హోం మంత్రిత్వ శాఖ
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2021లో నిర్వహించిన ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం తరహాలోనే 02 అక్టోబర్ 2022 నుండి 31 అక్టోబర్ 2022 వరకు ప్రత్యేక కార్యక్రమం2.0ను నిర్వహిస్తోంది
స్వచ్ఛత ఉద్యమం కోసం 5,629 కార్య స్థలాలను గుర్తించారు
పబ్లిక్ ఇంటర్‌ఫేస్ ఉన్న ఫీల్డ్/అవుట్‌స్టేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి
Posted On:
26 OCT 2022 2:30PM by PIB Hyderabad
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2021లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం తరహాలో 02 అక్టోబర్ 2022 నుండి 31 అక్టోబర్ 2022 వరకు ప్రత్యేక కార్యక్రమం 2.0ని నిర్వహిస్తోంది. సన్నాహక దశలో (సెప్టెంబర్ 14 నుండి 30 సెప్టెంబర్ 2022 వరకు) మొత్తం 5,629 కార్యస్థలాలు గుర్తించబడ్డాయి. స్వచ్ఛత ఉద్యమం కోసం పబ్లిక్ ఇంటర్‌ఫేస్ ఉన్న ఫీల్డ్/అవుట్‌స్టేషన్ కార్యాలయాలపై మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీ రిఫరెన్స్‌లు, పార్లమెంటరీ హామీలు, ఐఎంసీ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, పిఎంఓ సూచనలు, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పిజి అప్పీల్స్ వంటి వివిధ వర్గాలలో పెండింగ్‌లను పరిష్కరించి ఎన్‌ఏఐకి పంపడం కోసం ఫైళ్లు గుర్తించబడ్డాయి.
ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0ని సిఏపిఎఫ్‌లు లేహ్ నుండి ఇటానగర్ వరకు నిర్వహిస్తున్నారు. ఇతర అనుబంధ/సబార్డినేట్ కార్యాలయాలు కూడా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. సిఎపిఎఫ్‌లు మరియు ఢిల్లీ పోలీసులు @పిఐబిహోమ్‌ఆఫైర్స్ అని ట్యాగ్ చేస్తూ ట్వీట్‌లు జారీ చేస్తున్నారు మరియు ప్రత్యేక ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పిఐబి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వాటిని మళ్లీ ట్వీట్ చేస్తున్నారు.
ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0 లక్ష్యాన్ని సాధించడానికి ఎంహెచ్‌ఏ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక స్వచ్ఛత ఉద్యమం 2.0కు చెందిన కొన్ని ఫోటోలు క్రింద చూపబడ్డాయి.
అడ్మిన్ బ్లాక్, సిహెచ్ మనేసర్ (ఎన్‌ఎస్‌జి) బ్యాక్‌సైడ్ ఏరియా ముందు మరియు తరువాత చిత్రాలు
236 బిఎన్ జె.జె కాలనీ బస్ స్టాండ్ నం.02 బవానా, ఎన్/డిఎల్‌ఐ(సిఆర్‌పిఎఫ్) ముందు మరియు తరువాత చిత్రాలు.
ఎఫ్204,204 కోబ్రా, కరణ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ ముందు మరియు తరువాత చిత్రాలు
చకియా బస్ స్టాండ్, చందౌలీ, తేదీ 03/10/2022
జిబి పంత్ హాస్పిటల్, బి.బి.కంటోన్మెంట్. శ్రీనగర్ తేదీ 12/10/2022
బి.ఓ.సి.చౌక్ గోల్‌పర్ తేదీ 11/10/2022
ఎంటీ పార్క్ (150 బిఎన్, సుక్మా, ఛత్తీస్‌గఢ్) తేదీ 10/10/2022
*****
(Release ID: 1871008)
Visitor Counter : 172