శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు బయోటెక్నాలజీ శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం 2.0 ముఖ్య అంశాలు

Posted On: 21 OCT 2022 9:22AM by PIB Hyderabad

 పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలోని   బయోటెక్నాలజీ విభాగం ప్రత్యేక స్వచ్చత కార్యక్రమం 2.0ని అమలు చేస్తున్నది. అక్టోబర్ 2న ప్రారంభమైన కార్యక్రమం అక్టోబర్ 31 వరకు అమలు జరుగుతుంది. బయోటెక్నాలజీ శాఖ, శాఖ కు అనుబంధంగా పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.  17 ప్రాంతాల్లో  (15 స్వయం ప్రతిపత్తి సంస్థలు, రెండు ప్రభుత్వ రంగ సంస్థలు) ఉన్న శాఖ భవనాలు, ప్రాంగణాలు శుభ్రం చేసేందుకు కార్యక్రమం అమలు జరుగుతోంది.  

కార్యక్రమంలో భాగంగా అమలు చేసిన ముఖ్య కార్యక్రమాలు, సాధించిన విజయాలు  ఈ క్రింది విధంగా ఉన్నాయి. కార్యక్రమం అమలు చేయడానికి ముందు, అమలు చేసిన తర్వాత పరిస్థితిని తెలియజేసే విధంగా స్వచ్ఛత కార్యక్రమం  2.0 పోర్టల్‌లో 8 సెట్ల  ఫోటోలు  అప్‌లోడ్ చేయడం జరిగింది. వ్యర్థాలను తొలగించడం వల్ల  సుమారు 28000 చదరపు అడుగుల విస్తీర్ణం వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. వ్యర్థాల అమ్మకం ద్వారా  .  23.5 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. సుమారు 20 వేల ఫైళ్లను రికార్డుల నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధించిన ప్రగతిపై విభాగాలు,  ఏఐలు మరియు పిఎస్‌యుల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో  క్రమం తప్పకుండా పోస్ట్ చేయబడుతున్నాయి. ఇంతవరకు 48 ట్వీట్లు పోస్ట్ చేయబడ్డాయి. DARPG మరియు ఇతర మంత్రిత్వ శాఖలు పోస్ట్ చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాత  రీట్వీట్ చేయడం కూడా జరుగుతోంది. కార్యక్రమాన్ని  కొనసాగించేందుకు ఏఐ/ ప్రభుత్వ రంగ సంస్థల నోడల్ అధికారులు తరచూ  సమీక్ష సమావేశాలు  నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు 8 సార్లు సమీక్షా సమావేశాలు జరిగాయి. డిజిటలైజేషన్ అమలు కోసం  ఒక ప్రత్యేక కార్యక్రమం అమలు జరుగుతోంది. ఫరీదాబాద్ లో ఉన్న ప్రాంతీయ బయోటెక్నాలజీ లో చదువుతున్న విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఈ పోర్టల్ ను అభివృద్ధి చేసి ప్రారంభించడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. బయోటెక్నాలజీ శాఖకు చెందిన ఏఐ, అనుబంధ సంస్థల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.  

 

***

 



(Release ID: 1869992) Visitor Counter : 132