ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ‘ఐక్యతా పరుగు' లో పాల్గొన్న - ఎం.ఈ.ఐ.టి.వై. అధికారులు
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఐక్యత, సమగ్రత, పరిశుభ్రత కోసం ప్రతిజ్ఞ చేసిన – అధికారులు
Posted On:
01 NOV 2022 3:53PM by PIB Hyderabad
జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా, 2022 అక్టోబర్, 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతిని పురస్కరించుకుని, సమగ్రతపై ఆయనకున్న నమ్మకానికి నివాళులర్పిస్తూ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (ఎం.ఈ.ఐ.టి.వై), మరియు ఆ శాఖకు అనుసంధానంగా / స్వయంప్రతిపత్తి కార్యాలయాలకు చెందిన 500 మంది అధికారులు నిన్న ఢిల్లీ లోని ఎలక్ట్రానిక్స్ నికేతన్ ప్రాంగణం నుండి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వరకు నిర్వహించిన ‘ఐక్యతా పరుగు' లో ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఐక్యతా పరుగు లో పాల్గొంటున్న ఎం.ఈ.ఐ.టి.వై. కి చెందిన అధికారులు
ఎలక్ట్రానిక్స్ నికేతన్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన 'ఐక్యతా పరుగు' ను ఎం.ఈ.ఐ.టి.వై. కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ జండా ఊపి, సారధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, “ప్రతి భారతీయుడి హృదయంలో నివసించే వ్యక్తి సర్దార్ పటేల్” అని కొనియాడారు. "జాతీయ ఐక్యతా దినోత్సవం మరియు స్వచ్ఛత" యొక్క నిజమైన స్ఫూర్తికి అనుగుణంగా, ఈ కార్యక్రమం లో పాల్గొన్న అధికారులు ఎం.ఈ.ఐ.టి.వై. మరియు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరిచి, చెత్తను సేకరించి, జాతీయ ఐక్యత దినోత్సవం రోజున దేశం పట్ల తమ భాగస్వామ్య బాధ్యతను ప్రదర్శించారు.
ఐక్యతా పరుగు లో పాల్గొంటున్న ఎం.ఈ.ఐ.టి.వై. కి చెందిన అధికారులు
ఎం.ఈ.ఐ.టి.వై. మరియు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యు.ఐ.డి.ఏ.ఐ); నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి); నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్.ఐ.ఎక్స్.ఐ); నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్-కార్పొరేటెడ్ (ఎన్.ఐ.సి.ఎస్.ఐ); సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డి.ఏ.సి); సెమీ-కండక్టర్ లాబొరేటరీ (ఎస్.సి.ఎల్); ఎం.ఈ.ఐ.టి.వై. లో నియమితులైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి.ఐ.ఎస్.ఎఫ్) సంస్థల సిబ్బందితో సహా వాటికి సంబంధించిన అన్ని సంస్థల నుంచి ఐదు వందల మందికి పైగా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎం.ఈ.ఐ.టి.వై. కి చెందిన వివిధ కార్యాలయాల మధ్య సామరస్యాన్ని ప్రదర్శించారు.
ఐక్యతా పరుగు లో పాల్గొంటున్న ఎం.ఈ.ఐ.టి.వై. కి చెందిన అధికారులు
ఈ పరుగు జాతీయ ఐక్యతా దినోత్సవం మరియు సమగ్రతా ప్రతిజ్ఞ తో ముగిసింది. మన దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షిస్తామని, భారతమాతను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అత్యున్నత ప్రమాణాలతో సమగ్రత, నిజాయితీలకు కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ వాగ్దానం చేశారు.
*****
(Release ID: 1872855)
Visitor Counter : 172