ఆయుష్
పెద్ద ఎత్తున 2022 అక్టోబర్ 23న 7వ ఆయుర్వేద దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు
ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా ఆరు వారాల పాటు పలు కార్యక్రమాల నిర్వహణ
Posted On:
22 OCT 2022 6:15PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున 2022 అక్టోబర్ 23న 7వ ఆయుర్వేద దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
2016 నుంచి ధన్వంతరి జయంతిని ఆయుర్వేద దినోత్సవం గా పాటిస్తున్నారు. గ్రంధాలలో నిక్షిప్తం అయిన భారతదేశానికి చెందిన ఆయుర్వేద వ్యవస్థను మరింతగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతి ఏటా ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆయుర్వేద దినోత్సవం ప్రధాన కార్యక్రమం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతుంది. సంపూర్ణ ప్రభుత్వ విధానంలో ఇతర మంత్రిత్వ శాఖల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది భారతీయ మిషన్లు/ఎంబసీలు తమ తమ దేశాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగే ప్రధాన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయుష్, మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మరియు ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం "హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం" అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఆయుర్వేద వైద్యం వల్ల కలిగే ప్రయోజనాలను అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికోసం మూడు అంశాలను గుర్తించి కార్యక్రమాలు నిర్వహిస్తారు . యుర్వేద ప్రయోజనాలను పెద్ద మరియు అట్టడుగు వర్గాలకు ప్రచారం చేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా ఆరు వారాలపాటు కార్యక్రమాలు చేపట్టారు. 2022 సెప్టెంబర్ 12 న కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆయుర్వేద దినోత్సవం రోజు కార్యక్రమాలు ముగుస్తాయి.
ఆయుర్వేద దినోత్సవం 2022 వేడుక మొత్తం ప్రభుత్వ విధంగా అమలు చేయబడింది. హోం మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆహారం ప్రజా పంపిణీ మరియు ఇతర మంత్రిత్వ శాఖల సహకారంతో కార్యక్రమాలు జరిగాయి. మిషన్/ఎంబసీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమాలు ఆయుర్వేద దినోత్సవం 2022 కి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాయి.
అన్ని ఆయుష్ సంస్థలు/కౌన్సిళ్లు గత ఆరు వారాల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణ లో చురుకుగా పాల్గొన్నాయి. విలేకరుల సమావేశాలు నిర్వహించి ప్రాంతీయ మీడియాకు ఆయుర్వేద వైద్యం ప్రయోజనాలు, ఆయుర్వేద దినోత్సవ ప్రాధాన్యత వివరించారు.
***
(Release ID: 1870359)
Visitor Counter : 166