వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
'గిఫ్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్' పనితీరును సమీక్షించిన వాణిజ్య మంత్రి
- గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలోని పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించిన శ్రీ గోయల్
- గుజరాత్‌లోని ఆభరణాల రంగ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి శ్రీ గోయల్
- 'ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్' (ఐఐబీఎక్స్) ద్వారా బంగారం పోటీ ధరలను కనుగొనాల్సిందిగా ప్రతినిధులను
కోరిన మంత్రి శ్రీ గోయల్
- గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్‌సీఏ) ప్రతినిధులతో మంత్రి సమావేశం
Posted On:
10 OCT 2022 5:51PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణి, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గిఫ్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పనితీరును సమీక్షించారు. గుజరాత్‌లోని సెజ్, డీసీ గిఫ్ట్ కార్యాలయం నిర్వహణకు సంబంధించిన పలు నియంత్రణ అంశాలకు సంబంధించిన సమస్యలను సమీక్షించారు. గిఫ్ట్ సిటీలో పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి సంభాషించారు.
“గిఫ్ట్ సిటీలో పరిశ్రమ ప్రతినిధులతో ఫలవంతమైన చర్చలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ యూనిట్ల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను చర్చించారు. ఎగుమతుల ప్రమోషన్, తయారీలో 'మేక్ ఇన్ ఇండియా' వంటి వాటితో సహా అద్భుతమైన సూచనలను అందుకున్నాం” అని శ్రీ గోయల్ తన సమావేశం గురించి ట్వీట్ చేశారు.
ఆభరణాల రంగ ప్రతినిధులతో చర్చలు..
దేశ బంగారం వ్యాపారానికి సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడానికి గిఫ్ట్ సిటీ లోని ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (ఐఐబీఎక్స్) వారితో మంత్రి చర్చలు జరిపారు; గోల్డ్ స్పాట్ ఎక్స్ఛేంజ్‌ని అమలు చేయడం, గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ ద్వారా ఆభరణాల ఎగుమతిదారుల కోసం గోల్డ్ మెటల్ రుణాల ధరను తగ్గించడం గురించి ఈ చర్చల్లో ముచ్చటించారు. “ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (ఐఐబీఎక్స్), గిప్ట్ సిటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాటిలో ఒకటి. ఐఐబీఎక్స్ ద్వారా బంగారం పోటీ ధరలను కనుగొనాలని ఆభరణాల రంగ ప్రతినిధులను కోరారు. భారతదేశం-యుఏఈ సీఈపీఏ వారికి ఎలాంటి గొప్ప అవకాశాలను కల్పిస్తుందో కూడా వివరించా్ం” అని ఆయన ట్వీట్ చేశారు. యుఏఈ ఎఫ్‌టీఏలో పొందిన బంగారంపై టీఆర్‌క్యూ వినియోగాన్ని ఐఐబీక్స్ నుండి ఆపరేట్ చేయడంతో సహా,ఐఐబీఎక్స్‌లో బంగారం వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఆదేశాలు జారీ చేశారు.
ఐఎఫ్ఎస్‌సీఏ ప్రతినిధులతోనూ సమావేశం..
శ్రీ గోయల్ గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్‌సీఏ) ప్రతినిధులను కలుసుకున్నారు. డీసీ గిఫ్ట్ సెజ్ మరియు ఐఎఫ్ఎస్‌సీఏ కార్యాలయంతో వివిధ పరిపాలనా సమస్యలను పరిష్కరించారు. ఐఎఫ్ఎస్‌సీఏ అనేది ఈపీసీ మరియు ఎగుమతిదారులతో ఎగుమతుల కాలానుగుణ సమీక్షలో పాల్గొనడం మరియు బంగారం ఎగుమతులను పెంచడానికి ఐఎఫ్ఎస్‌సీ ఆర్థిక అవస్థాపనను ఏ విధంగా ఉపయోగించవచ్చో తనిఖీ చేయడం తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
ఐ-హబ్‌లో యువ ఆవిష్కర్తలతోనూ సంభాషించారు..
"భారత వృద్ధి కథనం నుండి లాభపడే ప్రపంచ పెట్టుబడిదారులకు మెరుగైన వ్యాపారం చేయడం ద్వారా ఐఎఫ్ఎస్‌సీ ఆర్థిక వృద్ధికి కీలక చోదకంగా మారుతుంది" అని మంత్రి ఈ సమావేశంలో ట్వీట్ చేశారు. మంత్రి శ్రీ గోయల్ గిఫ్ట్ నగరంలో బ్యాంకర్లు, ఫండ్ మేనేజర్లు, డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్, విమానయాన పరిశ్రమ ప్రతినిధులతో కూడిన వివిధ యూనిట్ల అధిపతులతో కూడా ముచ్చటించారు. సీ&ఎల్ డీజీఎప్‌టీ మరియు సెజ్ యొక్క అనుబంధ కార్యాలయాలతో వారి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గిఫ్ట్ సిటీలో అందుబాటులో ఉన్న సౌకర్యాల నుండి స్టార్ట్ అప్ ఎకోసిస్టమ్ ప్రయోజనం పొందగలదా అని అంశాన్ని అన్వేషించేందుకు గాను పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ)కి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.అంతకుముందు మంత్రి ఐ-హబ్‌లో యువ ఆవిష్కర్తలు మరియు స్టార్టప్‌ల వారితో సంభాషించారు. “గుజరాత్ మరియు దాని ప్రజలకు అంతర్భాగమైన ఆవిష్కరణల స్ఫూర్తి. ఐ-హబ్‌లో యువ ఆవిష్కర్తలు మరియు స్టార్టప్‌లతో సంభాషించడం ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఆలోచనలు భారతదేశ భవిష్యత్తు అభివృద్ధికి ఎలా బాటలు వేస్తున్నాయో వారితో పంచుకున్నాను” అని మంత్రి ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
***
(Release ID: 1866614)
Visitor Counter : 172