలాపాలను చేపట్టడం ద్వారా, మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం 2.0 పూర్తి లక్ష్యాలను సాధించగలిగింది. స్వచ్ఛతా ప్రచారం లక్ష్యాలకు అనుగుణంగా కార్యాలయాలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే తన ప్రయత్నాలను మరింత కొనసాగిస్తుంది.

 

*****



(Release ID: 1873483) Visitor Counter : 140


Read this release in: English , Urdu , Hindi , Kannada