రక్షణ మంత్రిత్వ శాఖ
సింగపూర్ - భారత నావికాదళ ద్వైపాక్షిక విన్యాసం ఎస్ఐఎంబిఇఎక్స్ -సింబెక్స్ - 2022
Posted On:
28 OCT 2022 12:02PM by PIB Hyderabad
అక్టోబర్ 26 నుంచి 30 వరకు విశాఖపట్నంలో భారతీయ నావికాదళం సింగపూర్- భారత్ నావికాదళ ద్వైపాక్షిక విన్యాసాలు (ఎస్ఐఎంబిఇఎక్స్ -సింబెక్స్) 29వ ఎడిషన్ ను నిర్వహిస్తోంది.
ఎస్ఐఎంబిఇఎక్స్ -2022ను రెండు దశలలో నిర్వహిస్తున్నారు- అక్టోబర్ 26 నుంచి 27, 2022వరకు విశాఖపట్నంలో హార్బరు దశ, అనంతరం బంగాళాఖాతంలో 28 నుంచి 30 అక్టోబర్ 2022వరకు సముద్ర దశను నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలలో పాలు పంచుకునేందుకు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీకి చెందిన రెండు నౌకలు, ఆర్ఎస్ఎస్ స్టాల్‌వార్ట్ (ఎదురులేని, బలమైన వర్గానికి చెందిన యుద్ధ నౌక), ఆర్ ఎస్ ఎస్ విజిలాన్స్ ( విక్టరీ వర్గానికి చెందిన చిన్న యుద్ధ నౌక) 25 అక్టోబర్ 2022న విశాఖపట్నం చేరుకున్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నావికాదళ ఫ్లీట్ కమాండర్ రేర్ అడ్మిరల్ సియాన్ వాట్ జియాన్‌వెన్ 25 అక్టోబర్ 2022న ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ -ఇన్- చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజీత్ దాస్ గుప్తాను, ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్లాగ్ఫీ ఆఫీసర్ కమాండింగ్ అయిన రేర్ అడ్మిరల్ సంజయ్ భల్లాను కలుసుకుని సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో, ఉమ్మడి సమస్యలపై చర్చించారు.
హార్బర్ దశలో రెండు నావికాదళాల మధ్య క్రాస్ డెక్ విజిట్స్, విషయాంశ నిపుణుల అభిప్రాయాల మార్పిడి సహా విస్త్రతమైన వృత్తిపరమైన, క్రీడాపరమైన కార్యక్రమాలు జరిగాయి.
ఎస్ఐఎంబిఇఎక్స్ శ్రేణి విన్యాసాలు 1994లో ప్రారంభమయ్యాయి. తొలి దశలో వీటిని లయన్ కింగ్ విన్యాసాలుగా పిలిచేవారు. విస్త్రతమైన సముద్ర కార్యకలాపాలను కలిగిన అధునాతన నౌకాదళ కసరత్తులను చేర్చే విధంగా గత రెండు దశాబ్దాల కాలంలో ఈ విన్యాసాల పరిధి, సంక్లిష్టత చెప్పుకోదగిన విధంగా పెరిగింది. సముద్రయాన పరిధిలో భారత్, సింగ్‌పూర్‌ల మధ్య ఉన్న ఉన్నత స్థాయి సహకారానికి ఈ విన్యాసాలు ఉదాహరణగా నిలుస్తాయి. అంతేకాకుండా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర, నౌకా సంబంధ భద్రతను పెంచే దిశగా ఇరు దేశాల నిబద్ధతను, సహకారాన్ని ఇది పట్టి చూపుతుంది.
***
(Release ID: 1871535)
Visitor Counter : 247