భారత ఎన్నికల సంఘం

భారత ఎన్నికల కమిషన్ , ప్రజాస్వామ్య శిఖరాగ్ర సమ్మేళనానికి కొనసాగింపుగా ఎన్నికల సమగ్రత బృంద సమావేశానికి నాయకత్వం వహిస్తోంది.


ఇందుకు సంబంధించి రెండు రోజుల అంతర్జాతీయ స మావేశాన్ని ఏర్పాటు చేసిన భారత ఎన్నికల కమిషన్

Posted On: 29 OCT 2022 1:51PM by PIB Hyderabad

భారత ఎన్నికల కమిషన్ , ఎన్నికల నిర్వహణ సంస్థల సామర్ధ్యం, ఫ్రేమ్వర్క్ , పాత్ర పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. ఎన్నికల సమగ్రత విషయంలో ఎన్నికల కమిషన్ నాయకత్వం వహస్తోంది. 2021 డిసెంబర్లో  సమ్మిట్ ఫర్ డెమాక్రసీ సందర్భంగా ఎన్నికల సమగ్రతపై సమష్ఠి బృందం ఏర్పడింది.
2. ఈ రెండు రోజుల సదస్సు 2022 అక్టోబర్ 31, నవంబర్ 1న నిర్వహిస్తారు. దీనిని ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ప్రారంభిస్తారు.
ముగింపు సమావేశానికి ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే అధ్యక్షత వహిస్తారు. భారత ఎన్నికల కమిషన్  ఎన్నికల సమగ్రతపై ఏర్పడిన బృందానికి నాయకత్వం వహిస్తోంది. గ్రీస్ , మారిషస్, ఐఎఫ్ ఇఎస్లను సహ నాయకత్వం వహించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆహ్వానించింది. అలాగే యుఎన్డిపి, ఇంటర్నేషనల్ ఐడిఇఎ, ఇఎంబిలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ లో గల భాగస్వామ్య సంస్థలను ఈ సమావేశానికి ఆహ్వానించింది.

3. అమెరికా, సావో టోమ్ అండ్ ప్రిన్సిపి, ఫిలిప్పీన్స్, గ్రీస్, ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రొనేసియా, చిలీ, ఆస్ట్రేలియా, కాబోవెరెడె, నేపాల్, మారిషస్,
ఆర్మీనియా సహా  11దేశాలనుంచి  11 ఇఎంబిలకు ప్రాతినిథ్యం వహిస్తూ సుమారు 50 మంది ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
అంతర్జాతీయ సంస్థలైన ఐఎఫ్ఇఎస్, ఇంటర్నేషనల్ ఐడిఇఎ, యుఎన్డిపి ఇండియా లు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.
మరి కొన్ని దేశాలు న్యూఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాల ద్వారా పాల్గాననున్నాయి.
4. మొదటిరోజు జరిగే రెండు సెషన్లలో ఇఎంబిలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న, భవిష్యత్ లో ఎదుర్కొనబోయే సవాళ్లను
వాటి పాత్ర, ఎన్నికల సమగ్రతను కాపాడడంలో వాటి ఫ్రేమ్ వర్క్ కు సంబంధించి చర్చిస్తారు.
ఎ). ఈ సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అధ్యక్షత వహించి, కీలకోపన్యాసం చేస్తారు.
దానికి ముందు అమెరికా చార్జ్ డి అఫైర్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు.
బి). తొలి సెషన్ ఇఎంబిలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చిస్తుంది. దీనికి మారిషస్ , నేపాల్ ఎలక్టొరల్ కమిషనర్ లు సహ అధ్యక్షత వహిస్తారు.
 ఈ సమావేశంలో మెక్సికో, చిలీ, నేపాల్,గ్రీస్ దేశాల ఎన్నికల అధికారులు తమ ప్రెజెంటేషన్లు ఇస్తారు.

