ఆయుష్
azadi ka amrit mahotsav

ఘనంగా 7వ ఆయుర్వేద దినోత్సవం


ఆయుష్ రంగంలో సహకారం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ గిరిజన వ్యవహారాల శాఖల మధ్య అవగాహన ఒప్పందం
'ఆయుర్వేదానికి నేను సహకరిస్తాను' పేరిట ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రచారానికి 1.7 కోట్ల మంది ప్రజల మద్దతు

Posted On: 23 OCT 2022 2:56PM by PIB Hyderabad

దేశవిదేశాల్లో  7వ ఆయుర్వేద దినోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ప్రజలందరికి ఆయుర్వేద వైద్యం ప్రయోజనాలు తెలియజేసి ఆయుర్వేద వైద్య విధానానికి మరింత ప్రచారం కల్పించేందుకు ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని  "హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం" అనే ఇతివృత్తంతో నిర్వహించారు.  ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆరు వారాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ దాదాపు 25 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు , విదేశాంగ శాఖ సహకారంతో దేశం వివిధ ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు, మిషన్లలో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ 5000 కి పైగా కార్యక్రమాలు నిర్వహించింది. 

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి   శ్రీ డా. ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాలుభాయ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ  వైద్య రాజేష్ కోటేచా,; గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా, ఆయుష్ మంత్రిత్వ శాఖ  ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్ AIIA  డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా మనోజ్ నేసరి మరియు విదేశీ రాయబార కార్యాలయాల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ సర్బానంద సోనోవాల్ ఆయుర్వేదాన్ని వ్యాధుల నివారణ శాస్త్రంగా వర్ణించారు. ఆయుర్వేదం  పురాతనమైన విజ్ఞాన శాస్త్రం అని  పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన  పరిశోధన మండళ్లు  ఆయుష్ రంగంలో కొన్ని  పరిశోధనలు చేపట్టాయని  శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఆయుర్వేద వైద్యానికి మరింత ప్రచారం కల్పించి వైద్య ప్రయోజనాలను ప్రజలకు అందించే లక్ష్యంతో ' హర్ దిన్ హర్ ఘర్' పేరిట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆయుర్వేద వైద్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చేసాయని  శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు. 

శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ  “ఆయుర్వేదం భారతదేశ ప్రాచీన సంప్రదాయం మరియు సంపద. అడవుల్లో నివసించే ప్రజల సహకారంతో  ఆయుర్వేదాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. ఆయుర్వేదం మాత్రమే  జబ్బుపడిన తర్వాత చికిత్స అందించకుండా  వ్యాధి నివారణ అంశానికి ప్రాధాన్యత ఇస్తుంది" అని అన్నారు. 

.ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలో ఆయుష్ ఆరోగ్య వ్యవస్థను వేగవంతం చేసిందని, ప్రస్తుతం 30 దేశాల్లో ఆయుర్వేదానికి గుర్తింపు ఉందని డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్ అన్నారు. ప్రస్తుతం ఆయుష్ లావాదేవీలు 18.1 బిలియన్ డాలర్ల వరకు జరుగుతున్నాయని అని ఆయన తెలియజేశారు.

శ్రీమతి మీనాక్షి లేఖి మాట్లాడుతూ “మన పూర్వీకుల శాస్త్రాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం ఇది. 5000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతనమైన ఒక శాస్త్రాన్ని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యవేక్షణలో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. శ్రీ నరేంద్ర మోదీ  ఆయుర్వేద శాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రంగానికి మరింత ప్రాధాన్యత పెరిగింది." అని అన్నారు. 

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా గత 6 వారాల పాటు  వివిధ సంస్థలు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని  ప్రొఫెసర్ తనూజ నేసరి తెలియజేశారు.  1.7 కోట్ల మందికి పైగా ప్రజలు  'ఐ సపోర్ట్ ఆయుర్వేదం' ప్రచారానికి మద్దతు తెలిపారని, కార్యక్రమాల్లో , 56 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని  ప్రొఫెసర్ తనూజ నేసరి తెలియజేశారు.  గిరిజన అభివృద్ధి.రెండు మంత్రిత్వ శాఖల మధ్య సహకారం, కలయిక మరియు సమ్మేళనం అంశాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవగాహన కుదిరింది.  గిరిజన సంస్కృతి వారసత్వ పరిరక్షణ, అభివృద్ధికి గల అంశాలను గుర్తించేందుకు  సామర్థ్య అభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసే విధంగా రెండు మంత్రిత్వ శాఖలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. .

ఈ సందర్భంగా 'ది ఆయుర్వేదిక్ ఫార్మాకోపియా ఆఫ్ ఇండియా', 'ది ఆయుర్వేదిక్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా' పుస్తకాన్ని విడుదల చేశారు. ఔషధ మొక్కల ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు, ఆయుష్ మంత్రిత్వ శాఖ  అశ్వగంధ - ఆరోగ్య ప్రమోటర్‌పై జాతుల-నిర్దిష్ట జాతీయ ప్రచార కార్యక్రమాన్నిప్రారంభించింది. లఘు వీడియో పోటీల్లో మొదటి బహుమతిగెల్చుకున్న విజేతలను  కేంద్ర ఆయుష్ మంత్రి మరియు ఇతర ప్రముఖులు సత్కరించారు

***

 



(Release ID: 1870482) Visitor Counter : 216