వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 డిసెంబర్ నాటికి బక్సర్ లో గోధుమ, బియ్యం గాదె నిర్మాణాన్ని పూర్తి చేయాలని బీహార్ ను ఆదేశించిన కేంద్రం

Posted On: 27 OCT 2022 2:27PM by PIB Hyderabad

బుధవారం బీహార్ లోని భోజ్ పూర్ , బక్సర్ జిల్లాలను సందర్శించిన సందర్భంగా, కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశు పాండే బక్సర్ లో సమర్థవంతంగా వినియోగించుకునేలా గోధుమ , ధాన్యం గాదె (సిలో) నిర్మాణాన్ని 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు,

 

జాతీయ ఆహార భద్రత చట్టం, పిఎంజికెఎవై కింద ఆహార ధాన్యాలను తీసుకుని పంపిణీ చేయడం పురోగతి పైన, రాబోయే కెఎంఎస్ 2022-23 కోసం ధాన్య సేకరణ సంసిద్ధతను ఆయన సమీక్షించారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001M8UY.jpg

 

పంచాయతీ కాయం నగర్, భోజ్ పూర్ జిల్లా కోయిల్వార్ బ్లాక్ లోని 45వ వార్డు,  బక్సర్ జిల్లా దుమ్ రావ్ సబ్ డివిజన్ లోని బ్రహ్మపూర్ బ్లాక్  నిజాం పంచాయితీ లోని ఒక్కో పీడీఎస్ షాపును శ్రీ పాండే పరిశీలించారు. ఆయన లబ్ధిదారులతో సంభాషించారు.  పిడిఎస్ షాపుల ద్వారా వారు అందుకున్న బియ్యం, గోధుమల నాణ్యత ,పరిమాణం గురించి అడిగి తెలుసుకున్నారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002G4GF.jpg

 

బక్సర్ జిల్లా లో ప్రజాపంపిణీ వ్యవస్థ పై బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్ తో ఆయన సమీక్షించారు. గడచిన రెండు (రెండు) సంవత్సరాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ,  సేకరణలో రాష్ట్రం చేసిన కృషిని కేంద్ర కార్యదర్శి అభినందించారు . సాంకేతిక వ్యవస్థ నిరంతర అమలు , ఆధునీకరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్ లైన్ స్కేల్స్ , క్యాష్ లెస్ పేమెంట్ సదుపాయం పూర్తిగా అమలు జరిగిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థ కు సంబంధించిన దాదాపు అన్ని ఫిర్యాదులు ముగుస్తాయని ఆయన చెప్పారు.

 

ఈ పర్యటన లో బీహార్ ప్రభుత్వ ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ

కార్యదర్శి శ్రీ వినయ కుమార్ , ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీహార్ రీజియన్ జనరల్ మేనేజర్ , సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్, రాష్ట్రంలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EU8L.jpg

 

జాతీయ ఆహార భద్రత చట్టం, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలను  తీసుకుని పంపిణీ చేయడం గురించి బీహార్ ప్రభుత్వ ఆహార కార్యదర్శి కేంద్ర కార్యదర్శికి వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి కష్టకాలంలో, ఇంటింటికీ ప్రచారం ప్రారంభించామని, అర్హులైన కుటుంబాలకు 24 లక్షల పైగా రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఆయన తెలియజేశారు. కాగా , ఈ ప్రచారం ద్వారా ఇప్పటివరకు మొత్తం 37 లక్షల రేషన్ కార్డులు జారీ చేశారు.  అనర్హుల కుటుంబాలను తొలగించడం, అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ రాష్ట్రంలో నిరంతరం కొనసాగుతోందని రాష్ట్ర ఆహార కార్యదర్శి తెలియజేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రంలో ప్రతినెలా రికార్డు స్థాయిలో 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

 

మరింతగా ధాన్య సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో గత రెండు ఖరీఫ్ సీజన్ లలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సేకరణ జరిగిందని, కనీస మద్దతు ధర (ఎంఎస్ పి)ని 48 గంటల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు కేంద్ర ఆహార కార్యదర్శికి తెలియజేశారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల మొత్తం సేకరణ గొలుసు నిర్వహణ వ్యవస్థ లో పూర్తి పారదర్శకత,  సమర్థతను తీసుకొచ్చామని, రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సేకరించిన

నిల్వలను సకాలంలో పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలియ చేశారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H8HB.jpg

 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ, నిర్వహణ రంగంలో అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజంటేషన్ ఇచ్చారు గోదాముల నిర్వహణ, స్టార్ రేటింగ్ వాటి అప్ గ్రేడేషన్ గురించి సవిస్తరమైన సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలో హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద సిలో నిర్మాణం గురించి కూడా ఆయన తెలియజేశారు.

 

***


(Release ID: 1871400) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi