నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గౌహతిలోని మాలిగావ్ నుండి రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న శ్రీ సర్బానంద సోనోవాల్. 200 మందికి పైగా విజయవంతమైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2022 3:30PM by PIB Hyderabad

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గౌహతిలోని మాలిగావ్‌లో జరిగిన రోజ్‌గార్‌ మేళాలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా 200 మందికి పైగా విజయవంతమైన అభ్యర్థులకు ఈ రోజు అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందజేశారు.

 

image.png


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.."దేశంలోని యువతకు ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వంలో దేశంలోని దాదాపు 75,000 మంది యువకులు విధుల్లో చేరారు. మోదీ జీ నిర్దేశించినట్టుగా 2047 నాటికి భారతదేశం ఆత్మనిర్భర్ భారత్‌గా మారడానికి అమృత్‌కాల్‌ సమయంలో నవ భారతదేశాన్ని రూపొందించడంలో మరియు నిర్మించడంలో మన యువత పాత్ర చాలా కీలకం. మోదీ జీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని యువతకు సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఈ కొత్త బలమైన భారతదేశానికి డ్రైవర్లుగా మారేందుకు వీలు కల్పిస్తున్నాం. ఈ పవిత్రమైన ధంతేరస్ రోజున భారతదేశ  శ్రేయస్సు మరియు అభివృద్ధి కోసం మన డైనమిక్ లీడర్ శ్రీ నరేంద్ర మోడీ జీతో కలిసి పనిచేయాలని నేను యువతకు పిలుపునిస్తున్నాను" అని తెలిపారు.

 

image.png

image.png

image.png

image.png

****


(రిలీజ్ ఐడి: 1870363) సందర్శకుల సూచీ సంఖ్య : : 195
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil