సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
డిఓపిపిడబ్ల్యూడి ద్వారా ప్రత్యేక ప్రచారం 2.0 సంబంధించి 3వ వారంలో గణనీయమైన పురోగతి
పెన్షనర్లకు "సులభతర జీవనం" అనేది ఒక కేంద్ర బిందువుగా సంబంధిత సర్క్యులర్‌లపై పునరావలోకనం
వివిధ మంత్రిత్వ శాఖలతో 4200 మంది పింఛనుదారుల ఫిర్యాదులకు ప్రచార పద్ధతిలో పరిష్కారం
అక్టోబర్ 2022లో లైఫ్ సర్టిఫికేట్ ముఖ ప్రామాణీకరణ సాంకేతికత... 80, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పింఛనుదారుల కోసం ఒక మైలురాయి
వేలకొద్దీ ఫిజికల్ ఫైల్‌లు అలాగే ఈ-ఫైళ్లు వాటి కోడల్ లైఫ్‌ని మించిపోయాయి.
రిజిస్టర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాలు స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా ఉన్నాయి
Posted On:
26 OCT 2022 12:37PM by PIB Hyderabad
పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపిపిడబ్ల్యూడి) అనేది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్ల పెన్షన్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన విధానాల రూపకల్పనకు నోడల్ విభాగం. ఎస్ సి డి పి ఎం - 2.0 ప్రచారం సందర్భంగా, 4200 పెండింగ్‌లో ఉన్న పెన్షన్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు, 68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్‌లకు “ఈజ్ ఆఫ్ లివింగ్” అంటే సులభతరమైన జీవన విధానాన్ని మెరుగుపరచడానికి డిపార్ట్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
21.10.2022 నాటికి, ఈ విభాగం ద్వారా అనేక కార్యక్రమాలు జరిగాయి. అంటే ప్రచారం జరిగిన 20 రోజుల్లోనే 3150 పెన్షన్ గ్రీవెన్స్‌లు ఇప్పటికే పరిష్కారం అయ్యాయి. అన్ని ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లతో శాఖ అంతర్-మంత్రిత్వ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ప్రచారం ప్రారంభంలో నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి, పెన్షన్ గ్రీవెన్స్‌ల పెండింగ్‌ను తగ్గించడానికి డిపార్ట్‌మెంట్ ట్రాక్‌లో ఉంది. నిబంధనలు/ప్రక్రియల సడలింపు కింద డిపార్ట్‌మెంట్ 30 సర్క్యులర్‌లను జారీ చేసింది. మొత్తం 3094 ఈ -ఫైళ్లు పరిష్కారం అయ్యి, వాటి చర్యలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ విభాగం, పెన్షనర్స్ అసోసియేషన్ల ద్వారా మొత్తం 26 స్వచ్ఛత ప్రచారాలు చేపట్టడం అయింది.
క్రమ సంఖ్య
|
కార్యక్రమాలు
|
రిమార్కులు
|
1.
|
పెన్షనర్ల సులభతర జీవనం లక్ష్యంగా అవలోకనంలోకి తీసుకున్నవి
|
30
|
2.
|
నిబంధనల పేరుతో ఇరుక్కుపోయిన 4,200 పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాల్సినవి
|
3150
|
3.
|
అడ్వాన్స్డ్ ముఖ కవళికలు ప్రమాణంతో రూపొందించిన డిజిటల్ పేస్ గుర్తింపు గా 2022 అక్టోబర్ లో జారీ అయిన లైఫ్ సర్టిఫికెట్లు
అక్టోబర్ 2022 లో మొత్తం కేంద్ర ప్రభుత్వ డిఎల్సి లు
|
20745
172696
|
4.
|
సమూల ప్రక్షాళన చేయడానికి భౌతికంగా సమీక్షించిన ఫైళ్లు
ఇందుకు గుర్తించిన ఫైళ్లు
తొలగించిన ఫైళ్లు
|
2930
2269
1670
|
5.
|
ఈ-ఫైళ్లు సమీక్షించినవి
ఈ-ఫైళ్లు మూసివేసినవి
|
3747
3094
|
6.
|
రిజిస్టర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాలతో సహా వివిధ సైట్లలో స్వచ్ఛతా ప్రచారం నిర్వహణ
|
26
|
|
శ్రీ V. శ్రీనివాస్, సెక్రటరీ, డిఓపిపిడబ్ల్యూడి N.F కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో, పెన్షనర్ల ప్రోత్సాహం. రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్, పాండు, గౌహతి.
|
|
భారత్ పెన్షనర్స్ సమాజ్, న్యూఢిల్లీ, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రారంభించిన సమయంలో ఫేస్ అథెంటికేషన్ ద్వారా డిఎల్సి సమర్పణ
|
|
|
|
Before
|
After
|
న్యూ ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్, డిఓపిపిడబ్ల్యూడి రికార్డ్ రూమ్‌లో ఫైల్‌లను తొలగించడం, కార్యాలయ స్థలాన్ని ఏర్పాటు చేయడం
|
<><><><><>
(Release ID: 1871079)
Visitor Counter : 121