రైల్వే మంత్రిత్వ శాఖ

ప్ర‌యాణీకుల విభాగంలో ఆదాయం 92% పెరుగుద‌ల‌


రిజ‌ర్వ‌డ్ ప్యాసెంజ‌ర్ విభాగంలో 24%, అన్‌రిజ‌ర్వ‌డ్ ప్యాసెంజ‌ర్ విభాగంలో 197% వృద్ధిని న‌మోదు చేసిన రైల్వేలు

Posted On: 11 OCT 2022 4:42PM by PIB Hyderabad

భార‌తీయ రైల్వ‌లు ఒరిజినేటింగ్ ప్రాతిప‌దిక‌న 1 ఏప్రిల్ నుంచి 8 అక్టోబ‌ర్ 2022వ‌ర‌కు వ‌సూలు చేసిన మొత్తం ఆదాయం రూ. 22476 కోట్లుగా ఉంది. గ‌త ఏడాది ఇదే కాలంలో గ‌డించిన రూ. 17394 కోట్ల‌తో పోలిస్తే 92 శాతం వృద్ధిని న‌మోదు చేసింది. 
రిజ‌ర్వ‌డ్ ప్యాసెంజ‌ర్ విభాగంలో, 1 ఏప్రిల్ నుంచి 08 అక్టోబ‌ర్ 2022 కాలంలో బుక్ చేసుకున్న ప్యాసెంజ‌ర్ల మొత్తం స‌గ‌టు గ‌ణాంకాలు 42.98 కోట్లుగా ఉంది. గ‌త ఏడాది ఇదే కాలంలో బుక్ చేసుకున్న 34. 56 కోట్ల‌తో పోలిస్తే 24% వృద్ధిని చూపింది. రిజ‌ర్వ‌డ్ ప్యాసెంజ‌ర్ విభాగం 1 ఏప్రిల్ నుంచి 08 అక్టోబ‌ర్ 2022వ‌ర‌కు ఉత్ప‌త్తి అయిన ఆదాయం రూ. 26961 కోట్లుగా ఉంది. గ‌త ఏడాది  ఇదే కాలంలో ఆర్జించిన రూ. 16307 కోట్ల‌తో పోలిస్తే ఇది 65% వృద్ధి. 
ఇక అన్‌రిజ‌ర్వ‌డ్ ప్యాసెంజ‌ర్ వ‌ర్గంలో 1 ఏప్రిల్ నుంచి 08 అక్టోబ‌ర్ 2022 వ‌ర‌కు బుక్ చేసిన మొత్తం ప్ర‌యాణీకుల సంఖ్య 268.56 కోట్లుగా ఉంది. గ‌త సంవ‌త్స‌రం ఇదే కాలంలో న‌మోదు చేసిన 90.57 కోట్లతో పోలిస్తే  ఇది197% పెరుగుద‌ల‌ను చూపుతోంది. 
ఇక, 1 ఏప్రిల్ నుంచి 08 అక్టోబ‌ర్ 2022 వ‌ర‌కు అన్‌రిజ‌ర్వ‌డ్ ప్యాసెంజ‌ర్ విభాగం ద్వారా ఆర్జించిన ఆదాయం రూ. 6515 కోట్లుగా ఉంది. గ‌త ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1086 కోట్లుతో పోలిస్తే, వృద్ధి 500%గా ఉంది. 

***
 



(Release ID: 1866949) Visitor Counter : 138