ఉక్కు మంత్రిత్వ శాఖ
ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) పరిశ్రమల కేంద్రం 4.0- కల్పతరు భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు
నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2022 12:15PM by PIB Hyderabad
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్), కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాఫ్ట్ వెర్ టెక్నాలజీ పార్క్స్ అఫ్ ఇండియా కలిసి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఆర్‌ఐఎన్‌ఎల్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) పరిశ్రమల కేంద్రం 4.0- కల్పతరు నెలకొల్పాయి. కేంద్రానికి ఆర్‌ఐఎన్‌ఎల్ అందిస్తున్నసహకారం, ఇతర అంశాలను శుక్రవారం జరిగిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) పరిశ్రమల కేంద్రం 4.0- కల్పతరు భాగ్వస్వామ్య సదస్సులో చర్చించడం జరిగింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఏర్పాటైన కల్పతరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) పరిశ్రమల కేంద్రం 4.0 దేశంలో ఉక్కు పరిశ్రమ మరియు ఇతర పరిశ్రమల కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అనేక స్టార్టప్‌లను ఒక వేదికపైకి తీసుకువస్తుందని కేంద్రం సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ శ్రీ అతుల్ భట్ తెలిపారు. దేశ ఉక్కు పరిశ్రమ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కల్పతరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) పరిశ్రమల కేంద్రం 4.0 డిజిటల్ పరిష్కారాలు అందించే కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని శ్రీ అతుల్ భట్ అన్నారు. కల్పతరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) పరిశ్రమల కేంద్రం 4.0 కి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ అతుల్ భట్ హామీ ఇచ్చారు.
భాగస్వామ్య పరిశ్రమలకు స్వాగతం పలికిన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ అరవింద్ కుమార్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరిశ్రమల కేంద్రం 4.0 తో కలిసి పనిచేయాలని కోరారు. భాగస్వామ్య సంస్థలు తమ సంస్థల్లో పరిశ్రమ 4.0ని త్వరితగతిన అమలు చేసి ప్రయోజనాలను పొందాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) తన 21వ కేంద్రాన్ని ఆర్‌ఐఎన్‌ఎల్ లో నెలకొల్పింది. భారత పరిశ్రమలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లకు కల్పతరు సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (COE) ఇండస్ట్రీ 4.0 పరిష్కారాలను అందిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. "దేశవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్టార్టప్‌లకు సహకారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. " అని శ్రీ అరవింద్ కుమార్ తెలిపారు.
ఆర్‌ఐఎన్‌ఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గ్రూప్-కల్పతరు సభ్యుడు శ్రీ. ఎ.కె. సక్సేనా భాగస్వామి పరిశ్రమలకు స్వాగతం పలికారు.ఇప్పటికే పరిశ్రమ 4.0 ప్రమాణాలు అమలు జరుగుతున్న రీ బరేలీలో ఆర్‌ఐఎన్‌ఎల్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌ను సందర్శించాలని భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను కోరారు.
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, సీఎండీ కమోడోర్ హేమంత్ ఖత్రీ, ఎన్ టి పీ సీ -సింహాద్రి బిజినెస్ యూనిట్ హెడ్ శ్రీ గిరీష్ చంద్ర చౌక్, కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ (కమర్షియల్) శ్రీ మహాపాత్ర, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ ఎస్.వి. రాంబాబు, సాఫ్ట్ వెర్ టెక్నాలజీ పార్క్స్ అఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ సి.వి,డి.రాంప్రసాద్ మరియు ఆర్‌ఐఎన్‌ఎల్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారుసాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం అదనపు డైరెక్టర్ బి. సురేష్ కల్పతరు ప్రాజెక్టుపై క్లుప్తంగా వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 1871849)
సందర్శకుల సూచీ సంఖ్య : : 147