వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహారం, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ సంజీవ్ చోప్రా
Posted On:
02 NOV 2022 4:07PM by PIB Hyderabad
వినియోగదారుల వ్యవహారలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖకు చెందిన ఆహారం, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శిగా 31 అక్టోబర్ 2022న శ్రీ సంజీవ్ చోప్రా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఒడిషా కేడర్ కు చెంిన 1990వ బ్యాచ్ ఐఎఎస్ అధికారి.
శ్రీ సంజీవ్ చోప్రా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఎఫ్ఎంఎస్ నుంచి బికామ్ ఆనర్సు, ఎం.బి. ఎ. పట్టాలను పొందారు. అనంతరం ఆయన భువనేశ్వర్ లోని ఉత్కళ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బి , లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ & పొలిటికల్ సైన్స్ నుంచి ఎంఎస్పీ పూర్తి చేశారు.
శ్రీ సంజీవ్ చోప్రా తన ఉద్యోగ జీవితాన్ని బరిపాడా (ఒడిషా) సబ్ కలెక్టర్ గా ప్రారంభించారు. ఆయన 1995 నుంచి 1997 వరకు ఒడిషాలోని కొరాపుట్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేటుగా పని చేశారు. అనంతరం 1999 నుంచి 2000 వరకు సాంకేతిక విద్య& శిక్షణా విభాగం డైరెక్టరుగా / డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరించారు. తరువాత, 2000 నుంచి 2004 వరకు రాష్ట్ర సహకార బ్యాంకులకు మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం 2007 నుంచి 2014 వరకు ముస్సోరిలోని ఎల్ బిఎస్ఎన్ఎఎలో సీనియర్ డిప్యూటీ డైరెక్టర్/ జాయింట్ డైరెక్టరుగా పని చేశారు. ఆ తరువాత, 2015 నుంచి అక్టోబర్ 2022 వరకు ఒడిషా ప్రభుత్వం కింద ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ , ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్టచర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సేవలందించారు. ఆయన ప్రభుత్వ పరిశ్రమలు, సామాన్య పరిపాలన, వ్యవసాయం, హోం శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు.
డిజిటల్ పరివర్తన కోసం ప్రభుత్వ ప్రక్రియ రీఇంజినీరింగ్ లో ఉత్తమమైన పనితీరు కనపరచినందుకు భారత ప్రభుత్వం శ్రీ సంజీవ్ చోప్రాకు 2020, 2021 సంవత్సరాలకు నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డును ప్రదానం చేసింది.
***
(Release ID: 1873317)
Visitor Counter : 141