ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెవెన్యూ లోటు గ్రాంటు (ఆర్ డి జి) కింద 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల


ఇప్పటి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం రెవెన్యూ
గ్రాంటులు రూ.50,283.92 కోట్లకు చేరిక

రాష్ట్రాలు 2022-23 సంవత్సరానికి రూ.86,201 కోట్ల రెవెన్యూ గ్రాంటును పొందుతాయి

Posted On: 06 OCT 2022 2:45PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని  వ్యయ విభాగం గురువారం 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్ల పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ లోటు (పీడీఆర్డి) గ్రాంట్ కి సంబంధించిన 7వ నెలవారీ వాయిదాను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ గ్రాంట్‌ విడుదలైంది.

పదిహేనవ ఆర్థిక సంఘం మొత్తం డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాలకు రూ.86,201 కోట్లుగా నిర్ణయించారు. సిఫార్సు చేసిన గ్రాంట్‌ను 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు అయిన రాష్ట్రాలకు వ్యయ విభాగం విడుదల చేస్తుంది. అక్టోబర్, 2022 నెలలో 7వ విడత విడుదలతో, 2022-23లో రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ లోటు గ్రాంట్ల మొత్తం రూ. 50,282.92 కోట్లు.

విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు అందిస్తారు. విభజన తర్వాత రాష్ట్రాల రెవెన్యూ ఖాతాల్లోని అంతరాన్ని తీర్చడానికి వరుసగా ఆర్ధిక కమీషన్ల సిఫార్సుల మేరకు గ్రాంట్లు రాష్ట్రాలకు విడుదల అవుతాయి. 

2020-21 నుండి 2025-26 వరకు రాష్ట్రాలు ఈ గ్రాంట్‌ని స్వీకరించడానికి అర్హత, గ్రాంట్ పరిమాణాన్ని పదిహేనవ ఆర్థిక సంఘం అంచనా వేసిన తర్వాత రాష్ట్ర ఆదాయ, వ్యయాల మదింపు మధ్య అంతరం ఆధారంగా ఈ డివల్యూషన్ నిర్ణయించారు. 

2022-23లో పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా డివల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సిఫార్సు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్.

2022-23కి సిఫార్సు చేసిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్, 7వ విడతగా రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

రాష్ట్రాల వారీగా విడుదలయిన డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్ ( పీడీఆర్డిజి

 

 

(రూ.కోట్లలో)

వ.సంఖ్య 

రాష్ట్రం 

2022 అక్టోబర్ నెలకు విడుదలైన 7వ వాయిదా 

రాష్ట్రానికి 2022-23లో విడుదలైన మొత్తం  పీడీఆర్డీజీ 

1

ఆంధ్రప్రదేశ్ 

879.08

6153.58

2

అస్సాం 

407.50

2852.50

3

హిమాచల్ ప్రదేశ్ 

781.42

5469.92

4

కేరళ 

1097.83

7684.83

5

మణిపూర్ 

192.50

1347.50

6

మేఘాలయ 

86.08

602.58

7

మిజోరాం 

134.58

942.08

8

నాగాలాండ్ 

377.50

2642.50

9

పంజాబ్ 

689.50

4826.50

10

రాజస్థాన్ 

405.17

2836.17

11

సిక్కిం 

36.67

256.67

12

త్రిపుర 

368.58

2580.08

13

ఉత్తరాఖండ్ 

594.75

4163.25

14

పశ్చిమ బెంగాల్ 

1132.25

7925.75

 

****


(Release ID: 1865592) Visitor Counter : 204