ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోజ్ గార్ మేళా డ్రైవ్ లో పాల్గొన్న సిబిడిటి

Posted On: 22 OCT 2022 3:34PM by PIB Hyderabad

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శనివారం నాడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారీ నియామకాల కార్యక్రమమైన రోజ్ గార్ మేళాను ప్రారంభించారు. ఈ నియామకాల కార్యక్రమంలో 10 లక్షలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ కార్యక్రమం తొలి విడతలో ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75,000మందికి పైగా కొత్త నియామకాలు/ రిక్రూట్ లకు నియామక పత్రాలను అందించారు. 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నియమితులైనవారిని ఉద్దేశించి ప్రసంగించి, అభినందించారు. నూతనంగా నియమితులైనవారందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు; దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 ప్రాంతాలు/ కేంద్రాలకు వ్యక్తిగతంగా వెళ్ళడం ద్వారా లేదా దృశ్యమాధ్యమం ద్వారా అనుసంధానం అయ్యేందుకు ఇచ్చిన లింక్ ద్వారా పాలు పంచుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా 50 ప్రాంతాలలో వేడుకలను నిర్వహించగా, సీనియర్ అధికారులు, ప్రముఖులు ఈ కేంద్రాలలో కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందించారు. 
కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆదాయపు పన్నుల శాఖ చెన్నై ప్రాంతంలో మొత్తం 57మంది అభ్యర్ధులను నియమించింది. ఎంపిక అయిన వారిలో 20 మంది నియామక పత్రాలను అందుకునేందుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆదాయపు పన్ను శాఖ (ఇద్దరు ఇనస్పెక్టర్లు, ఒక టాక్స్ అసిస్టెంట్)కు ఎంపిక అయిన, కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరైన 3 నూతన అభ్యర్ధులకు ఆర్థిక మంత్రి నియామక పత్రాలను అందించారు. మిగిలిన అభ్యర్ధులు ఈ కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా హాజరయ్యేందుకు లింక్ ను అందించారు. 
మిషన్ మోడ్ (స్పష్టమైన లక్ష్యాలు, కాలపరిమితితో ) మంజూరు చేసిన పోస్టులకు వ్యతిరేకంగా ఉనికిలో ఉన్న ఖాళీలను నింపేందుకు పని చేయవలసిందిగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  మిషన్ మోడ్ నియామకాల డ్రైవ్ లో భాగంగా, ఆదాయాపు పన్ను శాఖ 1093 నియామక పత్రాలను నూతనంగా నియమించిన ఆదాయపు పన్ను ఇనస్పెక్టర్స్, టాక్స్ అసిస్టెంట్లకు 22 అక్టోబర్ 2022న జారీ చేసింది. ఇందులో, దాదాపు 300 కొత్తగా ఎంపిక అయిన వారు 18 పిఆర్. సిసిఐటి (సిసిఎ) ప్రాంతాలలో నిర్వహించిన కార్యక్రమాలలో వ్యక్తిగతంగా పాల్గొనగా, ఇతరులు దృశ్యమాధ్యమం ద్వారా పాలుపంచుకున్నారు. 

***
 


(Release ID: 1870358)