ఆర్థిక మంత్రిత్వ శాఖ

సబ్‌స్క్రైబర్ సెంట్రిక్ ఆన్‌లైన్ సేవలను అందించడానికి డిజి లాకర్ భాగస్వామ్య సంస్థగా మారిన పిఎఫ్ఆర్డిఏ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సిఆర్ఏ)


డిజి లాకర్ ద్వారా పెన్షన్ సొసైటీ ఏర్పాటు

Posted On: 18 OCT 2022 12:49PM by PIB Hyderabad

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ( పిఎఫ్ఆర్డిఏ) సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు (సిఆర్ఏలు) సబ్‌స్క్రైబర్ సెంట్రిక్ ఆన్‌లైన్ సేవలను అందించడానికి డిజి లాకర్ భాగస్వామ్య సంస్థలుగా మారాయి. 

75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్మరించుకుంటూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం,  పిఎఫ్ఆర్డిఏ డిజి లాకర్ ద్వారా క్రింది అదనపు ఫీచర్లను అందిస్తోంది:

  1. డిజీ లాకర్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్) ఉపయోగించి ఖాతా తెరవడం. 
  2. ప్రస్తుత చిరునామాను డిజీ లాకర్ ద్వారా డిఎల్ ని ఉపయోగించి నవీకరించడం U

కాబోయే సబ్‌స్క్రైబర్‌లు ప్రొటీన్ సిఆర్ఏ తో తమ ఖాతాలను తెరిచి, వారి చిరునామాను అప్‌డేట్ చేయడానికి ఇప్పటికే ఉన్న ప్రొటీన్  సిఆర్ఏ సబ్‌స్క్రైబర్లు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

డిజి లాకర్ అనేది డిజిటల్ ఇండియా కింద ఒక కీలకమైన చొరవ, ఇది భారతదేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా, పెన్షన్ పొందిన సొసైటీగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. డిజి లాకర్ సమ్మతి ఫ్రేమ్‌వర్క్‌తో పౌరులకు భాగస్వామ్యం చేయదగిన ప్రైవేట్ డిజిటల్ స్థలాన్ని అందించడం, అన్ని డాక్యుమెంట్‌లు/సర్టిఫికెట్‌లను డిజిటల్‌గా అందుబాటులో ఉంచడం, వంటి డిజిటల్ ఇండియా విజన్ రంగాలను స్వీకరిస్తుంది. డిజి లాకర్ నమోదిత వినియోగదారుల సంఖ్య దాదాపు 13 కోట్లు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకింగ్ & ఇన్సూరెన్స్, విద్య, ఆరోగ్యం మొదలైన వివిధ కేటగిరీల క్రింద జారీ చేసే పత్రాలు 5.60 బిలియన్లు.
 
డిజిలాకర్‌లో జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌ని ఉపయోగించి ఎన్ పి ఎస్ ఖాతా తెరవడానికి దశలు:

ప్రొటీన్ సిఆర్ఏ వెబ్‌సైట్‌లో ఎన్ పి ఎస్ రిజిస్ట్రేషన్ పేజీని తెరవండి. (https://enps.nsdl.com)
డిజిలాకర్‌తో డాక్యుమెంట్‌లతో కొత్త రిజిస్ట్రేషన్ ఎంపికను ఎంచుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్) ఎంచుకోండి.
దరఖాస్తుదారు డిజిలాకర్ వెబ్‌సైట్‌ లోకి ప్రవేశిస్తాడు... అక్కడ అతను లాగిన్ ఆధారాలతో లాగిన్ చేయవచ్చు మరియు సిఆర్ఏ పత్రాలు/సమాచారాన్ని పంచుకోవడానికి సమ్మతిని ఇవ్వవొచ్చు 
డిజిలాకర్, జారీ చేసిన పత్రాలను యాక్సెస్ చేయడానికి ఎన్ పి ఎస్ ని అనుమతించాలి .
డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం జనాభా సమాచారం, ఫోటో ఖాతా ప్రారంభ పేజీలో స్వయంచాలకంగా పూరించాలి 
దరఖాస్తును పూర్తి చేయడానికి పాన్, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారం, పథకం & నామినేషన్, ఇతర వివరాలను అందించండి.
ఎన్ పి ఎస్ సహకారం కోసం చెల్లింపు చేయవచ్చు.
ఎన్ పి ఎస్ ఖాతా విజయవంతంగా తయారవుతుంది 
 
                     ****


(Release ID: 1869087) Visitor Counter : 115