ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండవ జి20 ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాముఖ్యత యిస్తుంది ": డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

"భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పటిష్ట ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ను రూపొందించడానికి అవసరమైన సహకారం అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది" .. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

प्रविष्टि तिथि: 27 OCT 2022 4:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యకర జీవితాలను గడిపేందుకు దోహదపడే ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని డాక్టర్ మాండవీయ తెలిపారు. రెండవ జి20 ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు మాట్లాడారు.  ఆరోగ్య సంరక్షణ రంగంలో గుర్తించిన కీలక అంశాలు అమలు జరుగుతున్న తీరును  రెండవ జి20 ఆరోగ్య మంత్రుల సమావేశం సమీక్షించింది. 

ఈ సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ "భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని  పటిష్ట  ప్రపంచ ఆరోగ్య సంరక్షణ  వ్యవస్థ ను రూపొందించడానికి అవసరమైన సహకారం అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది  " అని పేర్కొన్నారు. పటిష్ట ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ మాండవీయ అన్నారు. దీనికి అవసరమైన నిధులు సమీకరణ అంశాన్ని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం చర్చించింది. ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించాలని సూచించారు. లోపాలను గుర్తించి సమగ్ర పటిష్ట ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి  ఆరోగ్య అత్యవసర నిర్వహణ కోసం  చురుకైన మరియు ప్రతిస్పందించే వ్యవస్థ ఆవశ్యకతను డాక్టర్ మాండవీయ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. 

అంతరాయం లేకుండా   ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరియు వస్తువులు ప్రయాణించేలా చూసేందుకు ప్రతిపాదించిన  గ్లోబల్ ఫెడరేటెడ్ పబ్లిక్ ట్రస్ట్ డైరెక్టరీకి జి 20 దేశాలు సహకారం అందించాలని డాక్టర్ మాండవీయ కోరారు. ,

***

 


(रिलीज़ आईडी: 1871398) आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Odia , Tamil