హోం మంత్రిత్వ శాఖ

'పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం' సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరులైన పోలీసు , సిఎపిఎఫ్ లకు నివాళులు అర్పించిన కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


దేశ అంతర్గత భద్రత పరిరక్షణకు అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా దేశవ్యాప్తంగా పోలీసు దళాలు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి: అందుకే దేశం నేడు అభివృద్ధి పథంలో ఉంది

దేశరక్షణలో మన దళాల సైనికుల త్యాగాలు వృథా కాకుండా భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తూనే ఉంటుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, పోలీసు బలగాలు, సి ఎ పి ఎఫ్ సిబ్బంది , వారి కుటుంబాలకు భద్రత , సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది; ఈ దిశగా నిరంతరం పనిచేస్తుంది.

అంతర్గత భద్రత , సరిహద్దుల పరిరక్షణ వీధుల నిర్వహణ సమయం లో దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా పోలీసు , సి ఎ పి ఎఫ్ సిబ్బంది ప్రాణ త్యాగం చేశారు

భారతదేశం ప్రతి రంగంలోనూ పురోగతి సాధిస్తోంది, స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల తరువాత నేడు మనం ఖచ్చితంగా మన లక్ష్యం వైపు దృఢ సంకల్పం తో, వేగంతో కదులుతున్నామని సంతృప్తితో చెప్పవచ్చు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 8 సంవత్సరాలలో, దేశంలో అంతర్గత భద్రతా పరిస్థితిలో చాలా సానుకూలమైన మార్పు వచ్చింది; జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు లేదా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు

Posted On: 21 OCT 2022 3:15PM by PIB Hyderabad

'పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం' సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీ లోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరులైన పోలీసులు , సిఎపిఎఫ్ లకు నివాళులు అర్పించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ అజయ్ కుమార్ మిశ్రా, శ్రీ నిషిత్ ప్రామాణిక్ , కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తమ ప్రసంగంలో, భారతదేశం ప్రతి రంగంలోనూ పురోగతి సాధిస్తోందని, స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల తరువాత నేడు మనం ఖచ్చితంగా మన లక్ష్యం వైపు దృఢ సంకల్పం తో, వేగంతో కదులుతున్నామని సంతృప్తితో చెప్పవచ్చునని అన్నారు. దేశం సాధించిన అసంఖ్యాక విజయాల్లో ప్రధానాంశంగా ధైర్యసాహసాలు కలిగిన పోలీసులు, సిఎపిఎఫ్ సిబ్బంది చేసిన అత్యున్నతమైన ప్రాణ త్యాగం దాగి ఉందని శ్రీ షా అన్నారు. అంతర్గత భద్రత , సరిహద్దుల పరిరక్షణ వీధుల నిర్వహణ సమయం లో దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా పోలీసు , సి ఎ పి ఎఫ్ సిబ్బంది ప్రాణ త్యాగం చేశారని అన్నారు.

కృతజ్ఞతతో ఉన్న దేశం తరఫున అమరులైన సైనికులందరికీ వినయపూర్వక నివాళులు అర్పిస్తూ, దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు వృథా కావని, భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు.

 

దేశ అంతర్గత భద్రత ను కాపాడేందుకు దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయని, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తమ విధులను నిర్వర్తిస్తున్నాయని, అందుకే భారతదేశం వంటి పెద్ద దేశం నేడు అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడం నుండి చిన్న చిన్న నేరాల వరకు, పెద్ద ఉత్సవాలు, సమావేశాల సమయంలో ప్రజల రక్షణ, విపత్తులు ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన ద్వారా ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటం వరకు పోలీసులు వివిధ రకాల విధులను నిర్వహిస్తారని ఆయన అన్నారు.ఇటీవల కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొన్న సమయంలో

