సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ప్రాజెక్ట్ మౌసమ్ - జలధిపురయాత్రపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించిన ఏఎస్‌ఐ: హిందూ మహాసముద్ర సరిహద్దు దేశాలతో సంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడం దీని ఉద్దేశం

Posted On: 09 OCT 2022 2:26PM by PIB Hyderabad

రుతుపవనాలు మరియు ఇతర వాతావరణ కారకాలను ప్రభావితం చేసే మార్గాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ  'ప్రాజెక్ట్ మౌసం'ను ప్రారంభించింది. వివిధ సందర్భాలలో హిందూ మహాసముద్ర ప్రాంతంలోని వివిధ దేశాల మధ్య పరస్పర చర్యలను అర్థం చేసుకునేందు ఇది ఉపయోగపడుతుంది. ఖతార్‌లోని దోహాలో 2014లో జరిగిన యూనెస్కొ 38వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) నిర్వహిస్తోంది.

image.png


పరిశోధనను మరింత  ప్రోత్సహించడం అలాగే ఈ విషయంపై అవగాహనను విస్తృతం చేసే లక్ష్యంతో ఈ ఏడాది అక్టోబర్ 7, 8 తేదీల్లో న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ఏఎస్‌ఐ నిర్వహించింది. “జలధిపురయాత్ర: ఎక్స్‌ప్లోరింగ్ క్రాస్-కల్చరల్ లింకేజీస్ అలాంగ్ ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్” కాన్ఫరెన్స్ సముద్ర వాతావరణం మరియు పరస్పర చర్యలపై అనేక రకాల అంశాలను చర్చించింది.

కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్‌ను సాంస్కృతిక మరియు పార్లమెంట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ మరియు సాంస్కృతిక మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ప్రారంభించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్‌తో పాటు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పలు హిందూ మహాసముద్ర ప్రాంతీయ దేశాల రాయబారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

 

image.png


ఏఎస్‌ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (వరల్డ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్) శ్రీ జాన్‌విజ్ శర్మ ప్రముఖులు, అతిథులకు స్వాగతం పలికారు. భారతదేశ ఆర్థిక చరిత్రలో అంతగా తెలియని అనేక అంశాలను శ్రీ గోవింద్ మోహన్ తన ప్రసంగంలో ఆసక్తికరంగా వివరించారు. సభికులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీమతి మీనాక్షి లేఖి ఇతర దేశాలతో భారతదేశ ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలపై నిష్పాక్షికమైన పరిశోధన  అవసరాన్ని తెలిపారు. శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్  తన ప్రసంగంలో ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలపై అనేక ఆసక్తికరమైన చారిత్రక అంశాలను పంచుకున్నారు. ప్రాజెక్ట్ మౌసమ్  లక్ష్యాలు మరియు పరిధిపై భారతదేశ సముద్ర వారసత్వానికి చెందిన సంక్షిప్త రూపురేఖలతో కూడిన బ్రోచర్ మరియు భారతదేశ ప్రపంచ వారసత్వ ఆస్తుల జాబితాను ఈ సందర్భంగా విడుదల చేశారు.

ఈ కాన్ఫరెన్స్‌లో ప్లీనరీ సెషన్‌తో పాటు ఆరు అకడమిక్ సెషన్‌లు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి సముద్రానికి సంబంధించి భారతదేశ పరస్పర చర్యల నిర్దిష్ట అంశంతో వ్యవహరిస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని వివిధ దేశాలలో ఉన్న చారిత్రక ప్రదేశాలు మరియు నిర్మాణాలను గుర్తించడం మరియు అంతర్ దేశ సంబంధాలను ఉదహరించడం, తద్వారా యూనెస్కొ వరల్డ్ హెరిటేజ్ సర్టిఫికేషన్ కోసం ట్రాన్స్ నేషనల్ నామినేషన్  అర్హత పొందడం వంటి ప్రత్యేక సూచనలతో ప్రపంచ వారసత్వ ఆస్తులకు సంబంధించి ఒక సెషన్ ప్రత్యేకంగా ఉంది. అనంతరం జరిగిన సెషన్‌లో వివిధ హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల ప్రతినిధులు మరియు రాయబారులు ఈ ప్రాంతానికి చెందిన అంతర్-దేశ సంబంధాల  విభిన్న అంశాలను మరియు ప్రపంచ వారసత్వ హోదా కోసం ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలను జాతీయంగా నామినేట్ చేయడం గురించి చర్చించారు.

 

image.png

 

హిందూ మహాసముద్ర రిమ్ దేశాల విశిష్ట రాయబారులతో రెండవ రోజు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించబడింది. దీనికి అధ్యక్షత వహించిన సంస్కృతిక మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ప్రాజెక్ట్ మౌసమ్‌కు సంబంధించిన అంశాలను ముఖ్యంగా వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా వంటకాలు, వాస్తుశిల్పం మరియు కనిపించని సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఇతర అంశాల గురించి రాయబారులతో చర్చించారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇరవై మందికి పైగా మేధావులు కాన్ఫరెన్స్ అకడమిక్ సెషన్స్‌లో పాల్గొన్నారు. వీరిలో వాతావరణ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు వాతావరణ మార్పు, నీటి అడుగున అన్వేషణలు మరియు కనిపించని సాంస్కృతిక వారసత్వ రంగాలలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నిపుణులు ఉన్నారు.


 

*******



(Release ID: 1866274) Visitor Counter : 185