గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

దార్శనికతతో ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల మేధోమధనం జరిగి నిర్మాణ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది..శ్రీ హర్దీప్ ఎస్.పూరి


సహకార స్ఫూర్తి, పోటీ సమాఖ్య స్ఫూర్తికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం పెద్ద ఉదాహరణ శ్రీ హర్దీప్ ఎస్.పూరి

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం 2021 అవార్డు గ్రహీతలను సన్మానించిన కేంద్ర పట్టణ వ్యవహారాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరి

Posted On: 20 OCT 2022 9:04AM by PIB Hyderabad

 

ప్రపంచంలో అతిపెద్ద గృహ నిర్మాణ పథకంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం గుర్తింపు పొందిందని   కేంద్ర పట్టణ వ్యవహారాలు,గృహ నిర్మాణ, పెట్రోలియం సహజ వాయువు  శాఖ మంత్రి  .శ్రీ హర్దీప్ ఎస్.పూరి అన్నారు. ప్రపంచంలో అమలు జరుగుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఒకటిగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం అమలు జరుగుతున్నదని తెలిపారు.  నిన్న రాజ్‌కోట్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (PMAY-U)   2021 అవార్డు గ్రహీతలకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన .శ్రీ హర్దీప్ ఎస్.పూరి   ఈ పథకం కింద ప్రభుత్వం  ఇప్పటికే 1.23 కోట్ల ఇళ్లను మంజూరు చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో   2004 - 2014 మధ్య 10 సంవత్సరాల కాలంలో మంజూరైన ఇళ్ల  సంఖ్య కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ అని మంత్రి వెల్లడించారు. మంజూరైన ఇళ్లలో  64 లక్షల ఇళ్ల నిర్మాణం  ఇప్పటికే పూర్తయ్యిందని తెలిపారు. నిర్మాణం పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు అందజేశామని మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని శ్రీ హర్దీప్ ఎస్.పూరి తెలిపారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం కింద  గృహ నిర్మాణ రంగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక పట్టణ సంస్థలు సాధించిన ప్రగతిని, అందించిన సహకారానికి గుర్తింపుగా  కేంద్ర పట్టణ వ్యవహారాలు,గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం అవార్డులు ప్రధానం చేస్తున్నది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం 2021 అవార్డులను శ్రీ హర్దీప్ ఎస్.పూరి అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ  పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్, తమిళనాడు, గుజరాత్ మరియు అస్సాం రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రులు,  కేంద్ర పట్టణ వ్యవహారాలు,గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి,  పలువురు ఇతర ప్రముఖులు    గృహ నిర్మాణ రంగానికి చెందిన వర్గాల ప్రతినిధులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.  
సహకార స్ఫూర్తి,  పోటీ సమాఖ్య స్ఫూర్తికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం పెద్ద ఉదాహరణగా నిలుస్తుందని  శ్రీ హర్దీప్ ఎస్.పూరి పేర్కొన్నారు. పథకాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కృషి చేస్తున్నాయని అన్నారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులు అమలు జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు, నూతన ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు రాష్ట్రాలు పూర్తి అధికారం కలిగి ఉన్నాయని శ్రీ హర్దీప్ ఎస్.పూరి వివరించారు. గృహ నిర్మాణ రంగంలో అగ్ర స్థానం సాధించేందుకు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి ఆరోగ్యకర వాతావరణంలో పోటీ పడుతున్నాయని వివరించారు. అయితే, ఈ పోటీలో అంతిమ విజేతలు ప్రజలు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అని  ఆయన  వ్యాఖ్యానించారు.
పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచిన వారికి వారిని సన్మానించడానికి మాత్రమే  పథకం అమలులో పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పాత్రకు గుర్తింపుగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశామని శ్రీ పూరి వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్, స్మార్ట్ సిటీ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్)  ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ప్రారంభమైన  స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) లో ప్రధాన పథకాలుగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్, స్మార్ట్ సిటీ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) అమలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా అమలు జరగని విధంగా పట్టణ ప్రాంతాల సమగ్ర సమీకృత అభివృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
ప్రధానమంత్రి  తీసుకున్న నిర్ణయాల వల్ల మేధోమధనం జరిగి నిర్మాణ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని శ్రీ హర్దీప్ ఎస్.పూరి వివరించారు. పర్యావరణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసి సకాలంలో లబ్దిదారులకు గృహ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
 ఈ నేపథ్యంలో గృహ నిర్మాణం  పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వరుసగా మార్చి 2019 మరియు అక్టోబర్ 2021లో గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్-ఇండియా (GHTC-ఇండియా) మరియు ఇండియన్ హౌసింగ్ టెక్నాలజీ మేళా (IHTM) నిర్వహించింది. ఏడాది  రాజ్‌కోట్‌లో ఇండియన్ హౌసింగ్ సదస్సు ఏర్పాటైందని  శ్రీ హర్దీప్ ఎస్. పూరి అన్నారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానం,  మెటీరియల్స్‌పై ఏర్పాటైన  ఎగ్జిబిషన్‌ని సందర్శించి వాటిని తమ ప్రాంతాలలో అమలు చేయడానికి కృషి చేయాలని ప్రతినిధులకు కేంద్ర మంత్రి సూచించారు. .
మే 2022లో ప్రధానమంత్రి మొదటి లైట్ హౌస్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయాన్నిఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు ప్రజలు చేరేలా చూసేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు సహకరించాయని అన్నారు.  ఎల్‌హెచ్‌జిపిలను  ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, ప్లానర్‌ల తరచు  తప్పనిసరిగా సందర్శించేలా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. దీనివల్ల భావి ఇంజినీర్లకు    నూతన సాంకేతిక పరిజ్ఞానంపై  అవగాహన కలుగుతుందని అన్నారు.

***



(Release ID: 1869478) Visitor Counter : 137