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాయకత్వంలో దేశం మొత్తం చేసిన

సమిష్టి ప్రయత్నాలలో మన పోలీసు సిబ్బంది ముందంజలో ఉన్నార ని శ్రీ షా అన్నారు. పోలీసులు, వారి జీవితాల గురించి పట్టించుకోకుండా, ప్రజలను ఆసుపత్రికి తీసుకెళ్లడం నుండి, బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించడం , లాక్ డౌన్ సమయంలో శాంతిభద్రతలను కాపాడడం వరకు తమ బాధ్యతలను చాలా బాగా నిర్వర్తించారని శ్రీ షా అన్నారు. పోలీసులు నిస్వార్థంగా ఈ బాధ్యతలను నిర్వర్తించారని, ఈ వ్యవస్థీకృత ప్రయత్నాల ఫలితమే నేడు భారతదేశం కోవిడ్-19 మహమ్మారి క్లిష్టమైన దశ నుండి విజయం సాధించి బయటకు వచ్చిందని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలలో దేశ అంతర్గత భ ద్రతా ప రిస్థితుల్లో చాలా సానుకూల మార్పు వచ్చిందని శ్రీ అమిత్ షా అన్నారు. గతంలో ఈశాన్య, జమ్మూకశ్మీర్, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రతి రోజూ హింసాత్మక ఘటనల వార్తలు వచ్చేవని, కానీ గత ఎనిమిదేళ్ళలో ఈశాన్యంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం స్థానంలో, యువతకు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక అధికారం లభిస్తోందని, ఈశాన్యంలో హింసాత్మక ఘటనలు 70 శాతానికి పైగా తగ్గడం ఈశాన్య రాష్ట్రాల సౌభాగ్యానికి సంకేతమని శ్రీ షా అన్నారు. అదేవిధంగా, జమ్మూ కాశ్మీర్ లో కూడా, యువకులు గతం లో రాళ్ళు రువ్వేవారు, కానీ నేడు అదే యువత పంచ్ లు , సర్పంచులుగా మారడం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దోహదపడుతున్నారని ఆయన తెలిపారు.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇంతకు ముందు చాలా హింసాత్మక సంఘటనలు జరిగేవని, కానీ నేడు ఏకలవ్య పాఠశాలల్లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారని, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నారని ఆయన చెప్పారు.

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశ అంతర్గత భద్రత పరిరక్షణ కోసం అనేక క్రియాశీల చర్యలు తీసుకుందని, దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు , సిఎపిఎఫ్ లు చివరి మైలు వరకు ఆ చర్యలను అమలు చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశంలోని చాలా హాట్ స్పాట్ లు దేశ విద్రోహ

కార్యక్రమాల నుండి దాదాపు విముక్తి పొందాయని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని

ప్రభుత్వం పోలీసు సిబ్బంది సంక్షేమానికి పూర్తిగా కట్టుబ డి ఉందని శ్రీ షా అన్నారు.ఆరోగ్య సేవలను అందించడంతో పాటు,వారికి ఇళ్ల నిర్మాణం, పని గంటల హేతుబద్ధం అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా బాగా పనిచేయడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించింది. ఆయుష్మాన్ సిఎపిఎఫ్

పథకం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం సుమారు 35 లక్షల కార్డులను పంపిణీ చేసిందని, ఇప్పటి వరకు రూ.20 కోట్ల కు పైగా నగదు ను అందచేసిందని ఆయన

వివరించారు. సిఎపిఎఫ్ ఇ-ఆవాస్ పోర్టల్ సహాయంతో, క్వార్టర్లు , ప్రత్యేక కుటుంబ గృహ సౌకర్యాల సరైన పంపిణీ చాలా సులభంగా ఉందని శ్రీ షా అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాయకత్వంలో ప్రభుత్వం పోలీసు గృహ నిర్మాణ రేటుకు ప్రాధాన్యత ఇచ్చిందని, దీని ఫలితంగా 2014లో గృహ నిర్మాణ నిష్పత్తి 37 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 48 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు. వీటితో పాటు 31 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 17 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, అదనంగా 15 వేలకు పైగా ఇళ్లు నిర్మించాలని

ప్రతిపాదించామని , తత్ఫలితంగా, గృహ నిర్మాణ రేటు 37% నుండి 60% కు పెరుగుతుందని శ్రీ అమిత్ షా తెలిపారు.

ఎన్ సిసి క్యాడెట్ లకు ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా పోలీసు దళాల్లో శిక్షణ పొందిన మానవ శక్తిని అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని శ్రీ షా చెప్పారు. 'సి', 'బి', 'ఎ' సర్టిఫికేట్లకు వరుసగా 5%, 3%, 2 గ్రేస్ మార్కులు ఇస్తున్నారు.

 

జాతీయ పోలీసు స్మారక చిహ్నం రూపంలో మనం చూస్తున్న అటల్ రాక్ మన పోలీసు సిబ్బంది అచంచలమైన నిర్భయతకు , విధి పట్ల వారి అంకితభావానికి చిహ్నమని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలు , సిఎపిఎఫ్ సైనికులు , వారి కుటుంబాల భద్రత , సౌకర్యాల కల్పన కు కట్టుబడి ఉందని, ఎల్లప్పుడూ ఈ దిశగా పనిచేస్తుందని శ్రీ అమిత్ షా చెప్పారు.

 

*****



(Release ID: 1870137) Visitor Counter : 136