రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక కార్యక్రమం 2.0 అమలు ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేసిన ఉత్తమ విధానాలు, సాధించిన విజయాలు


రైల్వే బోర్డు కార్యాలయంలో ఈ. ఆఫీస్ విధానం అమలు చేసి ఫైళ్ల పరిశీలన ద్వారా నవంబర్ 1 నుంచి కాగితరహిత కార్యకలాపాలు ప్రారంభించనున్న భారత రైల్వేలు

02.10.2022 నుంచి 31.10.22 వరకు ప్రత్యేక కార్యక్రమం 2.0 అమలు చేసిన రైల్వే శాఖ
యంత్రాలతో శుభ్రం చేయడం, రైళ్ల పరిశుభ్రత, ప్రధాన స్టేషన్‌లను చేరే మార్గాల శుభ్రత, సురక్షిత చెత్త సేకరణ, తొలగింపు కార్యక్రమాల అమలుతో 7337 స్టేషన్‌లలో సమూల మార్పులు

అక్టోబర్ 2 నుంచి అన్ని స్టేషన్‌లు, కార్యాలయాలు, వర్క్‌షాప్‌లు, ఉత్పత్తి యూనిట్లు మరియు ఇతర కార్యాలయాలలో పరిశుభ్రతపై 9000 పైగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన రైల్వే మంత్రిత్వ శాఖ
1.86 లక్షలకు పైగా ఫైళ్లు, దాదాపు 30,000 ఈ ఫైళ్లను సమీక్షించిన రైల్వే

ప్రచార కార్యక్రమం ముగింపు రోజున ముఖ్యుల నుంచి అందిన దాదాపు 3000 సిఫార్సులు, రాష్ట్రాల నుంచి అందిన 160 సిఫార్సులు, 2.6 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించిన రైల్వే మంత్రిత్వ శాఖ

33 వేల కోట్ల రూపాయల విలువ చేసే వ్యర్థాలను తొలగించి, అదనంగా 16000 చదరపు అడుగుల స్థలాన్ని వినియోగానికి అందుబాటులోకి తెచ్చిన అధికారులు

Posted On: 31 OCT 2022 4:54PM by PIB Hyderabad

ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పెండింగ్‌లో ఉన్న సూచనలను పరిష్కరించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు  మేరకు 2021 సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో  రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించింది. పరిశుభ్రత, పెండింగ్‌లో ఉన్నప్రజా సమస్యల పరిష్కారం, పనితీరు మెరుగు పరచడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరిగాయి. దీనికి కొనసాగింపుగా రైల్వే  మంత్రిత్వ శాఖ 02.10.2022 నుంచి 31.10.22 వరకు ప్రత్యేక ప్రచారం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైల్వే కార్యాలయాలు,ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమాలు, సుపరిపాలనకు ప్రత్యేక ప్రచారం 2.0లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
దేశంలో అన్ని ప్రాంతాలకు రైల్వే వ్యవస్థ విస్తరించి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రచారం 2.0 పరిధి విస్తరించిన రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యాలను నిర్ణయించుకుంది. దేశంలో 7337 రైల్వే స్టేషన్ లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు అమలు జరిగాయి. ఒక విధంగా చూస్తే ఈ కార్యక్రమం క్లిష్టంగా వుంటుంది. అయితే, లక్ష్యాల మేరకు మంత్రిత్వ శాఖ పనిచేసి విజయం సాధించింది. స్టేషన్లను   శుభ్రపరిచే కార్యక్రమాన్ని యాంత్రికరణ చేయడం, రైళ్ల పరిశుభ్రత, ప్రధాన స్టేషన్‌లకు చేరుకునే మార్గాలను శుభ్రంగా ఉంచడం,  ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలు సేకరించి  సురక్షితంగా తొలగించడం  వంటి కార్యక్రమాలు అమలు చేయడం ఒక పెద్ద పనిగా ఉంటుంది.లక్ష్య సాధన కోసం . బెంగళూరు రైల్వే స్టేషన్ అమలు చేసిన చర్యలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు.


DSC_0867.JPG


అక్టోబర్ 2 నుంచి  రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని స్టేషన్లు, కార్యాలయాలు, వర్క్‌షాప్‌లు, ఉత్పత్తి యూనిట్లు మరియు ఇతర కార్యాలయాల్లో పరిశుభ్రతపై  9000 కంటే ఎక్కువ ప్రచార కార్యక్రమాలు  నిర్వహించింది.  ఈ విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే 100% లక్ష్యం సాధించింది.  ఒక లక్షా ఎనభై ఆరు వేలకు పైగా భౌతిక ఫైళ్లు మరియు దాదాపు 30000 ఈ-ఫైళ్లను సమీక్షించింది. విఐపి /ఎంపీ/ఎమ్మెల్యేలు, పార్లమెంట్ , రాష్ట్ర ప్రభుత్వం/పీఎంఓ  రిఫరెన్స్‌లు/ప్రజా ఫిర్యాదులు  మరియు అప్పీళ్లతో సహా పెండింగ్‌లో ఉన్న అంశలను అంశాలను పరిశీలించడంలో   పై నుండి కింది వరకు ఉన్న ఉద్యోగులందరూ చురుకుగా పాల్గొన్నారు. వివిధ పరిమితులకు లోబడి ఇప్పటికే 80% పైగా పరిష్కరించడం జరిగింది. . ప్రత్యేక ప్రచారం 2.0 చివరి రోజున రైల్వే మంత్రిత్వ శాఖ విఐపిల నుంచి అందిన  3000 సిఫార్సులు, రాష్ట్రాల నుంచి అందిన 160 సిఫార్సులు, 2.6 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులను   రైల్వే మంత్రిత్వ శాఖ పరిష్కరించింది. కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును సీనియర్ అధికారులు ప్రత్యేకంగా సమీక్షించారు.కార్యక్రమంపై అవగాహన కల్పించి సిబ్బందికి  అవగాహన కల్పించే కార్యక్రమాలను అధికారులు అమలు చేశారు.  ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్యాలయాల నుంచి దాదాపు  33 కోట్ల రూపాయల విలువ చేసే వ్యర్థాలు తొలగించి  16000 చదరపు అడుగుల స్థలం వినియోగంలో తీసుకు రావడం జరిగింది.
.
ప్రత్యేక కార్యక్రమం  2.0లో భాగంగా “నుక్కడ్‌నాటక్” (వీధి ప్రదర్శనలు)తో సహా అనేక అవగాహన కార్యక్రమాలు అమలు జరిగాయి. వీటివల్ల సిబ్బంది, ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెరిగింది.  కార్యక్రమాలు అన్ని వర్గాల నుంచి   ప్రశంసలు పొందాయి.

