సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

బంగ్లాదేశ్ సివిల్‌ సర్వెంట్లకు ముస్సోరీలోని ఎన్‌సిజిజిలో ప్రారంభమైన కెపాసిటీ బిల్డింగ్


బంగ్లాదేశ్‌లోని 1,800 మంది సివిల్‌ సర్వెంట్లకు 2025 నాటికి ఎంఈఏ భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వబడుతుంది

Posted On: 11 OCT 2022 12:57PM by PIB Hyderabad

బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్లకు ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండు వారాల 53వ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ముస్సోరీలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి)లో ఈరోజు ప్రారంభమయింది. 2019కి ముందు బంగ్లాదేశ్‌లోని పదిహేను వందల మంది సివిల్ సర్వెంట్లు ఎన్‌సిజిజిలో శిక్షణ పొందారు.మొదటి దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని మరో 1,800 మంది సివిల్ సర్వెంట్ల సామర్థ్య నిర్మాణాన్ని చేపట్టారు. ఇది 2025 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది.

అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ఉప నిర్భాయ్ అధికారులు/ఎస్‌డిఎంలు మరియు అదనపు డిప్యూటీ కమీషనర్లు వంటి బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్‌కు చెందిన 1,727 ఫీల్డ్ లెవల్ ఆఫీసర్‌లకు శిక్షణ ఇచ్చిన ఏకైక సంస్థ ఇది. బంగ్లాదేశ్‌లోని అప్పటి యాక్టివ్ డిప్యూటీ కమిషనర్లందరికీ కూడా ఇది శిక్షణ ఇచ్చింది. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించి ఒక దశాబ్దం అయ్యింది. అందువల్ల చాలా మంది ట్రైనీ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంలో అదనపు సెక్రటరీ మరియు సెక్రటరీ స్థాయికి చేరుకున్నారు. ఫలితంగా రెండు దేశాల మధ్య పాలనలో సమన్వయం ఏర్పడింది.

 

image.png

 

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను 2014లో భారత ప్రభుత్వం దేశంలో ఒక అత్యున్నత సంస్థగా ఏర్పాటు చేసింది. ఇది మంచి పాలన, విధాన సంస్కరణలు, శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు థింక్ ట్యాంక్‌గా పని చేయడంపై దృష్టి పెడుతుంది. ఎంఈఏ భాగస్వామ్యంతో ఇది అనేక ఇతర దేశాల సివిల్ సర్వెంట్ల సామర్థ్య నిర్మాణాన్ని చేపట్టింది. బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, భూటాన్, మయన్మార్ మరియు కంబోడియా వంటి 15 దేశాల సివిల్ సర్వెంట్లకు ఈ సంస్థ శిక్షణను ఇచ్చింది. ఈ శిక్షణలో పాల్గొన్న అధికారులు అది ఉపయోగకరంగా ఉన్నట్లు గుర్తించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల సివిల్ సర్వెంట్‌లకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అత్యాధునిక పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు సాధనాలతో సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సుపరిపాలన మరియు అంతిమంగా సుస్థిరమైన అభివృద్ధిని సాధిస్తుందని అంచనా వేయబడింది, తద్వారా చక్రాన్ని తిరిగి ఆవిష్కరించాల్సిన అవసరం లేదు. దేశంలో ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, పబ్లిక్ సర్వీసెస్ సార్వత్రికీకరణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల విధానం, సర్వీస్ డెలివరీలో ఆధార్ వినియోగం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ వంటి కార్యక్రమాలను కేంద్రం పంచుకుంటుంది.

కార్యక్రమంలో పాల్గొనేవారిని ఢిల్లీ మెట్రో, స్మార్ట్ సిటీ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలను పరిశీలించేందుకు కూడా తీసుకువెళతారు.


 

<><><><><>



(Release ID: 1866838) Visitor Counter : 155