సి) రెండో సెషన్ భవిష్యత్ సవాళ్లు అనే అంశంపై చర్చిస్తారు. దీనికి ఇంటర్నేషనల్ ఐడిఇఎ సెక్రటరీ జనరల్ అధ్యక్షత వహిస్తారు.
ఎన్నికల విభాగం అధిపతి, రాజకీయవిభాగాల అధిపతి, ఎన్నికల డైరక్టరేట్, ఆంతరంగిక మంత్రిత్వశాఖ, హెలెనిక్ రిపబ్లిక్,
గ్రీస్ సహ అధ్యక్షత వహిస్తారు. ఈ సెషనల్ ఆస్ట్రేలియన్ ఎలక్టొరల్ కమిషన్,, ఫిలిప్పీన్స్ సిఒఎంఇఎల్ఇసి ల ప్రతినిధులు ప్రెజెంటేషన్లు ఇస్తారు.
డి). రెండో రోజు సెషన్ ఇఎంబిల సామర్ధ్యం అనే అంశంపై జరుగుతుంది. దీనికి ఐఎఫ్ఇఎస్ సిఇఒ, అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు.
ఈ సెషన్లో ఐఎఫ్ఇఎస్ కంట్రీ డైరక్టర్ (శ్రీలంక, బంగ్లాదేశ్) ప్రెజెంటేషన్ లు ఇస్తారు. యుఎన్డిపి, హెలెనిక్ రిపబ్లిక్,గ్రీస్ ఆంతరంగిక మంత్రిత్వశాఖ,
డైరక్టరేట్ ఆఫ్ ఎలక్షన్స్, డిపార్టమెంట్ ఆఫ్ ఎలక్టొరల్ రోల్స్, రిజల్ట్స్ విభాగాధిపతి ప్రెజెంటేషన్ ఇస్తారు.
ఇ). ముగింపు సమావేశం నవంబర్ 1, 2022 న జరుగుతుంది. ఇందులో సమావేశ చర్చల నివేదికను సమర్పిస్తారు.
దీనికి ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే అధ్యక్షత వహించి ప్రసంగిస్తారు.న్యూఢిల్లీకి తమ ప్రతినిధులను పంపలేని స్టేక్ హోల్డర్ల కోసం ప్రత్యేక వర్చువల్ సెషన్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఇది 2022 నవంబర్ 1 సాయంత్రం 6 గంటలక ఉంటుంది. అమెరికా,యుఎస్ ఎయిడ్ లు ఇతర ప్రతినిధులతో పాల్గొంటాయి.
5. ఎన్నికల ఇంటిగ్రిటీపై సమావేశంలో చేసే సూచనలను ఆచరణలో పెట్టేందుకు ఎన్నికల కమిషన్ టెక్నాలజీ, సమగ్ర ఎన్నికల అంశాలపై
సమావేశాన్ని నిర్వహిస్తుంది.
 నేపథ్యం:

ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సమావేశం అనేది అమెరికా అధ్యక్షుడి చొరవతో రూపుదిద్దుకున్నది. 2021 డిసెంబర్లో ఇది జరిగింది.
 2021 డిసెంబర్ 9న జరిగిన నాయకుల ప్లీనరీ సెషన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రసంగించారు.ఈ శిఖరాగ్ర సమావేశం నంతరం  కార్యాచరణ సంవత్సరాన్ని ప్రతిపాదించారు. ఇందులో పలు కార్యక్రమాలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన థీమ్తో చర్చలు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యం కోసం నాయకుల సమావేశాన్నినిర్వహించాలని తలపెట్టారు.ఈ శిఖరాగ్ర  సమావేశం రెండు ప్లాట్ ఫారంలు, ఫోకల్గ్రూప్లను అభివృద్ధి చేసింది. అలాగే కార్యాచరణ సంవత్సరంలో పాల్గొనేందుకు వీలుగాప్రజాస్వామ్య కూటమిని  అభివృద్ధి చేసింది. ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సమ్మేళనం కార్యాచరణ సంవత్సరంలో భాగంగా ఇండియా , భారత ఎన్నికల సంఘం ద్వారా , ఎన్నికల సమగ్రతపై ప్రజాస్వామ్య కూటమికి నాయకత్వం వహిస్తోంది.   ఈ  సందర్భంగా తన కుగల పరిజ్ఞానాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని,అనుభవాన్ని ఇతర ప్రజాస్వామిక ప్రపంచంతో పంచుకుంటుంది. ఇందుకు నాయకత్వం వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా గల ఎన్నికల నిర్వహణ సంస్థలకు సామర్ధ్యాల పెంపు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయా ఎన్నికల మేనేజ్మెంట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సలహాలను అందించాలని ప్రతిపాదించింది.

 

***

 



(Release ID: 1872575) Visitor Counter : 145