ఆర్థిక మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతా ప్రచారం మరియు ప్రత్యేక ప్రచారం 2.0లో పాల్గొన్న ఆర్థిక వ్యవహారాల విభాగం
प्रविष्टि तिथि:
25 OCT 2022 2:04PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డిఈఏ) దాని సీపీఎస్ఈ, అనుబంధిత, స్వయంప్రతిపత్త సంస్థలతో కలిసి అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 31 వరకు పెండింగ్‌లో ఉన్న అంశాల (ఎస్సిపిడిఎం) పరిష్కారానికి స్వచ్ఛత ప్రచారం, ప్రత్యేక ప్రచారం 2.0లో చురుకుగా పాల్గొంటోంది. ప్రత్యేక ప్రచారం 2.0 సమయంలో, డిఈఏ లక్ష్యం పరిశుభ్రత డ్రైవ్, పాత రికార్డులను తొలగించడం, వీఐపి సూచనలు, పార్లమెంట్ హామీలు, పీఎంఓ/రాష్ట్ర ప్రభుత్వాల నుండి సూచనలు, ప్రజా ఫిర్యాదులు, మొదలైన వాటికి సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించడం. డిఇఎ కార్యదర్శి స్థాయిలో సమీక్షతో సహా అనేక రౌండ్ల సమావేశాలు జరిగాయి. కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, ప్రచారాన్ని విజయవంతం చేయడానికి క్షేత్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేశారు. ప్రచార సమయంలో, నార్త్ బ్లాక్ కారిడార్‌ల సుందరీకరణ, గదుల పునరుద్ధరణను డిఈఏ చేపట్టింది. సిపిఎస్ఈ ద్వారా డిఈఏ - సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పిఎంసిఐఎల్) దాని 10 సైట్‌లలో విస్తృతమైన పరిశుభ్రత డ్రైవ్ చేపట్టారు.



****
(रिलीज़ आईडी: 1870829)
आगंतुक पटल : 144