రక్షణ మంత్రిత్వ శాఖ
జాతీయ క్రీడలు 2022లో వరుసగా నాల్గవ సారి భారత సాయుధ దళాలు అత్యధిక పతకాలు సాధించాయి
Posted On:
13 OCT 2022 12:10PM by PIB Hyderabad
భారత సాయుధ దళాల జట్టు 61 బంగారు, 35 రజత మరియు 32 కాంస్య పతకాలను సాధించడం ద్వారా గుజరాత్‌లో ఇటీవల ముగిసిన 36వ జాతీయ క్రీడలు 2022లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ (SSCB) ఆధ్వర్యంలోని భారత త్రివిధ సాయుధ దళాల జట్టు సాయుధ దళాల అత్యుత్తమ సంప్రదాయాల వారసత్వం తో , క్రీడలలో అసాధారణమైన ధైర్యాన్ని, నైపుణ్యాన్ని మరియు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి, జాతీయ క్రీడలలో రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీలో గర్వించదగిన విజేతలుగా నిలిచారు.రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీ మొత్తం ఛాంపియన్‌లకు అందిస్తారు. జాతీయ క్రీడలలో భారత సాయుధ దళాల జట్టుకు ఇది వరుసగా నాలుగో మొత్తం ఛాంపియన్‌షిప్ ట్రోఫీ విజయం. అక్టోబర్ 12, 2022న సూరత్‌లోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగదీప్ ధన్‌ఖర్ ప్రెసిడెంట్ ఎస్ ఎస్ సి బీ (SSCB) ఎయిర్ మార్షల్ కే అనంతరామన్ మరియు ఎస్ ఎస్ సి బీ (SSCB) గ్రూప్ సెక్రటరీ కెప్టెన్ దినేష్ సూరికి ట్రోఫీని అందించారు. ఎయిర్ మార్షల్ సేవా సిబ్బంది తరపున దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన అందరికీ ట్రోఫీని అంకితం చేశారు. క్రీడాకారుల క్రమశిక్షణ మరియు అంకితభావానికి నిదర్శనంగా ఘనమైన పతకాన్ని సాధించారని సెక్రటరీ క్రీడాకారులను శ్లాఘించారు . ఎస్ ఎస్ సి బీ 1919లో స్థాపించబడింది . ఇది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఈ వారసత్వం కారణంగానే ఎస్ ఎస్ సి బీకి ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు జాతీయ క్రీడల్లో పాల్గొనే ప్రత్యేకత ఉంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే మూడు సర్వీస్‌లకు చెందిన అత్యుత్తమ అథ్లెట్‌లను ఇంటర్-సర్వీసెస్ స్థాయిలో జాతీయ క్రీడలు మరియు వరల్డ్ మిలిటరీ ఆటల పోటీల కోసం సాయుధ దళాల టీమ్‌లో భాగంగా ఎంపిక చేయడానికి మరియు పోటీ చేయడానికి కఠినమైన ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఎస్ ఎస్ సి బీ అనేది అన్ని సాయుధ దళాల ఉమ్మడి సంస్థ. ఇది సాయుధ దళాల సహచరత్వం మరియు నైతికత యొక్క అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి. ఎస్ ఎస్ సి బీ నుండి అనేక మంది త్రివిధ దళాల క్రీడాకారులు ఒలింపిక్స్ మరియు ఆసియా క్రీడలతో సహా పలు అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని పతకాలు మరియు గౌరవాలను గెలుచుకున్నారు. ఇటీవలి కాలంలో ఎస్ ఎస్ సి బీ యొక్క నిరంతర విజయాలు దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి త్రివిధ సాయుధ దళాల కృషి కి నిదర్శనం.
***
(Release ID: 1867482)
Visitor Counter : 271