సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు "ఈజ్ ఆఫ్ లివింగ్" లక్ష్యంతో పెన్షన్ సేవా పోర్టల్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్; స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి రికార్డు సమయం లో పెన్షన్ సేవా పోర్టల్ భవిష్య తో అనుసంధానం చేసిన తొలి పెన్షన్ బట్వాడా బ్యాంక్


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భవిష్య పోర్టల్ అనుసంధానం, అన్ని పెన్షన్ బట్వాడా బ్యాంకు పోర్టల్ లతో దీనిని మరింత ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ ప్రారంభం కావడం- ఒకే లాగిన్ తో పెన్షనర్లు పూర్తి సమాచారం , సేవలను ఒకే చోట పొందడానికి దోహదపడే ఒక మైలురాయి అభివృద్ధి

Posted On: 20 OCT 2022 1:40PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర ,సాంకేతిక శాఖ

సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్),  మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ , ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ప్రధానమంత్రి కార్యాలయం, డిఓపిటి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ , ప్ర జా గ్రీవెన్స్ , పన్నులు, పింఛన్లు, స్పేస్ , అటామిక్ ఎనర్జీ శాఖల సహాయ మంత్రి డాక్ట ర్ జితేంద్ర సింగ్ 2022 అక్టోబర్ 18 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ల పోర్టల్ ను ప్రారంభించారు. పోర్టల్ భవిష్య 9.0 వెర్షన్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు జీవన సౌలభ్యం కల్పించడం పోర్టల్ఉద్దేశం. మిగిలిన 16 పెన్షన్ బట్వాడా బ్యాంకుల ను కూడా ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ల పోర్టల్ తో తమ ఇంటిగ్రేషన్ ను ప్రారంభిస్తాయి.

2022 జూన్ 15 భవిష్య పోర్టల్ లబ్ధిదారులతో జరిగిన ముఖాముఖిలో, గౌరవ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, పెన్షనర్ల జీవన సౌలభ్యం కోసం సింగిల్ పెన్షనర్ల పోర్టల్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. మేరకు పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఒపిపిడబ్ల్యు) సింగిల్ పెన్షనర్ల పోర్టల్ ను అందించడానికి భవిష్య పోర్టల్ ను బేస్ పోర్టల్ గా ఉపయోగించి ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ల పోర్టల్ ను అభివృద్ధి చేసింది.

నేషనల్ -గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్ మెంట్ (ఎన్ ఈఎస్ డిఎ) ద్వారా భవిష్య ఇటీవల అన్ని భారత ప్రభుత్వ సర్వీస్ పోర్టల్ లలో మూడవ అత్యుత్తమ పోర్టల్ గా రేటింగ్ పొందింది. అందువల్ల డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డిఒపిపిడబ్ల్యు) భవిష్య తో అనుసంధానం కోసం ఎండ్-టు-ఎండ్ డిజిటలైజ్డ్ పోర్టల్ ను బేస్ పోర్టల్ గా ఎంచుకుంది, ఇది అంతిమంగా

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ సింగిల్ విండోగా మారుతుంది.

ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ల పోర్టల్, భవిష్య, సిపిఎన్ జి ఆర్ ఎం ఎస్, అనుభవ్, సంకల్ప్, అనుదాన్ మొదలైన డిఒపిపిడబ్ల్యు కు చెందిన వివిధ ఇతర పోర్టల్స్ ను, బ్యాంకుల పోర్టల్స్ ని కలిగి ఉంటుంది, తద్వారా సింగిల్ విండో నుంచి బహుళ సేవలను అందిస్తుంది.

సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, పెన్షన్ చెల్లింపు , ట్రాకింగ్ సిస్టమ్ కోసం ఒక పోర్టల్ అయిన భవిష్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ సేవా పోర్టల్ లలో ఇంటిగ్రేట్ అవుతోందని, ఇది పెన్షనర్లు ఒకే లాగిన్ తో మొత్తం సమాచారం , సేవలను ఒకే చోట పొందడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు.

ఇంటిగ్రేషన్ అన్ని దశలను పూర్తి చేసిన తరువాత, రిటైర్ అయినవారు ఆన్ లైన్ పెన్షన్ ఖాతాను తెరవడం కోసం బ్యాంకు , బ్రాంచీని ఎంచుకోవచ్చు, వారి నెలవారీ పెన్షన్ స్లిప్ లు తనిఖీ చేసుకోవచ్చు. ఫారం 16, స్టేటస్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్ తెలుసుకోవచ్చు. ఇంకా భవిష్య ద్వారా తమ పెన్షన్ బట్వాడా బ్యాంకును మార్చవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పెన్షన్ సేవా పోర్టల్ ను రికార్డు సమయంలో భవిష్య తో ఏకీకృతం చేసిన మొదటి పెన్షన్ బట్వాడా బ్యాంకు.

అన్ని పెన్షన్ బట్వాడా బ్యాంకులతో విలీనం ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటిగ్రేషన్ ఒక మైలురాయి అభివృద్ధిపెన్షనర్లు ఒకే లాగిన్ తో ఒకే చోట మొత్తం సమాచారం, సేవలను పొందడానికి దోహదపడుతుంది. ఇది అన్ని బ్యాంకులకు వారి సేవలను ప్రదర్శించడానికి ఒక అవకాశాన్ని కూడా అందిస్తుంది, సేవలు , భౌగోళిక ప్రదేశం ఆధారంగా బ్యాంకును ఎంచుకోవడానికి పెన్షనర్లకు వీలు కల్పిస్తుంది.తొలుత భవిష్య ద్వారా కేసులను ప్రాసెస్ చేసిన 1.7 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు సేవలు అందుబాటులో ఉంటాయి తరువాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ సేవలు విస్తరించబడతాయి.

 

*****



(Release ID: 1869621) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi , Tamil