పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇంధన భద్రత కల్పించి హరిత పరివర్తనకు అనుగుణంగా భారతదేశ ఇంధన ప్రణాళిక.. శ్రీ హర్దీప్ ఎస్.పూరి
కర్బన ఉద్గారాలు తగ్గించే హైడ్రోజన్ జీవ ఇంధన వనరుల వినియోగానికి చర్యలు అమలు జరుగుతున్నాయి .. శ్రీ హర్దీప్ ఎస్.పూరి
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి
Posted On:
12 OCT 2022 11:53AM by PIB Hyderabad
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో “భారత్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో అవకాశాలు” అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి హాజరయ్యారు. సమావేశంలో ప్రసంగించిన శ్రీ హర్దీప్ ఎస్. పూరి రానున్న రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతాయని అన్నారు. భారతదేశంలో 25% మేరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన ఇంధన ప్రణాళికకు రూపకల్పన చేసిందని శ్రీ హర్దీప్ ఎస్.పూరి తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇంధన భద్రత కల్పించి హరిత పరివర్తనకు అనుగుణంగా భారతదేశ ఇంధన ప్రణాళిక రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించే హైడ్రోజన్ జీవ ఇంధన వనరుల వినియోగానికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇంధన రంగంలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే, సవాళ్లు, సమస్యలు ఉన్నప్పటికీ ఇంధన పరివర్తన మరియు వాతావరణ పరిరక్షణ కోసం నిర్ణయించుకున్న లక్ష్యాల సాధన పట్ల భారతదేశం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.నిర్ణయించుకున్న లక్ష్యాలను భారతదేశం చేరుకుంటుందని చెప్పారు.
శ్రీ హర్దీప్ ఎస్. పూరి “భారత్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో అవకాశాలు” అనే అంశంపై యుఎస్ -ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీ హర్దీప్ ఎస్.పూరి అధ్యక్షత వహించారు. ఎక్సాన్‌మొబిల్, చెవ్రాన్, చియెనియర్, లాంజాటెక్, హనీవెల్, బేకర్‌హ్యూస్, ఎమర్సన్, టెల్లూరియన్ వంటి 35 ప్రముఖ ఇంధన సంస్థల ప్రతినిధులు, భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన దాదాపు 60 మంది ప్రతినిధులు రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.
ఇంధన వనరుల అన్వేషణ, ఉత్పత్తిని ప్రోత్సహించి హేతుబద్ధీకరించడానికి భారతదేశం ప్రధాన సంస్కరణలను అమలు చేస్తున్నదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి వివరించారు. నిషేధిత ప్రాంతాలను 99% వరకు తగ్గించి, 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. నేషనల్ డిపాజిటరీ రిజిస్ట్రీ మొదలైన వాటి ద్వారా నాణ్యమైన జియోలాజికల్ సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
అన్వేషణ, ఉత్పత్తి రంగానికి ప్రోత్సాహం అందించాలన్న నిర్ణయంలో భాగంగా ప్రపంచ చమురు మరియు గ్యాస్ రాజధాని (హ్యూస్టన్)లో ప్రత్యేక కోల్-బెడ్ మీథేన్ (CBM) రౌండ్, ఆఫ్‌షోర్ వేలం పాటను ప్రారంభించింది. దీనిలో 2.3 చదరపు లక్షల కి.మీ. 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నో గో ప్రాంతాలను వేలం కోసం ఉంచారు.
జీవ ఇంధనాలు, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, అప్‌స్ట్రీమ్ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరగడానికి అవకాశం ఉందని శ్రీ హర్దీప్ ఎస్.పూరి పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ప్రైవేటు రంగ సంస్థల సహకారంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని అన్నారు. ఈ అంశాలను శ్రీ హర్దీప్ పూరి వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు. "మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణ వల్ల భారతదేశంలో చమురు అన్వేషణ, ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి" అని ఆయన అన్నారు.
భారతదేశానికి సాంప్రదాయ ఇంధన వనరులు, నూతన ఇంధన వనరుల రంగంలో భారతదేశానికి అత్యుత్తమ-తరగతి సాంకేతికతలను అందించడానికి , భారతదేశంతో మరిన్ని ఒప్పందాలను కుదుర్చుకోవడానికి సమావేశానికి హాజరైన ప్రతినిధులు అంగీకరించారు.
***
(Release ID: 1867090)
Visitor Counter : 152