వ్యవసాయ మంత్రిత్వ శాఖ
నేడు మహిళా కిసాన్ దివస్ ను జరుపుకున్న వ్యవసాయం & రైతాంగ సంక్షేమ శాఖ, దాని పలు విభాగాలు
Posted On:
15 OCT 2022 4:22PM by PIB Hyderabad
వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ కింద పని చేస్తున్న స్వయం ప్రతిపత్తి గల సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంట్ ((MANAGE), నేషనల్ జెండర్ రిసోర్స్ సెంటర్ ఇన్ అగ్రికల్చర్ (ఎన్ జిఆర్ సిఎ), వ్యవసాయం, రైతుల సంక్షేమ డైరెక్టరేట్ సహకారంతో వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ మహిళా కిసాన్ దివస్ లేదా అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని 15 అక్టోబర్, 2022న నిర్వహించింది. ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో, ఈ సంవత్సరం మహిళా కిసాన్ దివస్ ఇతివృత్తం చిరుధాన్యాలు: మహిళకు సాధికారత, పౌష్టికాహర భద్రతను అందించడం. ప్రారంభ కార్యక్రమాన్ని వీడియో సమావేశం ద్వారా కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మార్గదర్శనంలో జరిగింది. కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక సెషన్ ను ఎంఎఎన్ఎజిఎ, హైదరాబాద్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), హైదరాబాద్ సాంకేతిక మద్దతుతో జరుగుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగాప్రకటించాలని 72 దేశాల మద్దతుతొ భారత ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏకగ్రీవంగా ఆమోదించి, 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా (ఐవైఒఎం) ప్రకటించింది. భారతీయ చిరుధాన్యాలు, వంటలు, విలువ జోడించిన ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఆమోదించే విధంగా భారత ప్రభుత్వం ఐవైఒఎం, 2023ను ప్రజా ఉద్యమంగా జరుపుకోవాలని ప్రకటించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం అన్నది అంతర్జాతీయ ఉత్పత్తిని పెంచే ప్రత్యేక అవకాశాన్ని కల్పించడమే కాక, సమర్ధవంతమైన ప్రాసెసింగ్ ను, వినిమయాన్ని ఖరారు చేసి, మెరుగైన పంట మార్పిడుల వినియోగాన్ని ప్రోత్సహించి, ఆహార పదార్ధాలలో చిరుధాన్యాలను కీలక అంశంగా ప్రోత్సహించేందుకు అన్ని ఆహార వ్యవస్థలలో మెరుగైన అనుసంధానాన్ని ప్రేరణను ఇస్తుంది. ప్రధాన మంత్రి దార్శనికత అయిన ఆత్మ నిర్భర్ భారత్ కు అనుగుణంగా వ్యవసాయాభివృద్ధి ప్రధాన స్రవంతిలోకి మహిళలను తీసుకువచ్చేందుకు ప్రాధాన్యతను ఇచ్చేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ తోమర్ పేర్కొన్నారు. ఆహార పదార్ధాల ప్రాథమిక ఉత్పత్తిదారులు, జీవవైవిధ్య పరిరక్షకులు మహిళలేనని, చిరుధాన్యాలు అనేవి దేశీయ ఆహార వ్యవస్థలలో ఒక ముఖ్యమైన ఆహార ధాన్యమని ఆయన అన్నారు. మారుతున్న కాలంతో వస్తున్న మార్పులకు సమాధానం చిరుధాన్యాల ఆధారిత వ్యవసాయమని, ఎందుకంటే చిరుధాన్యాల వ్యవసాయం జీవవైవిధ్యాన్ని పరిరక్షించడమే కాక మహిళా రైతులను వ్యవసాయదారులు నుంచి వ్యవసాయ వ్యాపారావేత్తలు, స్వయం ఉపాధి కలిగిన మహిళలుగా మార్చి, తమ సామర్ధ్యాలపై మరింత ఆత్మవిశ్వాసం, తమ సమస్యలను మెరుగ్గా పరిష్కరించుకునే శక్తిని ఇస్తుంది. మహిళలను అభివృద్ధి ప్రక్రియ కేంద్రంగా ఉంచి వారిని సాధికారం చేసే దృష్టితో భారత ప్రభుత్వంపలు చొరవలను తీసుకుంది. స్వయం సహాయక బృందాలు, రైతాంగ ఉత్పాదకుల సంస్థలు, ఉత్పత్తిదారుల కంపెనీలు, కృషి విగ్నాన కేంద్రాలు సహా పలు సంస్థలలో మహిళ సామర్ధ్య నిర్మాణం కోసం కార్యక్రమాలు వంటివి ఈ చొరవల్లో ఉన్నాయి.
***
(Release ID: 1868302)
Visitor Counter : 172