నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఐఆర్ఈడీఏలో "సైబర్ జాగురుకత దినోత్సవం"
Posted On:
07 OCT 2022 2:03PM by PIB Hyderabad
భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ) గురువారం "సైబర్ జాగురుకత దినోత్సవం"ను నిర్వహించింది. ఐఆర్ఈడీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శ్రీ ప్రదీప్ కుమార్ దాస్, టెక్నికల్ విభాగం డైరెక్టర్ శ్రీ చింతన్ షా, సంస్థ సీవీఓ శ్రీమతి మనీషా సక్సేనా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకేఎస్ ఐటీ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్ శ్రీ అలోక్ కుమార్ సైబర్ హైజీన్ సాధనపై ఐఆర్‌ఈడీఏ ఉద్యోగులతో తన అనుభవాలను పంచుకున్నారు. సైబర్ జాగురుకత దినోత్సవం అనేది కేందర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక చొరవ, దీని ద్వారా అన్ని ప్రభుత్వ సంస్థల వారికి సైబర్ సెక్యూరిటీ అవగాహనను వ్యాప్తి చేయడమే ప్రధాన ధ్యేయం. దీనిని ఇది ప్రతి నెల మొదటి బుధవారం నాడు నిర్వహిస్తారు. సైబర్ మోసాలు, సైబర్ క్రైమ్‌ల నుండి రక్షించడంపై ఇంటర్నెట్ వినియోగదారులకు అవగాహన కల్పించడం మరియు చైతన్యం కలిగించడం దీని ఉద్దేశ్యం.
***
(Release ID: 1865922)
Visitor Counter : 164