సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ 2022 ఫంక్షన్ 31 అక్టోబర్, 2022న నిర్వహించబడింది

Posted On: 31 OCT 2022 11:44AM by PIB Hyderabad

విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఈ రోజు (అక్టోబర్ 31) న ప్రారంభమయ్యాయి. దివంగత  సర్దార్  వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభించింది.ఈ రోజు ప్రారంభమైన వారోత్సవాలు నవంబర్ 6 వరకు జరుగుతాయి. 

'' అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతిరహిత భారతదేశం" నినాదంతో   సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 

కమిషన్ సిబ్బందితో సమగ్రతా ప్రతిజ్ఞ చేయించి సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ శ్రీ  సురేశ్‌ ఎన్‌ పటేల్‌, విజిలెన్స్‌ కమిషనర్‌ శ్రీ  ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, విజిలెన్స్‌ కమిషనర్‌ శ్రీ  అరవింద కుమార్‌ లు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. సతర్‌కట భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగిన కార్యక్రమాన్నిప్రసార్ భారతి రికార్డు చేసింది. 

 విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2022 నిర్వహణలో భాగంగా  అన్ని మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు/సంస్థలలో మూడు నెలల పాటు ప్రచారాన్ని నిర్వహించిన  సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అవినీతి అరికట్టేందుకు గల అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది.  ఈ కింది ఆరు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమాలు జరిగాయి. 

ఎ) ఆస్తి నిర్వహణ

బి) ఆస్తుల నిర్వహణ

సి) రికార్డుల  నిర్వహణ

డి ) రెండు అంశాలపై ప్రమాణాలతో   కూడిన సాంకేతిక కార్యక్రమాలు అమలు చేయడం          

     - వెబ్‌సైట్ నిర్వహణ , నవీకరణ
      - వినియోగదారులకు  సేవలు అందించేందుకు   కొత్త ప్రాంతాల గుర్తింపు          

      - ఆన్‌లైన్ పోర్టల్‌ని ప్రారంభించడం.   ఆన్‌లైన్‌ వేదిక రూపొందించడానికి చర్యలు ప్రారంభించడం                 .

ఇ) అవసరమైన చోట మార్గదర్శకాలు / సర్క్యులర్‌లు / మాన్యువల్‌ల నవీకరణ
ఎఫ్ ) ఫిర్యాదుల పరిష్కారం 

విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 3వ తేదీన విజ్ఞాన్ భవన్‌లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యే  అవకాశం వుంది. 

***


(Release ID: 1872203) Visitor Counter : 317