నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రత్యేక స్వచ్ఛతా ఉద్యమం 2.0లో భాగంగా ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు
ఎస్‌సిడిపిఎం2.0 ముఖ్యమైన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించడానికి వివిధ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచార పద్ధతులు అనుసరించబడ్డాయి.
పెండెన్సీని తొలగించడం అలాగే మరింత పారదర్శకతతో సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి
Posted On:
21 OCT 2022 12:36PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం చేపట్టిన 'స్పెషల్ క్యాంపెయిన్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ మెటర్స్' (ఎస్‌సిడిపిఎం2.0) కింద నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను చేపట్టింది.ఎంఓపిఎస్‌డబ్ల్యూ పెండెన్సీని తొలగించడం మరియు పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి వాటిని ప్రధాన అంశాలుగా గుర్తించింది. దీని ఫలితంగా మెరుగైన రికార్డు నిర్వహణ, పని సామర్థ్యాల పెంపుదల, పారదర్శకత, స్థిరమైన భవిష్యత్తుకు దోహదం చేస్తుంది.
ఎస్‌సిడిపిఎం2.0 మార్గదర్శకాల ప్రకారం మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు మరియు వాటి అనుబంధ/సబార్డినేట్ కార్యాలయాలతో పాటు ఫీల్డ్/అవుట్‌స్టేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబడింది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఓడరేవులు మరియు సబార్డినేట్/అటాచ్డ్ కార్యాలయాలు పెండెన్సీని తొలగించడానికి మరియు వారి కార్యాలయాలు మరియు వారి కార్యాలయ సమ్మేళనాలలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి వివిధ ప్రయత్నాలను చేపడుతున్నాయి. నిర్దేశించబడిన లక్ష్యాల వివరాలు మరియు సాధించిన పురోగతి క్రమం తప్పకుండా ఎస్‌సిడిపిఎం2.0 ప్రత్యేక ప్రచార పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి.ఎంఓపిఎస్‌డబ్ల్యూకు చెందిన అన్ని ప్రధాన నౌకాశ్రయాలు మరియు అనుబంధ కార్యాలయాలు స్వచ్ఛ భారత్ 2.0క్రింద వివిధ కార్యక్రమాలు చేపట్టాయి.
జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్‌పిఏ) "అప్‌లిఫ్ట్ ఇండియా అసోసియేషన్" మరియు భాగస్వామ్య సంస్థ హమ్‌సేఫర్ ఫౌండేషన్ సహకారంతో ట్రక్ డ్రైవర్ల సంక్షేమం కోసం పని చేస్తోంది మరియు వారికి ఉచిత ఆరోగ్య రక్షణ పథకంతో పాటు సురక్షితమైన డ్రైవింగ్ టెక్నాలజీని అందిస్తోంది. డిసెంబర్ 2022 నాటికి ఈ పథకం కింద సుమారు 10000 ట్రక్ డ్రైవర్లు ప్రయోజనం పొందుతారు.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 612 ఎంటి రాగి స్లాగ్, 210 ఎంటి పారిశ్రామిక వ్యర్థాలు, 400 ఎంటి స్టీల్ స్క్రాప్‌లను తొలగించింది. దాదాపు 400 మంది ఉద్యోగులతో 11 అక్టోబర్ 2022న 'శ్రీరామదాన్' ఉద్యమం ప్రారంభమైంది. దీని ఫలితంగా యార్డ్‌లోని దాదాపు 1500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శుభ్రం మరియు పునర్వ్యవస్థీకరణ జరిగింది. సిఎస్‌ఎల్ కూడా ఎన్‌ఐఐఎస్‌టి సహాయంతో 'వేస్ట్ టు వెల్త్' మిషన్ కింద పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తోంది. ఒక సంవత్సరంలో సుమారు 8000 ఎంటి రాగి స్లాగ్ వ్యర్థాలు నిర్వహించబడుతున్నాయి.
శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ (ఎస్‌ఎంపిఏ) బెస్ట్ ప్రాక్టీస్ అప్రోచ్‌గా ప్యాడిల్ స్టీమర్‌ను క్రూయిజ్ టూరిజంకు ప్రత్యేకమైన షోకేస్‌గా మార్చింది. దీనిలో అండర్ డెక్ మ్యూజియం, ఫ్లోటింగ్ రెస్టారెంట్/ కాన్ఫరెన్స్/ ఎడ్యుటైన్‌మెంట్ మొదలైనవి ఉన్నాయి.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులు మరియు ఉద్యోగులు విశాఖపట్నం తీరప్రాంతాన్ని ప్రతిరోజూ శుభ్రపరుస్తారు. ఇందులో భాగంగా 73.55 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు 159.70 టన్నుల ఇతర రకాల వ్యర్థాలతో కలిపి మొత్తం 233.25 టన్నుల చెత్తను సేకరించారు. విపిఏ ఉద్యోగులు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకూ విపిఏ ఆఫీస్ ప్రాంగణాన్ని/ పని ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారు.
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐI) వారంలో ఒక రోజును రికార్డు మరియు పెండింగ్‌ల నిర్వహణ కోసం గుర్తించింది. అలాగే ఓడల నిర్వహణకు వారంలో ఒక నిర్వహణ రోజును చేపట్టింది.
విఓ చిదంబరనార్ పోర్ట్ అథారిటీ అనేక కార్యకలాపాలు చేసింది; వీటిలో 6,000 మొక్కల పెంపకం, 16.13 ఎకరాల్లో కలుపును తొలగించడం, అన్ని లైట్లను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చడం, రూ. 36 లక్షలతో 31 లక్షల రికార్డులను డిజిటలైజ్ చేయడం, ఆరు ఈ-కార్లు, ఛార్జింగ్ సిస్టమ్ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి.
న్యూమంగళూరు పోర్ట్ అథారిటీ (ఎన్‌ఎంపిఎ) వర్మికల్చర్ సాంకేతికత ద్వారా అధిక నాణ్యత గల ఎరువుగా మార్చడం ద్వారా ఉత్పత్తి చేయబడిన చెత్తను స్వీయ-నిర్వహణకు అనువుగా మార్చింది. మిగులు కంపోస్టు ఎరువును విక్రయించి ఆదాయం సమకూరుతుంది. పోర్ట్ అథారిటీ వర్మికల్చర్ టెక్నాలజీ ద్వారా అధిక నాణ్యత గల ఎరువుగా మార్చడం ద్వారా ఉత్పత్తి చేయబడిన చెత్తను స్వీయ నిర్వహణను స్వీకరించింది.
- ఇంతకుముందు పోర్ట్ మున్సిపల్ నిర్దేశిత ప్రదేశంలో చెత్తను పారవేసేది. అందుకో రోజుకు రూ.3000/- ఖర్చు చేసేది.
- రూ.50 లక్షల కాపెక్స్‌తో వర్మికల్చర్ టెక్నాలజీని అవలంబించడం ద్వారా పోర్ట్ సంవత్సరానికి రూ.4.50 లక్షల ఆదాయాన్ని పొందుతుంది.
- నెలకు 1.5 టన్నుల ఎరువు ఉత్పత్తి అవుతుంది, ఇది ఓడరేవు ప్రాంతంలో ప్లాంటేషన్ మరియు గార్డెనింగ్ పనులకు ఉపయోగించబడుతుంది. ఇది మార్కెట్ నుండి ఎరువు కొనుగోలును ఆదా చేస్తుంది.
- మిగులు కంపోస్టు ఎరువును విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుంది.
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మీడియా డిపార్ట్‌మెంట్, ఉద్యోగులు మరియు ఏజెన్సీలందరికీ ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందుకు స్పెషల్ క్యాంపెయిన్ 2.0పై వీడియోలను కూడా రూపొందించింది. ఆ లింక్-
******
(Release ID: 1870139)
Visitor Counter : 173