రక్షణ మంత్రిత్వ శాఖ
వివిధ దేశాల ప్రతినిధులతో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు
- గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మడగాస్కర్, మొజాంబిక్, మంగోలియా & సురినామ్‌ల దేశాల ప్రతినిధులతో సమావేశాలు
Posted On:
20 OCT 2022 2:00PM by PIB Hyderabad
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అక్టోబర్ 20, 2022న జరిగిన 12వ డిఫెక్స్‌పోకు ప్రదర్శనకు హాజరైన మడగాస్కర్, మొజాంబిక్, మంగోలియా, సురినామ్‌లకు చెందిన ప్రతినిధులతో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న భారతదేశం-ఆఫ్రికా రక్షణ చర్చలు & ఇండియన్ ఓషియన్ రీజియన్ ప్లస్ కాంక్లేవ్లో పాల్గొన్నారు. వరుస సమావేశాలలో భాగంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మడగాస్కర్ జాతీయ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ రకోటోనిరినా లియోన్ జీన్ రిచర్డ్‌తో సమావేశమయ్యారు; మరోవైపు మొజాంబిక్ జాతీయ రక్షణ మంత్రి మిస్టర్ క్రిస్టోవావో ఆర్తుర్ చుమే; మంగోలియా రక్షణ మంత్రి శ్రీ సైఖన్‌బయార్ గుర్సెడ్ మరియు సురినామ్ రక్షణ మంత్రి శ్రీమతి కృష్ణకోమెరీ మథోయోరాతో కూడా చర్చలు జరిపారు. పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించుకోవడానికి మార్గాలను గుర్తించడంపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారించారు. సమావేశాలలో రక్షణ సహకారానికి గల పూర్తి అవకాశాలను గురించి చర్చించారు.
***
(Release ID: 1869647)
Visitor Counter : 150