 

DSC_0903.JPG


ఈ ప్రచారంలో అనేక ఇతర కార్యక్రమాలు కూడా అమలు జరిగాయి. విఐపి(ఎంపీ/ఎమ్యెల్యే) నుంచి అందే సిఫార్సులు, పార్లమెంటులో  జీరో అవర్‌లో లేవనెత్తిన అంశాలు, పార్లమెంటులో సెక్షన్ 377 కింద లేవనెత్తిన అంశాలను   ఆన్‌లైన్ లో పరిశీలించి పరిష్కరించడానికి ఐటీ విధానానికి రూపకల్పన జరిగింది.  
రియల్ టైమ్ మానిటరింగ్ మరియు విఐపి   రిఫరెన్స్‌ల పరిష్కారం కోసం  దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఐటీ విధానం అమలు జరుగుతుంది.  అప్లికేషన్ రిఫరెన్స్ నమోదు (అప్‌లోడ్ చేయడం), యూనిట్/ఆఫీసర్లకి మార్కింగ్/పంపడం, వారి నుంచి వచ్చిన  ప్రత్యుత్తరాల నమోదు , సంబంధిత యూనిట్ వారీగా ప్రాసెస్ చేయడం, రైల్వే మంత్రి/రైల్వే శాఖ సహాయ మంత్రి /జీఎం /డీఆర్ఎం లతో ఉత్తర  ప్రత్యుత్తరాలు సాగించడం లాంటి కార్యక్రమాల నిర్వహణకు ఐటీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. సమస్యల స్థితి విషయం/ విఐపి  /రాష్ట్రం /యూనిట్( డైరెక్టరేట్/జోనల్ రైల్వే మొదలైనవి)/సమయ వ్యవధి అంశాలపై  MIS నివేదికలను వ్యవస్థ సిద్ధం చేస్తుంది. ఈ వ్యవస్థ సంబంధిత అధికారులకు ఇ-మెయిల్ మరియు SMS ద్వారా వారం వారం హెచ్చరికలను కూడా పంపుతుంది.  కేవలం బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మంత్రి/అధికారులు నిర్దిష్ట ప్రజాప్రతినిధి నుంచి అందిన సమస్య, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది.
పార్లమెంటరీ రిఫరెన్స్‌ల  నిజ సమయ పర్యవేక్షణకు కోసం  మరొక మాడ్యూల్ కూడా  విఐపి   సూచనల పర్యవేక్షణ కోసం నిర్మించిన MIS యొక్క అన్ని లక్షణాలతో అదే తరహాలో అభివృద్ధి చేయబడింది.
ఈ రెండు అప్లికేషన్‌ల అభివృద్ధితో  సూచనలు, సిఫార్సులను  రైల్వే మంత్రిత్వ శాఖ త్వరితగతిన  పరిష్కరించ కలుగుతుంది. ఈ కార్యక్రమాల అమలుకు  ప్రత్యేక ప్రచారం 2.0లో  సహకరించింది.

ప్రజా ఫిర్యాదుల పర్యవేక్షణ కోసం  'రైల్ మదద్ పోర్టల్' ఉపయోగపడుతుంది. పరిష్కరించిన ఫిర్యాదులు, పరిష్కరించేందుకు తీసుకున్న సమయం    పెండింగ్‌లో ఉన్న  ఫిర్యాదుల పరిస్థితి లాంటి అంశాలను  ఆన్‌లైన్‌లో  'రైల్ మదద్ పోర్టల్ 'పర్యవేక్షిస్తుంది.
రైల్వే బోర్డు కార్యాలయంలో ఈ -ఆఫీస్ వ్యవస్థ  ద్వారా అన్ని వ్యాపార ప్రక్రియలు మరియు ఫైల్ వర్క్‌లను డిజిటలైజ్ చేయడం జరుగుతుంది.  నవంబర్ 1 నుంచి పూర్తిగా కాగితారహిత పని ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ  నిర్ణయించింది.
 నైరుతి రైల్వే పరిధిలో బెంగళూరు రైల్వే స్టేషన్ లో అమలు జరిగిన  కృషిని  ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు.
 
ప్రత్యేక కార్యక్రమం  2.0లో మునుపటి విడుదల ఇక్కడ చూడవచ్చు-
https://www.pib.gov.in/ PressReleasePage.aspx?PRID= 1869731

***


(Release ID: 1872508) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Hindi