హోం మంత్రిత్వ శాఖ
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన - కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం తెలిపారు
గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ములాయం సింగ్ యాదవ్ కి అంతిమ నివాళులు అర్పించిన అనంతరం వారి కుమారుడు శ్రీ అఖిలేష్ యాదవ్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించిన - శ్రీ అమిత్ షా
శ్రీ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఉత్తరప్రదేశ్ మరియు జాతీయ రాజకీయాల్లో భారీ శూన్యత ఏర్పడింది
శ్రీ ములాయం సింగ్ యాదవ్ తన అద్వితీయ రాజకీయ నైపుణ్యంతో దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు
ఎమర్జెన్సీ సమయంలో, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆయన ఉద్యమించారు; క్షేత్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన శ్రీ ములాయం మరణం - భారత రాజకీయాలలో ఒక శకానికి ముగింపు
Posted On:
10 OCT 2022 4:01PM by PIB Hyderabad
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. శ్రీ అమిత్ షా గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో శ్రీ ములాయం సింగ్ యాదవ్ కి నివాళులు అర్పించిన అనంతరం వారి కుమారుడు అఖిలేష్ యాదవ్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తో పాటు, జాతీయ రాజకీయాల్లో భారీ శూన్యత ఏర్పడిందని కేంద్ర హోం మరియు సహకార మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్ల లో పేర్కొన్నారు.
“శ్రీ ములాయం సింగ్ యాదవ్ తన అద్వితీయ రాజకీయ నైపుణ్యంతో దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆయన ఉద్యమించారు. అట్టడుగు స్థాయి నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.”
"ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి." అని అమిత్ షా పేర్కొన్నారు.
मुलायम सिंह यादव जी अपने अद्वितीय राजनीतिक कौशल से दशकों तक राजनीति में सक्रिय रहे। आपातकाल में उन्होंने लोकतंत्र की पुनर्स्थापना के लिए बुलंद आवाज उठाई। वह सदैव एक जमीन से जुड़े जननेता के रूप में याद किए जाएँगे। उनका निधन भारतीय राजनीति के एक युग का अंत है।
— Amit Shah (@AmitShah) October 10, 2022
दुःख की इस घड़ी में उनके परिजनों व समर्थकों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें। ॐ शांति शांति शांति
— Amit Shah (@AmitShah) October 10, 2022
मुलायम सिंह यादव जी के निधन से उत्तर प्रदेश व राष्ट्रीय राजनीति में एक बड़ी रिक्तता आयी है। गुरुग्राम के मेदांता अस्पताल में नेताजी को श्रद्धांजलि अर्पित की और उनके पुत्र अखिलेश यादव जी व परिजनों से भेंट कर संवेदना व्यक्त की। pic.twitter.com/G0jIAZKzqt
— Amit Shah (@AmitShah) October 10, 2022
*****
(Release ID: 1866612)
Visitor Counter : 193